ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజయం సాధించి.. వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత.. తెలుగుదేశం పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి.. మరో సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పి.. వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.. సీఎం వైఎస్ జగన్ సమక్షంలో.. వైసీపీలో చేరారు టీడీపీ సీనియర్ నేత, గుంటూరు తూర్పు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఎస్.ఎం.జియావుద్దిన్.. ఈ కార్యక్రమంలో గుంటూరు తూర్పు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మహ్మద్ ముస్తఫా షేక్, […]
కోకాపేట్, ఖానామెట్ భూముల వేలానికి అనూహ్య స్పందన వచ్చింది.. ఈ వేలం ద్వారా ప్రభుత్వానికి కనకవర్షమే కుసింది.. ఇదే సమయంలో.. వేలంపై ఆరోపణలు కూడా లేకపోలేదు.. గతంలో ఇతర రాష్ట్రాల కంపెనీలు పాల్గొన్నాయి.. ఈసారి ఎందుకు రాలేదంటూ ప్రతిపక్షాలు ప్రశ్నించాయి.. అంతేకాదు.. భారీ స్కామ్ జరిగిందని ఆరోపణలు గుప్పించారు.. దీనిపై సీరియస్‌గా స్పందించింది తెలంగాణ ప్రభుత్వం.. హైదరాబాద్ నగర అభివృద్ధికే కోకాపేట్, ఖానామెట్ భూములు వేలం వేశామన్న సర్కార్.. ప్రభుత్వ భూముల వేలం ఇది కొత్తకాదు.. గతానికి […]
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ భారీగా పెరిగాయి… ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 88,149 శాంపిల్స్ పరీక్షించగా.. 2,498 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.. మరో 24 మంది కరోనా బాధితులు ప్రాణాలు వదిలారు… తాజా మృతుల్లో చిత్తూరులో ఐదుగురు, ప్రకాశం జిల్లాలో నలుగురు, నెల్లూరు, పశ్చిమ గోదావరిలో ముగ్గురు చొప్పున, అనంతపురం, తూర్పు గోదావరి, గుంటూరులో ఇద్దరు చొప్పున, కృ ష్ణ, కర్నూలు, శ్రీకాకుళంలో […]
భారీ వర్షాలతో హిమాయత్‌సాగర్ నిండు కుండలా మారింది.. హిమాయత్‌సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1763.50 అడుగులు కాగా.. ప్రస్తుతం 1762.90 అడుగులకు చేరింది నీటిమట్టం దీంతో.. దిగువప్రాంతంలోని ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు.. మొదటగా మూడు గేట్లను ఎత్తి దిగువకను నీటిని విడుదల చేస్తున్నారు.. హిమాయత్‌సాగర్‌కు మొత్తం 17 గేట్లు ఉండగా… 5వ నంబర్ గేట్ ను ఎత్తిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్.. మూసి నదిలోకి నీటిని వదిలారు.. ఎగువ ప్రాంతాల నుంచి వరద ఇలానే కొనసాగితే మరిన్ని […]
తమ ప్రభుత్వంలో ముఖ్యమంత్రికి లబ్ధిదారులకు మధ్య దళారులే లేరు… ప్రతీ పైసా ప్రజల కోసమే ఖర్చు చేస్తున్నామని తెలిపారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారం.. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం కొంచాడ గ్రామంలో హరితవనహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటిన ఆయన.. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో దొరికింది దొరికనట్లు దోచుకుతిన్నారు.. ముఖ్యమంత్రి దగ్గర్నుంచి జన్మభూమి కమిటీల వరకూ గుటకాయస్వాహా చేశారు.. వాళ్లకే సరిపోకపోతే ఇక ప్రజలకేం పంచుతారు అంటూ ఆరోపణలు […]
ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవానికి ముందే.. భారీ ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి… ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని.. తమకు సమాచారం చేరినట్టు నిఘా వర్గాలు చెబుతున్నాయి.. డ్రోన్లతో దాడికి ఉగ్రవాదుల కుట్రపన్నారని వెల్లడించిన ఇంటెలీజెన్స్ బ్యూరో… దేశ రాజధానిలో ‘ఆపరేషన్ జెహాద్’ ను ప్రారంభించడానికి ఉగ్రవాదులు కుట్ర చేస్తున్నారు. ఆగస్టు 15కు ముందే దాడులకు ప్రణాళికలు వేసినట్టు చెబుతున్నారు.. ఈ ఉగ్రదాడిని అడ్డుకోవడానికి అలర్ట్‌గా […]
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది… ప్రతిపక్ష నేతలు, సీనియర్ జర్నలిస్టులు, ప్రముఖులతో పాటు.. కేంద్ర మంత్రుల ఫోన్లు కూడా ట్యాప్‌కు గురికాడంతో ప్రభుత్వంపై విమర్శలు పెరిగాయి.. ఈ వ్యవహారంపై స్పందించిన సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క.. దేశంలో భావ స్వేచ్ఛ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.. ఫోన్లు ట్యాప్ చేస్తూ.. అభద్రతకు గురిచేస్తున్నారన్న ఆయన.. పెగాసస్ స్పైవేర్ ను ప్రభుత్వాలకు మాత్రమే అమ్ముతారని.. రాహుల్ గాంధీ, ఆయన కార్యాలయంలోని సిబ్బంది ఫోన్లు కూడా […]
స్పోర్ట్స్ కోటాలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటామని ప్రకటించారు ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్… టూరిజం శాఖపై సమీక్ష నిర్వహించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉద్యోగాల భర్తీలో 2 శాతం మేర స్పోర్ట్స్ కోటాకు రిజర్వేషన్ ఉంది.. ఈ మేరకు స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేయాల్సిన పోస్టుల జాబితా సిద్ధం చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.. టూరిజం అభివృద్ధి కోసం రాష్ట్రాన్ని నాలుగు టూరిజం సర్క్యూట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్న ఆయన.. రాయల […]
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అమలు విషయంలో ఇప్పటికీ అనేక సందేహాలు ఉన్నాయి.. ఆ చట్టంలోని మెజార్టీ అంశాలు అమలుకు నోచుకోలేదని రెండు రాష్ట్రాలు చెబుతూ వస్తున్నాయి.. అయితే, దీనిపై క్లారిటీ ఇచ్చింది కేంద్ర హోంశాఖ.. “ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం” అమలు గురించి టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు లోక్‌సభలో ప్రశ్నించారు.. విభజనచట్టంలో పొందుపరచిన అంశాలు అన్నీ నెరవేర్చారా? లేదా? లేకపోతే అమలుకు ఎటువంటి చర్యలు తీసుకున్నారని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి […]
హుజూరాబాద్ ఉప ఎన్నికపై టిఆర్ఎస్ దృష్టి పెట్టింది. ఇప్పటికే మండలాల వారిగా పార్టీ ఇంచార్జీలను నియమించింది. పార్టీ ముఖ్యనేతలు, మంత్రులు కూడా నియెజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే పనిలో ఉన్నారు. ఉప ఎన్నిక షెడ్యులు వచ్చేనాటికి నియెజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడంపై టిఆర్ఎస్ నేతలు దృష్టి పెట్టారు. పార్టీ శ్రేణులను ఉప ఎన్నికలకు సమాయత్తం చేసే పనిలో ఉన్నారు ముఖ్యనేతలు. ప్రధానంగా నియెజకవర్గంలో ఉన్న సామాజిక సమీకరణాలపై […]