కరోనా మహమ్మారి వెటకారంగా మాట్లాడుతున్నారంటూ తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ఫైర్ అయ్యారు మాజీ ఎంపీ, బీజేపీ నేత విజయశాంతి… జూబ్లీహిల్స్ శ్రీరాంనగర్‌లోని వ్యాక్సిన్ సెంటర్‌ను పరిశీలించిన ఆమె.. వ్యాక్సినేషన్ ప్రక్రియను దగ్గరుండి పరిశీలించారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కరోనా గురించి సీఎం కేసీఆర్ వెటకారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.. ఇప్పటికైనా కేసీఆర్ వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించిన ఆమె.. సీఎం బాధ్యతగా ఉండి ఉంటే ఇన్ని ప్రాణాలు పోయేవికావన్నారు. పారాసిట్మాల్ తో కరోనా తగ్గితే యశోదా ఆస్పత్రిలో ఎందుకు చికిత్స […]
బ్యాంకుకు రుణాలు, ఇతర అవసరాల కోసం వచ్చే మహిళలను లోబర్చుకుంటూ.. ఏకంగా బ్యాంకులోనే రాసలీలలు సాగిస్తున్న బ్యాంకు మేనేజర్ వ్యవహారం సీసీ కెమెరాలకు చిక్కింది… ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరు జిల్లా పొదలకూరులోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) బ్రాంచ్ మేనేజర్ చేష్టలు రోజురోజుకీ మితిమీరిపోతున్నాయి.. బ్యాంకుకు వచ్చే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు ఆ కామాంధుడు.. లోన్ల కోసం వచ్చేవారిని తన ఛాంబర్లోకి పిలిచి సొల్లు కబుర్లు చెబుతుంటాడు.. ఇక, […]
70 ఏళ్లలో జరగని అభివృద్ధి తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏడేళ్లలోనే జరిగిందన్నారు ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావు.. సిద్దిపేట జిల్లా ములుగు మండలం క్షీర సాగర్ గ్రామంలో పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 70 ఏళ్లలో జరగని అభివృద్ధి ఏడేళ్ల కేసీఆర్ పాలనలో చేసి చూపించారని తెలిపారు.. యాసంగిలో దేశంలో అత్యధిక వరి సాగు రాష్ట్రంలో జరిగిందన్న ఆయన.. యాసంగిలో 52 […]
తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య గత కొంత కాలంగా కృష్ణా నది జలాల విషయంలో మాటలు, లేఖల యుద్ధం నడుస్తోంది.. ఈ తరుణంలో.. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ జూమ్ మీటింగ్ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.. ఈ సమావేశంలో కృష్ణా నీటి పంపకాలపై ప్రధానంగా చర్చించనున్నారు.. ఏపీ, తెలంగాణ మధ్య నీటి పంపకాలు, వివాదాలు, ఏపీ నిర్మిస్తున్న సంగమేశ్వర ప్రాజెక్ట్‌పై తదితర అంశాలపై ఫోకస్ పెట్టనున్నారు. ఇక, నీటి పంపకాల విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ వైఖరిని […]
భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన నలుగురు బంగ్లాదేశ్‌కు చెందిన యువకులను అరెస్ట్ చేవారు బెజవాడ పోలీసులు.. పోలీసుల విచారణలో తుల్లానా జిల్లా నుండి భారత్‌లోకి ప్రవేశించినట్టుగా తెలిపారు.. ఆ తర్వాత హావ్ డా – వాస్కోడిగామా రైలులో వెళ్తుండగా బెజవాడలో అదుపులోకి తీసుకున్నారు రైల్వే పోలీసులు.. పాస్ పోర్ట్ లేకుండా నల్లాల ద్వారా భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించినట్టు గుర్తించారు.. దర్బంగా ఘటనతో అప్రమత్తమైన పోలీసులు.. అసలు ఆ యువకులు ఏపీలోకి రావడానికి గల కారణాలపై లోతుగా దర్యాప్తు చేపట్టారు.. […]
