వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య… షర్మిల దీక్షపై స్పందించిన ఆయన.. ఖమ్మంలో మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ నిరుద్యోగంతో నిరాశ నిస్పృహలతో టీఆర్ఎస్ ప్రభుత్వంపై షర్మిల విమర్శలు చేయడం అర్ధ రహితం అన్నారు.. మీ నాన్న వైఎస్ఆర్ ప్రభుత్వంలో అందరికి ఉద్యోగాలు ఇచ్చారా..? అని ప్రశ్నించిన ఆయన.. తన రాజకీయ నిరుద్యోగాన్ని పరిష్కరించులేక నిరుద్యోగ దీక్షలు చేపట్టారంటూ సెటైర్లు వేశారు.. అన్ని రంగాల్లో ఉద్యోగులను తెలంగాణ ప్రభుత్వం […]
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కౌశిక్‌రెడ్డి.. టీఆర్ఎస్లో పార్టీలో చేరారు… తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో టీఆర్ఎస్ కండువా కప్పి.. కౌశిక్‌రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. ఇక, కౌశిక్‌రెడ్డి వెంట వచ్చిన అనుచరులను పార్టీలోకి ఆహ్వానించారు కేసీఆర్. కాగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన కౌశిక్‌రెడ్డి.. మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేతిలో ఓటమిపాలయ్యారు. ఇక, ఈ మధ్య ఆయనకు సంబంధించిన […]
బ్యాంకులకు వేల కోట్ల ఎగనామం పెట్టి విదేశాలకు చెక్కేసిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీని చివరకు లండన్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు.. ఇక, ఆయన్ను భారత్‌కు అప్పగించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి.. ఈ వ్యవహారంపై లండన్ కోర్టులో అప్పీల్‌కు వెళ్లిన నీరవ్ మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు.. తనను భారత్‌కు అప్పగించొద్దని కోర్టుకు కోరిన నీరవ్… తనను భారత్‌కు అప్పగిస్తే ఆత్మహత్యే శరణ్యమన్నారు. కాగా, కొద్ది రోజుల క్రితం నీరవ్‌కు లండన్ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. హైకోర్టు అప్పీల్‌కు […]
ప్రజలను ఆకర్షించడానికి ఆయా కంపెనీలు, సంస్థలు, హోటళ్లు.. ఇలా చాలా మంది ఆఫర్లు పెడుతుంటారు… దీంతో.. ప్రజలు తమ వెసులుబాటును బట్టి.. కొనుగోళ్లకు మొగ్గు చూపుతుంటారు.. ఇక, బిర్యానీపై ఆఫర్ పెడితే.. అది కూడా 5 పైసలకే ఓ బిర్యానీ అంటే వదిలిపెడతారా..? ఎగబడి మరీ బిర్యానీ తీసుకోవడానికి పోటీపడ్డారు.. ఓవైపు కరోనా మహమ్మారి భయాలో ఉన్నా.. కోవిడ్ రూల్స్‌ను ఏ మాత్రం పట్టించుకోకుండా.. బిర్యానీ దొరికితే చాలు అనే రీతిలో ఎగబడ్డారు ప్రజలు. ఐదు పైసలకే […]
పెగాసస్.. ఫోన్ల హ్యాకింగ్ వ్యవహారం ఇప్పుడు భారత్‌లో సంచలనంగా మారింది… ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తుండగా.. పార్లమెంట్ సమావేశాలను సైతం పెగాసస్ వ్యవహారం కుదిపేస్తోంది.. ఈ తరుణంలో.. సంచలన వ్యాఖ్యలు చేశారు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. ప్రజాస్వామ్య భారత్‌ను మోడీ సర్కారు నిఘా దేశంగా తయారు చేయాలనుకుంటోందని దుయ్యబట్టిన ఆమె.. పెగాసస్‌కు భయపడి తన ఫోన్‌కు ప్లాస్టర్ వేసుకున్నానని తెలిపారు.. కేంద్ర ప్రభుత్వ విపరీత చర్యలకు కూడా ప్లాస్టర్ […]
