కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణకు రానున్నారు.. ఈ నెల 17న తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన నిర్మల్‌కు వచ్చేయనున్నారు.. తెలంగాణ విమోచన సభను నిర్మల్ లో నిర్వహించేందుకు బీజేపీ రాష్ట్ర నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.. అయితే, 17వ తేదీన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు బ్రేక్ పడనుంది.. ఇప్పటికే సంజయ్ పాదయాత్ర 100 కిలోమీటర్ల మైలు రాయిని దాటేసింది.. అయితే, 17వ తేదీన బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర కామారెడ్డి చేరుకోనుంది.. కామారెడ్డిలో పాదయాత్రకు బ్రేక్ ఇచ్చి.. నిర్మల్‌లో జరిగే తెలంగాణ విమోచన సభకు హాజరుకానున్నారు. కాగా, నిర్మల్‌లోని వెయ్యి ఊడల మర్రి దగ్గర సభ నిర్వహించే యోచనలో బీజేపీ నేతలు ఉన్నట్టుగా తెలుస్తోంది..