అమెరికాలో వేడిగాలుల తీవ్రత ఎక్కువైంది. దీంతో ఎప్పుడు చల్లగా ఉండే అంటార్కిటికా సైతం వేగంగా వేడెక్కుతున్న ప్రాంతాల్లో ఒకటిగా మారిందని అక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 6న అంటార్కిటికాలో రికార్డు స్థాయిలో 18.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు వెల్లడించింది. ఇక అంటార్కిటికాలో గత 50 ఏళ్లలో దాదాపు మూడు డిగ్రీల సెల్సియస్ మేరకు సగటు ఉష్ణోగ్రత పెరిగినట్లు డబ్ల్యూఎంవో సెక్రటరీ జనరల్ పెటేరి తాలాస్ చెప్పారు. మంచు కొండలు ఎక్కువగా […]
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో అర్థరాత్రి డ్రోన్లు కలకలం సృష్టించాయి… శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయ పరిసరాల్లో ఆకాశంలో అనుమానాస్పదంగా డ్రోన్ కెమెరాలు చక్కర్లు కొట్టినట్టు చెబుతున్నారు.. డ్రోన్ల కదలికలను గుర్తించిన పోలీసులు, ఆలయ సిబ్బంది వాటిని పట్టుకోవడానికి ప్రయత్నాలు చేసినా అవి చిక్కలేదు.. అయితే, నాలుగు రోజులుగా రాత్రిపూట ఆలయ పరిసరాల్లో ఆకాశంలో డ్రోన్లు ఎగురుతున్నట్టుగా గుర్తించారు పోలీసులు… అర్ధరాత్రి పూట డ్రోన్లు తిరగడంతో శ్రీశైలంలో ఏమి జరుగుతుందోనని భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు స్థానికులు, భక్తులు.. […]
భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా కిందికి దిగివస్తోంది.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 43,071 మంది కోవిడ్‌బారిన పడ్డారు.. మరో 955 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు.. ఇదే సమయంలో 52,299 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు కేంద్రం పేర్కొంది… దీంతో.. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా నమోదైన కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 3,05,45,433కు చేరుకోగా… మొత్తం రికవరీ కేసులు 2,96,58,078కి పెరిగాయి… […]
ఉత్తరాఖండ్ 11వ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు పుష్కర్ సింగ్ ధామి..! 45 ఏళ్ల వయసులో ముఖ్యమంత్రి పీఠం అందుకోబోతున్నారు. ఆరెస్సెస్ దాని అనుబంధ సంఘాల్లో 33 ఏళ్ల పాటు సేవలు అందించిన పుష్కర్ సింగ్.. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు..! అయితే సీఎం పీఠం అందుకోబోతున్న ఆయనకు సవాళ్లు అదే స్థాయిలో స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నాయి. కాగా, ఉత్తరాఖండ్‌లో ముఖ్యమంత్రుల మార్పు ఆసక్తికరంగా మారింది. నాలుగు నెలల్లోనే మూడో వ్యక్తి సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. తీరత్ […]
యూపీ స్థానిక ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగలడంతో అసెంబ్లీ ఎన్నికలపై ప్రధానంగా దృష్టి సారించింది బీజేపీ. అయితే తాజాగా జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 75 జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. బీజేపీ ఏకంగా 65 జిల్లా పరిషత్‌లను దక్కించుకున్నారు. ఎస్పీ పార్టీకి ఆరు దక్కాయి. ఇతరులు ఓ స్థానంలో గెలిచారు. అయితే అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి పెట్టామని చెప్పిన బీఎస్పీ అధినేత్రి మాయావతి.. ఈ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. […]
కృష్ణా జలాల విషయంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన మంత్రులు, నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తుండగా.. ఇప్పుడు రైతుల కూడా ఎంట్రీ ఇచ్చారు.. కృష్ణాజలాల విషయంలో తెలంగాణ ప్రభుత్వ ఉల్లంఘనలకు పాల్పడుతుందంటూ తెలంగాణ హైకోర్టుకెక్కారు ఏపీ రైతులు.. కృష్ణా జిల్లాకు చెందిన రైతులు గూడవల్లి శివరామ కృష్ణ ప్రసాద్, ఎమ్. వెంకటప్పయ్య హైకోర్టులో హౌస్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.. కేంద్ర జలవనరులశాఖ, కేఆర్ఎంబీ, తెలంగాణ జెన్ కో, తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు, ఏపీ ఇరిగేషన్ శాఖలను ప్రతివాదులుగా […]
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హరితహారం పేరుతో చెట్లు నాటడం, పెంపకంపై ప్రత్యేక దృష్టి సారించింది కేసీఆర్ ప్రభుత్వం… ప్రతీఏడాది 20 కోట్లకు పైగా మొక్కలు నాటుతున్నారు.. నాటడమే కాదు.. వాటి రక్షణకు కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఇక, ఆదిలాబాద్ జిల్లాలో గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు కోసం మొక్కలు నాటే కార్యక్రమానికి సిద్ధమయ్యారు. ఆదిలాబాద్ జిల్లా లో గంటలో లక్షన్నర మొక్కలు నాటే కార్యక్రమం ద్వారా గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు ఎక్కనున్నారు.. ఈఒక్కరోజే […]
తెలుగు రాష్ట్రాల మధ్య వాటర్ వార్ సాగుతోన్న సమయంలో ఇరు రాష్ట్రాల సీఎంలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి.. ఇవాళ ఉదయం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న నారాయణ స్వామి.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ మంచి ఆలోచన అభిమానంతో ఆంధ్రకి సహకరిస్తామన్నారు.. రాయలసీమ జిల్లాలకు నీరు అందించాలని ఆకాంక్షించారు. తెలుగు రాష్ర్టాల్లో ప్రజలు తల్లిబిడ్డలు కలిసి ఉన్నారని… సీఎం జగన్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే అభిమానం.. కేసీఆర్‌కి కూడా జగన్ […]
చమురు కంపెనీలు ఆదివారం మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. దీనివల్ల సామాన్యుల ఇబ్బంది మరింత పెరిగింది. క్షీణిస్తున్న ఆదాయం మధ్య సామాన్యులు ఇప్పటికే ద్రవ్యోల్బణంతో పోరాడుతున్నారు. దేశ రాజధానిలో పెట్రోల్ రిటైల్ ధర 35 పైసలు పెరిగి లీటరుకు 99.51 రూపాయలకు చేరుకుంది. అదే సమయంలో, లీటరుకు 18 పైసలు పెరిగిన తరువాత డీజిల్ రూ.89.36కు చేరింది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్‌పై 36 పైసలు, డీజిల్‌పై 20 పైసలు పెరగడంతో.. పెట్రోల్ ధర రూ.103.41కు, డీజిల్ […]
తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేయనున్నారు. సీఎం కేసీఆర్ రాక కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. సీఎంకు ఘనస్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. ఇక, సీఎం పర్యటనను మంత్రి కేటీఆర్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఆయన నిన్ననే పర్యటించి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న అన్ని కార్యాలయాలను సందర్శించారు. పలు సూచనలు చేశారు. ఇవాళ ఉదయం 8 గంటలకు హైదరాబాద్ నుంచి రోడ్డుమార్గంలో బయల్దేరనున్నా సీఎం […]