ఓవైపు ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంటే.. మరోవైపు పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీలో విభేదాలు ముదిరిపోతున్నాయి… సీఎం అమరీందర్ సింగ్, పీసీసీ కొత్త చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూకి అసలు పొసగకుండా తయారవుతోంది పరిస్థితి.. కాంగ్రెస్ అధిష్టానం, సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ జోక్యం చేసుకుని సిద్ధూకి పీసీసీ చీఫ్ పోస్టు ఇచ్చిన తర్వాత కూడా పరిస్థితి సద్దుమనిగినట్టు కనిపించడంలేదు.. ఇక, తనకు మద్దతుగా ఉన్న 62 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఇవాళ సిద్ధూ సమావేశం అయ్యారు.. అమృత్‌సర్‌లోని […]
మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై కేసు నమోదు చేయాలని త్రీటౌన్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది కరీంనగర్ మున్సిఫ్ కోర్టు.. హిందూ దేవతలను ప్రతిజ్ఞ ద్వారా కించపరిచారంటూ న్యాయవాది బేతి మహేందర్‌రెడ్డి ఫిర్యాదు చేయగా… ప్రవీణ్ కుమార్‌పై కేసు నమోదుకు మున్సిఫ్ కోర్టు జడ్డి ఆదేశాలు జారీ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాల్సిందిగా మూడో పట్టణ పోలీసు స్టేషన్ ఎస్‌హెచ్‌వోకు ప్రిన్సిపాల్ జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్మేజిస్ట్రేట్ సాయిసుధ ఆదేశాలు ఇచ్చారు. కాగా, […]
కరోనా కట్టడి కోసం విధించిన నైట్ కర్ఫ్యూను మరోసారి పొడిగించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుతవం… రాష్ట్రంలో కరోనా కేసులు, తాజా పరిస్థితి, తీసుకోవాల్సిన కట్టడి చర్యలపై మంగళవారం సీమక్ష నిర్వహించిన సీఎం వైఎస్ జగన్.. నైట్ కర్ఫ్యూని పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.. దీంతో.. ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం.. రాత్రి కర్ఫ్యూని ఈ నెల 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది ఏపీ ప్రభుత్వం… కాగా, ప్రస్తుతం నైట్ కర్ఫ్యూను రాత్రి 10 గంటల […]
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి… మరో మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది… వాయువ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాలలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 కిమీ నుంచి 7.6 కిలోమీటర్ల మధ్య విస్తరించి ఉండగా.. దాని ప్రభావంతో, వచ్చే 48 గంటలలో వాయువ్య బంగాళాఖాతం, పరిసరాల్లో అల్ప పీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని.. వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వర్షాలు […]
టిక్‌టాక్ యాప్ తక్కువకాలంలోనే ఎంతో ఆదరణ పొందింది.. ఎంతోమంది కళాకారులను ప్రపంచానికి పరిచయం చేసిందనే చెప్పాలియ.. అయితే, భారత్-చైనా మధ్య ఉద్రిక్తత నేపథ్యంలో.. ఈ చైనా యాప్‌పై భారత్ నిషేధం విధించింది.. దీంతో.. కనుమరుగైపోయింది.. కానీ, టిక్‌టాక్ ఇప్పుడు పేరు మార్చుకుని తిరిగి దేశంలో అడుగుపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది.. ఆ యాప్ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్ కొత్తగా టిక్‌టాక్ (ఖీజీఛిజు ఖీజీఛిజు) అన్న పేరును ట్రేడ్‌మార్క్‌గా దరఖాస్తు చేసుకోవడంతో.. మళ్లీ ఆ సంస్థ ప్రయత్నాలు ఆరంభించిందనే అనుమానాన్ని వ్యక్తం […]