సోషల్ మీడియాలో కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు.. ఏదిపడితే అది పెడుతూ ఆందోళనకు గురిచేసేవాళ్లు కొందరైతే.. మతవిశ్వాసాలను దెబ్బకొట్టే విధంగా.. రెచ్చగొట్టే విధంగా.. దేవుళ్లు, ఆలయాలు, ప్రార్థనా మందిరాలు.. ఇలా అన్నింటిపై పోస్టులు పెట్టేవారు ఉన్నారు. అయితే, ఈ మధ్య కొందరు ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంపై కూడా పోస్టులు పెడుతున్నారు.. వారికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి.. శ్రీశైలం ఆలయ ప్రతిష్ట దిగజార్చే పోస్టులు పెట్టేవారిపై చర్యలు తీసుకుంటాం అన్నారు శిల్పా చక్రపాణిరెడ్డి.. దేవస్థానంపై అసత్య ప్రచారం చేసేవారు ఏ పార్టీ వారైనా వదిలిపెట్టేది లేదని హెచ్చరించిన ఆయన.. శ్రీశైలం-దోర్నాల-ఆత్మకూరు నాలుగు లైన్ల రోడ్డుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు వెల్లడించారు.. త్వరలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి శ్రీశైల దేవస్థానం అభివృద్ధిపై చర్చిస్తాం అన్నారు ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి. కాగా, ఈ మధ్యే కుటుంబసభ్యులతో కలిసి.. శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకున్న అమిత్‌షా.. ప్రత్యేక ప్రార్థనలు చేసిన సంగతి తెలిసిందే.