ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పొదుపు మంత్రం పటిస్తోంది… ప్రభుత్వ ఖర్చులు తగ్గించుకునే అంశంపై కసరత్తు చేస్తోంది… ఆదాయం తక్కువగా ఉండడంతో ఖర్చుల తగ్గించుకునే అంశంపై ఫోకస్ పెట్టారు అధికారులు.. పొదుపు పాటిస్తూనే.. ఆదాయం చేజారకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నతాధికారులతో కమిటీ నియమించింది సర్కార్.. సీఎస్ నేతృత్వంలో ఆర్థిక శాఖ, సీసీఎల్ఏ, జీఏడీ శాఖలకు చెందిన ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు అయ్యింది… ప్రజలకు మెరుగైన సేవలందిస్తూనే పరిపాలనా పరంగా పొదుపు పాటించే అంశంపై కసరత్తు చేయనుంది ఈ కమిటీ… […]
2021-24 ఐటీ పాలసీ విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. వచ్చే మూడేళ్లల్లో ప్రత్యక్షంగా 55 వేల మందికి, పరోక్షంగా 1.65 లక్షల మందికి ఉపాధి కల్పించే దిశగా ఐటీ పాలసీ రూపకల్పన చేశారు.. ఇన్క్యూబేషన్ సెంటర్లు, స్టార్టప్స్కు అధిక ప్రాధాన్యం ఇచ్చింది సర్కార్.. ఐటీ ఎమర్జింగ్ టెక్నాలజీస్ రీసెర్చ్ యూనివర్శిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకోనున్నారు.. రానున్న పదేళ్ల కాలంలో వివిధ మార్గాల ద్వారా పన్నుల రూపంలో రూ. 783 కోట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు అధికారులు.. ఐటీ […]
తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంచింది.. అయితే, ప్రభుత్వ ఉద్యోగుల మాదిరే సింగరేణి కార్మికుల పదవీ విరమణ వయస్సును 61 ఏళ్లకు పెంచాలని కోరుతూ ఇవాళ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం.. ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసి కోరింది. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ప్రతినిధులు, సింగరేణి ప్రాంత ఎమ్మెల్యే, ఎంపీలు ప్రగతి భవన్లో కేసీఆర్ను కలిసి.. ఈ మేరకు విజ్ఞప్త చేశారు.. అయితే, వారి వినతిపై సీఎం సానుకూలంగా […]
కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ పూర్తిగా అదుపులోకి రాకముందే థర్డ్ వేవ్ హెచ్చరికలు భయపెడుతున్నాయి.. తాజాగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా థర్డ్ వేవ్ ప్రారంభ దశలో ఉందని.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వార్నింగ్ ఇచ్చింది.. దీనిపై స్పందించిన నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్… ప్రపంచమంతా కరోనా థర్డ్ వేవ్ వైపు మల్లుతోందని.. కొన్ని దేశాల్లో పరిస్థితి దారుణ స్థితికి చేరిందని డబ్ల్యూహెచ్వో చేసిన హెచ్చరికను తేలికగా తీసుకోవడం లేదన్నారు. అయితే, […]
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చక్రం తిప్పిన సీనియర్ పొలిటిషన్, రాజ్యసభ సభ్యులు డి. శ్రీనివాస్ ఇప్పుడు సైలెంట్గా ఉన్నారు.. ఆయన కుమారుడు ఒకరు బీజేపీ నుంచి ఎంపీగా ప్రతినిథ్యం వహిస్తుండగా.. మరొకరు కాంగ్రెస్ పార్టీలో కీలక భూమిక పోషించడానికి సిద్ధం అవుతున్నారనే ప్రచారం సాగుతోంది.. ఇక, సార్వత్రిక ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో.. టీఆర్ఎస్కు కూడా దూరమైన డీఎస్.. తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ప్రచారం కూడా నడుస్తోంది.. ఈ నేపథ్యంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు […]
నామినేటెడ్ పోస్టులు ఇవాళ ప్రకటించాల్సి ఉన్నా… రేపటికి వాయిదా పడింది… అయితే, కసరత్తు పూర్తి కాకపోవడంతో.. పోస్టుల ప్రకటన వాయిదా వేశామని.. రేపు ఉదయం వెల్లడిస్తామని తెలిపారు సజ్జల రామకృష్ణారెడ్డి… నామినేటెడ్ పదవుల్లో సామాజిక న్యాయం చేయాల్సి ఉందన్న ఆయన.. మహిళలకు కూడా 50 శాతం పదవులు ఇస్తున్నాం.. కసరత్తులో కొంత అలస్యం అయ్యిందన్నారు.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన సజ్జల.. పార్టీకోసం ముందు నుంచి పని చేస్తున్న వారు, సామాజిక న్యాయం అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని నామినేటెడ్ […]
భూముల వేలం తెలంగాణ ప్రభుత్వానికి భారీగా ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది… నిన్న కోకాపేటలో రూ.2 వేల కోట్లకు పైగా ఆదాయం రాగా.. ఇవాళ సైబరాబాద్లో హైటెక్ సిటీ సమీపంలోని ఖానామెట్లోని భూముల వేలానికి విశేష స్పందన లభించింది. ఎంఎస్టీసీ ద్వారా నిర్వహించిన ఈ వేలంలో మొత్తం అయిదు ప్లాట్లను విక్రయించారు. 14.91 ఎకరాలకు గాను రూ. 729.41 కోట్ల ఆదాయం వచ్చినట్టు ప్రకటించారు అధికారులు.. గరిష్టoగా ఎకరానికి రూ.55 కోట్ల ధర పలకగా.. 15 ఎకరాలకు అవరేజ్ గా […]
తెలంగాణలో గత కొంతకాలంగా కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి… రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 715 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కగా.. మరో నలుగురు కరోనా బాధితులు మృతిచెందారు.. ఇక, ఇదే సమయంలో 784 మంది కరోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్లో పేర్కొంది సర్కార్.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,35,320కు చేరగా… రికవరీ కేసులు 6,21,541కు పెరిగాయి.. ఇప్పటి వరకు […]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించిన తర్వాత.. నిరుద్యోగులు రోడ్డెక్కి ఆందోళనకు దిగుతున్నారు.. వారి ఆందోళనకు పలు ప్రజాసంఘాలు మద్దతుగా నిలుస్తుండగా.. ఇప్పుడు జనసేన పార్టీ కూడా రంగంలోకి దిగింది.. నిరుద్యోగులకు అండగా జనసేన పోరాటం చేస్తుందని ప్రకటించారు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. ఈ నెల 20న అన్ని జిల్లాల్లోని ఎంప్లాయ్మెంట్ అధికారులకు వినతిపత్రాలు ఇవ్వాలని సూచించారు.. అన్ని ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను జాబ్ క్యాలెండర్లో చేర్చాలని డిమాండ్ చేసిన జనసేనాని… లక్షల్లో ఉద్యోగాలు […]