కరోనా కల్లోలం సృష్టిస్తూ ఎంతోమంది ప్రాణాలు తీసింది.. ఇది కూడా అదునుగా భావించినవారు కూడా లేకపోలేదని.. వెలుగుచూస్తున్న కొన్ని ఘటనలు చెబుతున్నాయి… తాజాగా హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో దారుణం జరిగింది.. భార్యను హత్యచేసి కరోనాతో మృతి చెందినట్టు చిత్రీకరించి.. భార్య మృతదేహానికి అంత్యక్రియలు చేయించాడు భర్త.. అయితే, అతని ప్రవర్తనపై అత్తింటివారికి అనుమానం వచ్చింది. దీంతో, తమ కూతురు కరోనాతో మృతి చెందలేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు మృతురాలు కవిత తల్లిదండ్రులు.. ఇక, రంగంలోకి దిగిన పోలీసులు.. […]
కరోనా వైరస్ పంజా విసిరనప్పటి నుంచి క్రమంగా రైళ్లు పట్టాలు ఎక్కడం తగ్గిపోయింది.. అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక రైళ్లు నడుపుతూ వచ్చినా.. పూర్తిస్థాయిలో నడపలేదు.. ఇక, కోవిడ్ సెకండ్ వేవ్ కలకలం సృష్టించడంతో.. నడిచే రైళ్లు కూడా నిలిపివేసిన పరిస్థితి.. అయితే, క్రమంగా కేసులు తగ్గుతోన్న నేపథ్యంలో.. ఆయా రాష్ట్రాలు మెట్రో రైళ్లను, ఎంఎంటీఎస్‌లను క్రమంగా పట్టాలెక్కిస్తున్నాయి.. మరోవైపు రైల్వేశాఖ ఇప్పటికే పలుమార్గాల్లో ప్యాసింజర్లతో పాటు ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడుపుతుండగా.. పలు రూట్లలో పెద్ద ఎత్తున రైళ్లను […]
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారిపై విజయం సాధించాలంటే ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. దేశీయంగా రెండు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నా.. టీకాల కొరతకు చెక్ పెట్టేందుకు విదేశీ వ్యాక్సిన్లకు సైతం అనుమతి ఇస్తోంది భారత్… ఇక, వేటి సామర్థ్యం ఎంత? అవి.. డెల్టా వేరియంట్లపై ప్రభావం చూపుతాయా? అనే చర్చ సాగుతోంది.. ఈ తరుణంలో.. కోవాగ్జిన్ ఫేజ్-3 క్లినికల్ ట్రయల్స్ తుది ఫలితాలను విడుదల చేసింది భారత్ బయోటెక్. ట్రయల్స్‌లో టీకా తీవ్రమైన, మితమైన కేసుల్లో 77.8 […]
పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు షెడ్యూల్ విడుదలైంది. ఈనెల 19వ తేదీన ప్రారంభమయ్యే పార్లమెంట్ సెషన్స్ ఆగస్టు 13వ తేదీ వరకూ కొనసాగుతాయి. ఇక వర్షాకాల సమావేశాల్లో పలు కీలక బిల్లులను సభ ముందుకు తీసుకురానుంది మోడీ ప్రభుత్వం. విద్యుత్ పంపిణీ రంగంలోకి ప్రైవేట్ కంపెనీలను అనుమతించే బిల్లు కూడా ఇందులో ఉంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సాధారణంగా జులై మూడో వారంలో ప్రారంభమై ఆగస్టు 15వ తేదీ లోపల ముగుస్తుంటాయి. సమావేశాలకు సిద్ధం కావాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ […]
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే తెలంగాణ మంత్రి కేటీఆర్.. తన దృష్టికి వచ్చిన సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరానికి పురమాయిస్తూ ఉంటారు… తాజాగా, రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణానికి చెందిన శంకర్ గౌడ్ అనే వ్యక్తి తన ఇంటి అనుమతి కోసం వేధిస్తున్నారంటూ సాక్షాత్తు రాష్ట్ర మంత్రి కేటీఆర్ కు ట్విట్టర్లో తన ఆవేదన వ్యక్తపరిచాడు. ఇంటి అనుమతి కోసం నిబంధనల ప్రకారం డబ్బులు చెల్లించినప్పటికి ఇక్కడ కొందరు డబ్బుల కోసం తనకు అనుమతి ఇవ్వడం లేదంటూ […]