ఓవైపు విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ వైపు వేగంగా అడుగులు పడుతున్నాయి.. మరోవైపు వివిధ రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు.. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్వహిస్తున్నాయి.. ఈ తరుణంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. విశాఖ స్టీల్ ప్లాంట్ ను అమ్మనివ్వమని స్పష్టం చేసిన ఆయన.. అందరికి ఉద్యోగాలు ఉంటాయి.. స్టీల్ ప్లాంట్‌ను మరింత అభివృద్ధి చేస్తామని చెప్పుకొచ్చారు.. ఇప్పటి వరకు స్టీల్ ప్లాంట్ ను కాపాడుకుంటు […]
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.. కొత్త జోనల్ వ్యవస్థ, కొత్త జిల్లాల ప్రకారంగా అన్ని రకాల ఉద్యోగుల విభజన జరగాలని, తద్వారా జిల్లాల వారీగా జోన్ల వారీగా అన్ని ఖాళీలను గుర్తించాలని, వాటితో పాటు ప్రమోషన్ల ద్వారా ఏర్పడే ఖాళీలను భర్తీ చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది కేబినెట్.. సమాజంలో, ఉద్యోగ రంగాల్లో చోటుచేసుకుంటున్న అధునాతన మార్పులకు అనుగుణంగా, వినూత్న రీతిలో ఉద్యోగాల కల్పన అవసరమని.. అందుకు సరికొత్త పోస్టుల అవసరం […]
సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో వరుసగా రెండోరోజు సమావేశమైన తెలంగాణ కేబినెట్.. పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయం తీసుకుంది… రాష్ట్రంలో ధాన్యం దిగుబడి రోజు రోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను పెద్ద ఎత్తున స్థాపించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి దశలో కనీసం 10 జోన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 500 ఎకరాలకు తగ్గకుండా 1000 ఎకరాల వరకు తెలంగాణ స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్స్ ఏర్పాటు చేసి […]
కరోనా మహమ్మారి కేసులు క్రమంగా తగ్గుతున్నా.. ఇంకా ఆందోళన కలిగిస్తూనే ఉన్నాయి.. తాజాగా.. నిజామాబాద్ జిల్లా నందిపేటలో కరోన కలకలం సృష్టించింది.. సూర్యాపేట నుండి వచ్చిన వలస కూలీలకు 16 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది… దీంతో. వారితో కలిసి పనిచేసినవారిలో టెన్షన్ మొదలైంది.. దీంతో.. వారితో కలిసి పనిచేసిన 200 మంది వలస కూలీలకు రేపు కరోనా నిర్ధారణ పరీక్షలు చేసేందుకు సిద్ధం అవుతున్నారు వైద్యశాఖ అధికారులు.. మరోవైపు కరోనా పాజిటివ్ వచ్చిన వారిని […]
విమానంలో అరుదైన ఘటన చోటు చేసుకుంది.. ఓ ఎంపీ పైలట్‌గా మారి విమానాన్ని గాల్లో ఎగిరిస్తే.. మరో ఎంపీ ప్రయాణికుడికిగా అతడితో పాటు ప్రయాణం చేశారు.. అయితే, ఇద్దరూ సుపరిచితులు కావడంతో.. వారి పలకరింపులు, ఒకరిని చూసి ఒకరు ఆశ్చర్యానికి గురికావడం ఆ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడంతో.. ఆ అరుదైన ఘటన అందరికీ ఆసక్తికరంగా మారిపోయింది. ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. డీఎంకే సీనియర్ ఎంపీ దయానిధి మారన్, బీజేపీ ఎంపీ […]
ఓవైపు ప్రభుత్వ భూముల వేలానికి ప్రభుత్వం సిద్ధమవుతోన్న తరుణంలో.. మరోవైపు.. ఆ భూములు ఎవరూ కొనవద్దు.. హైకోర్టు విచారణ పూర్తి అయ్యేవరకు ఆగాలని సూచిస్తున్నారు మాజీ ఎంపీ, బీజేపీ నేత విజయశాంతి.. రేపటి కోకాపేట, ఖానామెట్ భూముల వేలం ఆపేందుకు హైకోర్టు నిరాకరించడంతో భూముల వేలానికి మార్గం సుగమం కాగా.. కోకాపేటలో 44.94 ఎకరాలు, ఖానామెట్ లో 14.92 ఎకరాల భూముల వేలానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.. అయితే, భూముల అమ్మకం విషయంలో ప్రభుత్వానికి హై కోర్టు మొట్టికాయలు […]
రాహుల్ గాంధీ.. త్వరలోనే కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవి చేపడతారంటూ ఎప్పటి నుంచో ప్రచారం సాగుతోంది.. అయితే, ఆ బాధ్యతలను ప్రస్తుతానికి సోనియా గాంధీ చూస్తున్నారు.. సార్వత్రిక ఎన్నికల తర్వాత అనూహ్యంగా రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ బాధ్యతల నుంచి తప్పుకున్నా.. వ్యవహారాలను చక్కబెట్టడంలో కీలకంగా వ్యవహరిస్తూనే ఉన్నారు.. ఇక, ఆయనను కాంగ్రెస్ అధ్యక్ష పీఠంపై కూర్చొబెట్టడం ఖాయమనే ప్రచారం జరుగుతోన్న తరుణంలో.. అధ్యక్ష బాధ్యతల కంటే ముందుగా మరో కీలక పదవి కట్టబెట్టడానికి అధిష్ఠానం రెడీ అయినట్టు […]
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచేది ఈటల రాజేందరేనని.. దానికి సంబంధించిన సర్వే నివేదికలు కూడా వచ్చాయని తెలిపారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్.. ఢిల్లీలో ఇవాళ కేంద్రమంత్రి అమిత్ షాతో తెలంగాణ బీజేపీ నేతలు భేటీ అయ్యారు.. 15 నిమిషాల పాటు సమావేశం జరిగింది.. అనంతరం మీడియాతో మాట్లాడిన బండి సంజయ్.. బీజేపీలో ఈటల రాజేందర్ చేరిన రోజే అమిత్ షాను కలవాలని అనుకున్నాం.. అప్పుడు కుదరలేదు కాబట్టి సమయం తీసుకుని ఈ రోజు వచ్చి […]