తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం తారాస్థాయికి చేరి ఫిర్యాదుల వరకు వెళ్లింది.. జల విద్యుత్ ఉత్పత్తి విషయంలో తెలంగాణపై ఏపీ ఫిర్యాదు చేస్తే.. ఆర్డీఎస్ విషయంలో ఏపీపై తెలంగాణ ఫిర్యాదు చేసింది.. అయితే ఇవాళ రెండు రాష్ట్రాలకు కృష్ణా నదీ జలాల యాజమాన్య బోర్డు లేఖలు రాసింది.. ఇప్పటికే తెలంగాణ చేపడుతున్న విద్యుత్ ఉత్పత్తికి నీటి వినియోగం ఆపాలని తెలంగాణ జెన్కోకు లేఖ రాసిన కేఆర్ఎంబీ.. శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల జల విద్యుత్ ప్రాజెక్టుల్లో.. […]
కృష్ణా, గోదావరి నదుల నిర్వహణ బోర్డులకు సంబంధించి రెండు గెజట్ నోటిఫికేషన్లను జారీ చేయనుంది కేంద్ర ప్రభుత్వం.. రేపు మధ్యాహ్నం 1.45 గంటలకు కేంద్ర జలశక్తి శాఖ.. కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిని నిర్ధారిస్తూ గెజిట్ నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు సిద్ధమైంది.. ఈ గెజిట్ నోటిఫికేషన్లు 2014లోనే విడుదల చేయాల్సి ఉండగా, అనేక అవాంతరాలతో.. ఇప్పటికే విడుదలకు సిద్ధమయ్యాయి.. ఇటీవల తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలు మరింత ముదరడంతో.. కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు […]
కృష్ణా జలాల విషయంలో తెలుగు రాష్ట్రాల మంత్రుల మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది.. ఆ తర్వాత ఫిర్యాదులు, లేఖలు ఇలా ముందుకు సాగింది.. ఇప్పుడు.. తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది కృష్ణా నదీ జలాల యాజమాన్య బోర్డు.. ఇప్పటికే కేఆర్ఎంబీకి.. ఏపీ నుంచి, తెలంగాణ నుంచి లేఖలు వెళ్లగా.. తెలంగాణ చేపడుతున్న విద్యుత్ ఉత్పత్తికి నీటి వినియోగం ఆపాలని తెలంగాణ జెన్కోకు ఇప్పుడు కేఆర్ఎంబీ లేఖ రాసింది. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ఫిర్యాదు మేరకు నీటి విడుదల […]
హెచ్ఎండీఏ.. కోకాపేట భూముల వేలానికి అనూహ్య స్పందన వచ్చింది… అధికారులు అంచనా వేసినకంటే ఎక్కువ ధరకు అమ్మాడు పోయాయి భూములు… ఈ వేలం ప్రభుత్వానికి రూ.3 వేల కోట్లకు పైగా ఆదాయాన్ని తెచ్చిపెట్టినట్టు చెబుతున్నారు.. కోకాపేటలోని 49.92 ఎకరాలను ఎంఎస్టీసీ వెబ్సైట్ ద్వారా హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) వేలం నిర్వహించింది.. ఒక్కో ఎకరం కనీస ధర రూ.25 కోట్లుగా నిర్ధారించగా.. వేలంలో రూ.60 కోట్లు పలికినట్టు తెలుస్తోంది.. దీనికి కాసేపట్లో అధికారికంగా ప్రకటన చేయనున్నారు అధికారులు.. […]
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన కొనసాగుతూనే ఉంది.. అయితే, రైతులపై పలు సెక్షన్ల కింద కేసులు పెట్టి వేధిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.. తాజాగా హర్యానాలో వంద మంది రైతులపై ఏకంగా దేశద్రోహం అభియోగాలు మోపడం సంచలనంగా మారింది.. ఇంతకీ వీరు చేసిన దేశద్రోహం ఏంటంటే.. హర్యానా డిప్యూటీ స్పీకర్, బీజేపీ నేత రణబీర్ గంగ్వా వాహనంపై దాడి చేసినట్టు ఆరోపణలు రావడమే.. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఈ నెల 11న […]
జేఈఈ మెయిన్స్ నాల్గో విడత ఎంట్రెన్స్ తేదీల్లో మార్పులు చోటు చేసుకున్నాయి… ఈ నెల 28వ తేదీ నుండి వచ్చే నెల 2వ తేదీ వరకు పరీక్షలు జరగనుండగా… నెల రోజులు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది ప్రభుత్వం… మూడో విడత జేఈఈకి.. నాల్గో విడత జేఈఈ సెషన్‌కి మధ్య నెల రోజుల గడువు ఉండాలనే విజ్ఞప్తితో తేదీలు రీషెడ్యూల్ చేసినట్టు పేర్కొన్నారు.. కొత్త షెడ్యూల్ ప్రకారం.. ఆగస్టు 26, 27, 31, సెప్టెంబర్ 1, 2 తేదీల్లో […]
తెలంగాణ కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 710 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా… మరో నలుగురు మృతిచెందారు.. ఇదే సమయంలో 808 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు… దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,34,605కు చేరుకోగా.. రికవరీల సంఖ్య 6,20,757కు పెరిగింది.. ఇక, ఇప్పటి వరకు కరోనాతో మృతిచెందినవారి సంఖ్య 3,747కు చేరుకుంది.. గత 24 […]
జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ నేత నారా లోకేష్‌పై హాట్ కామెంట్లు చేశారు ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్… విశాఖ, యలమంచిలి భూసర్వే బహిరంగ సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్షమైనా, నాయకుడైనా సద్విమర్శలు చేయాలని సూచించారు. లోకేష్, పవన్ కళ్యాణ్ గురించి ఎక్కువ మాట్లాడ్డం నాకు ఇష్టం ఉండదన్న ఆయన.. వాళ్లకు ఏ జ్ఞానం ఉండదు… వాళ్ల కంటే గ్రామాల్లో ఉండే సామాన్యులు బెటర్ అంటూ సెటైర్లు వేశారు.. పవన్ కల్యాణ్ మంచి […]
కరోనా మహమ్మారితో స్కూళ్లు, విద్యాసంస్థలు అన్నీ మూతపడ్డాయి.. విద్యార్థులు ఆన్లైన్ పాఠాలకే పరిమితం అయ్యారు.. ఇప్పటికీ కరోనా సెకండ్ వేవ్ పూర్తిగా అదుపులోకి రాకపోగా.. మరోవైపు థర్డ్ వేవ్ హెచ్చరికలు భయపెడుతున్నాయి.. దీంతో.. ఇప్పట్లో విద్యార్థులు స్కూల్‌కు వెళ్లే పరిస్థితి కనిపించడంలేదు.. కొన్ని రాష్ట్రాలకు క్లాసుల నిర్వహణకు సిద్ధం అయినా.. థర్డ్ వేవ్ వార్నింగ్‌లతో వెనక్కి తగ్గారు.. అయితే, ఇప్పట్లో భౌతికంగా తరగతులు నిర్వహించలేమని స్పష్టం చేశారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. కరోనా థర్డ్ వేవ్ […]