కరోనా ఎంతో మంది ప్రాణాలు తీసింది.. కొన్ని కుటుంబాలనే పొట్టనపెట్టుకుంది.. తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన చిన్నారులు ఎందరో.. అయితే, కరోనా మహమ్మారి ఇద్దరు ప్రేమికులను కూడా బలితీసుకుంది… ప్రియురాలు కరోనాబారినపడి కన్నుమూస్తే.. ప్రియుడు ఆ విషయాన్ని జీర్ణించుకోలేపోయాడు.. ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విశాఖలో జరిగింది. గుంటూరులో కరోనాతో ప్రియురాలు మృతిచెందితే.. విశాఖలోని గాజువాక కణితి రోడ్డులోని ఓ రూమ్‌లో బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు యువకుడు.
తెలంగాణ పెరిగిన భూముల ధరలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే రేట్ల పెంపుపై ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్… వ్యవసాయ భూములపై 50 శాతం పెంచింది. కనిష్ఠ మార్కెట్ విలువ ఎకరాకు 75 వేలుగా నిర్ణయించింది. ప్రస్తుతం ఆయా ఏరియాల్లో ఉన్న మార్కెట్ విలువలకు అనుగుణంగా 3 స్లాబ్ లు చేసింది. ఓపెన్ ప్లాట్ల చదరపు గజం కనీస ధర 100 రూపాయల నుంచి 200 లకు పెంచిన సర్కార్… 50 శాతం, 40 శాతం, […]
ఏపీలో దాదాపు అన్ని జిల్లాలో కరోనా కేసులు తగ్గాయి. కాని తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం కేసులు అదుపులోకి రావడం లేదు. దీంతో కారణాలపై ప్రభుత్వం ఆరా తీస్తుండడంతో అధికారులు ఇప్పుడు పరుగులు తీస్తున్నారు. గడచిన కొన్ని వారాలుగా పాజిటివ్ జిల్లా తొలి స్థానంలో కొనసాగుతుండడంతో ఎందుకిలా అనే దానిపై సమీక్ష నిర్వహిస్తున్నారు. గడిచిన ఇరవై రోజుల్లో జిల్లాలో 10,944 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కర్ఫ్యూ వేళలు పొడిగించారు. చింతూరు, పి.గన్నవరం మండలాల్లో మధ్యాహ్నం రెండు నుంచి […]
దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి.. మళ్లీ పెరుగుతున్నాయి.. కరోనా థర్డ్ వేవ్ ఇప్పటికే ప్రారంభమైందన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు కలవరపెడుతున్నాయి… ఇక, కేరళలో సెకండ్ వేవ్‌లో భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి.. ఈ మధ్య కాస్త తగ్గుముఖం పట్టినా.. మరోసారి భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదు అవుతున్నాయి.. దీంతో.. అప్రమత్తమైన ప్రభుత్వం.. వీకెండ్లో పూర్తిస్థాయిలో లాక్డౌన్ విధించాలని నిర్ణయానికి వచ్చింది.. ఈ నెల 24, 25 తేదీల్లో (శనివారం, […]
తెలంగాణలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి… రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 691 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా… మరో ఐదుగురు కరోనా బాధితులు మృతిచెందారు. ఇక, కరోనా రికవరీ కేసులు తగ్గుముఖం పట్టాయి… 24 గంటల్లో 565 మంది కోవిడ్ బాధితులు కోలుకున్నారు.. దీంతో.. పాజిటివ్ కేసుల సంఖ్య 6,38,721కు చేరుకోగా… పూర్తిస్థాయిలో కోలుకున్నవారి సంఖ్య 6,25,042కు పెరిగింది.. ఇక, ఇప్పటి వరకు కోవిడ్‌తో […]
కరోనా సమయంలోనూ సంక్షేమ పథకాలను క్రమంగా అమలు చేస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం… వరసగా రెండో ఏడాది వైఎస్సార్ కాపు నేస్తం నిధులు జమ చేసేందుకు సిద్ధం అయ్యింది.. రేపు సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా లబ్ధిదారుల ఖాతాల్లో సొమ్మును జమ చేయనున్నారు.. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో సొమ్మును జమ చేయనున్నారు సీఎం జగన్.. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన […]
కేంద్ర ప్రభుత్వం గెజిట్లు విడుదల చేసినా.. తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి… జల జగడంపై స్పందించిన ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి… చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే నీటి కేటాయింపులు జరిగేవన్న ఆయన.. తెలుగు రాష్ట్రాల్లో సాగు నీటి ప్రాజక్టులపై మాట్లాడే నైతిక హక్కు ఏ పార్టీకి లేదన్నారు.. బ్రిజేష్ ట్రిబ్యునల్ అనేక సార్లు నీటిని కేటాయిస్తామన్నా ప్రాజక్టులను పూర్తి చేసిన పాపాన […]
తెలంగాణలో రాజకీయ పరిస్థితులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి… సీఎం కేసీఆర్ పై తెలంగాణ ప్రజలలో విశ్వాసం పోయిందన్న ఆయన.. కేసీఆర్ వ్యవహార శైలి వల్ల తెలంగాణ ఉద్యమకారులు నిరాశకు గురవుతున్నారన్నారు.. తెలంగాణలో కేసీఆర్, టీఆర్ఎస్ వ్యతిరేకుల పునరేకీకరణ జరుగుతుందన్న రేవంత్… సీఎం కేసీఆర్‌ను తెలంగాణ సమాజం త్వరలో తిరస్కరిస్తుంది.. మేధావులు, మీడియా దీన్ని గమనించాలని సూచించారు.. ఇక, రాబోయే రోజులలో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులు టీఆర్ఎస్ పార్టీని వీడి […]
హుజురాబాద్‌లో ‘దళిత బంధు’ స్కీమ్ పెడితే తప్పేముంది.. స్కీమ్ ద్వారా రాజకీయంగా లాభం కోరుకోవడంలో తప్పు ఏముంది ? టీఆర్ఎస్ రాజకీయ పార్టీయే కదా ? అని వ్యాఖ్యానించారు టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్… తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో.. కౌశిక్‌రెడ్డికి టీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ వలస కాలనీ అవుతాదా అనే ఆవేదన ఉండేది.. పిడికడు మందితో ఉద్యమం స్టార్ట్ చేశాం.. తెలంగాణ ఆకాంక్ష 2014 […]
10వ తరగతి, 12వ తరగతి ప్రైవేట్ విద్యార్థుల పరీక్షల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ).. కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో.. ఇప్పటికే ఈ ఏడాది నిర్వహించాలని 10వ తరగతి మరియు 12వ తరగతి రెగ్యులర్ విద్యార్థులను పరీక్షలను రద్దు చేసిన సీబీఎస్ఈ.. 10, 12వ తరగతులకు చెందిన ప్రైవేట్ విద్యార్థులకు మాత్రం పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది… ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 15వ తేదీ మధ్య వారికి పరీక్షలు […]