అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేకు కుచ్చుచోపి పెట్టారు కేటుగాళ్లు.. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఏకంగా 12 ఎకరాలకు పైగా భూమి అమ్మేశారు.. ఆ భూమి కోసం ఎమ్మెల్యే కోట్ల రూపాయలు వెచ్చించగా… అసలు భూ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ఈ వ్యవహారం మొత్తం వెలుగు చూసింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. విశాఖ జిల్లా ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు రాజుకు ఈ మధ్య ఓ భూమిని కొనుగోలు చేశారు.. దొంగ పత్రాలతో 12 ఎకరాల 26 సెంట్ల భూమిని ఎమ్మెల్యేకు అమ్మేశారు ఘరానా మోసగాళ్లు.. దీని కోసం ఎమ్మెల్యే.. కోట్లలో వెచ్చించినట్టుగా తెలుస్తుండగా.. ఆ భూమికి సంబంధించిన అసలు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ఈ వ్యవహారం బయటపడింది.. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన నగర పోలీసులు.. భూమిని అమ్మిన ఇద్దరు నిందితులను ఇప్పటికే పట్టుకోగా.. పరారీలో మరో నిందితుడు ఉన్నట్టుగా చెబుతున్నారు పోలీసులు.