ఇంటర్ అకడమిక్ క్యాలెండర్ విడుదల.. పరీక్షల విధానంలో కీలక మార్పులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా మహమ్మారి కారణంగా చాలా కాలం ఆన్‌లైన్ పాఠాలకే పరిమితయ్యారు విద్యార్థులు.. ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో.. స్కూళ్లు, కాలేజీలు, విద్యాసంస్థలు తిరిగి తెరుచుకున్నాయి.. ఇక, 2021-22 విద్యా సంవత్సరాన్ని అకాడమిక్ క్యాలెండర్ విడుదల చేసింది తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు.. ఈ విద్యాసంవత్సరంలో మొత్తం 220 పని దినాలు ఉండగా.. ఈ సారి పరీక్షల విధానంలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. అర్ధ సంవత్సరం, ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ఆన్‌లైన్ తరగతులతో కలిపి విద్యా సంవత్సరంలో మొత్తం 220 పని దినాలుంటాయని తెలిపింది. దసరాకు పండుగకు ఆదివారంతో కలిపి అక్టోబర్ 13వ తేదీ నుంచి 16 వరకు సెలవులు ఇచ్చింది. 17న ఆదివారం కాగా.. 18న తరగతులు ప్రారంభమవుతాయని తెలిపింది. డిసెంబర్ 13 నుంచి 18వ తేదీ వరకు అర్ధ సంవత్సర పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది ఇంటర్ బోర్డు..
రెండు టర్మ్స్ గా ఇంటర్ అకాడమిక్ ఇయర్ ఉండనుంది.. మొదటి అర్మ్ సెప్టెంబర్ 1 నుండి డిసెంబర్ 18 వరకు కాగా.. అక్టోబర్ 13 నుండి 17 వరకు దసరా సెలవులు.. డిసెంబర్ 13 నుండి 18 వరకు అర్థ సంవత్సరం పరీక్షలు ఉంటాయి.. ఇక, డిసెంబర్ 20 నుండి ఏప్రిల్ 13 వరకు సెకండ్ టర్మ్ ఉండనుంది.. జనవరి 13 నుండి 16 వరకు సంక్రాంతి సెలవులు ఇచ్చిన ఇంటర్ బోర్డు.. మార్చి 23 నుండి ఏప్రిల్ 12 వరకు ఇంటర్ వార్షిక పరీక్షలు ఉంటాయని పేర్కొంది.. చివరి వర్కింగ్ డే ఏప్రిల్ 13 అయితే.. ఏప్రిల్ 14 నుండి మే 31 వరకు వేసవి సెలవులుగా నిర్ణయించింది.. ఈ ఏడాది వంద శాతం సిలబస్ ఉంటుందని.. సిలబస్ లో ఎలాంటి తగ్గింపు లేదని స్పష్టం చేసింది.. దసరా లోపు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించనుండగా.. విద్యార్థులు అందరు పరీక్ష రాయాల్సిందే… ఎలాంటి మినహాయింపులు ఉండవని తెలిపింది.. ఇంటర్ అయిపోయిన విద్యార్థులకు ఇంప్రూవ్ మెంట్ రాసుకునే అవకాశం కల్పించింది బోర్డు.
Also Read
- Vemulawada: శవం ముందు ఆస్తి పంచాయితీ! వేములవాడలో మానవత్వం మంటగలిసిన వైనం..
- CM Revanth Reddy: మనకు ఏ రాష్ట్రంతోనూ పోటీ లేదు, నేరుగా చైనా, జపాన్తోనే పోటిపడుతున్నాం..
- Harassment: గురూజీ వలలో సాఫ్ట్వేర్ ఉద్యోగి భార్య.. అంతా చాటింగ్ల ద్వారానే..
- Indiramma Indlu: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త.. అదనంగా మరో రూ.72 వేలు అకౌంట్లోకి..
తాజావార్తలు
-
Radha Krishna: చాలా కాలం తర్వాత మీడియా ముందుకు రాధే శ్యామ్ దర్శకుడు
-
CJP: ‘‘దేశాన్ని నాశనం చేస్తున్నారు’’.. అభిజిత్ దీప్కేకు ఢిల్లీ ఎయిర్పోర్టులో అవమానం..
-
Vemulawada: శవం ముందు ఆస్తి పంచాయితీ! వేములవాడలో మానవత్వం మంటగలిసిన వైనం..
-
e-SPRINTO G1: రూ.లక్షలోపే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్క ఛార్జ్తో 130 కి.మీ. రేంజ్!
-
Railway Bonus: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్, సామాజిక పింఛన్లకు రూ.53,428 కోట్లు!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..