తెలంగాణలో బోనాల సీజన్ ప్రారంభమైపోయింది.. ఇప్పటికే బోనాల పాటలు అదరగొడుతున్నాయి.. ప్రతీ పండుగకు ఓ పాట విడుదల చేసినట్టుగానే.. ఈ సారి కూడా ఓ పాటను వదిలారు సింగర్ మంగ్లీ.. అయితే, పాటలోని కొన్ని పదాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ నేతలు.. బోనాల పాటలో తప్పుడు పదాలు ఉపయోగించారంటూ మంగ్లీపై రాచకొండ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు బీజేపీ కార్పొరేటర్లు. బోనాల పాటలో అమ్మవారిపై తప్పుడు పదాలు ఉపయోగించారని పేర్కొన్న నేతలు.. తక్షణమే […]
కరోనా మహమ్మారి అన్ని రంగాలపై ప్రభావం చూపింది.. ఇక, విద్యారంగానికి సవాల్ విసిరింది.. ప్రత్యక్ష బోధన లేకపోవడంతో.. అంతా ఆన్‌లైన్‌కే పరిమితం కావాల్సిన పరిస్థితి.. దీంతో.. చాలా మంది విద్యార్థుల చదవులు అటకెక్కాయి.. కొంతమంది విద్యార్థులు పొలం పనుల్లో బిజీ అయ్యారు.. ఆన్లైన్ విద్య పేరుకు మాత్రమే అన్నట్టుగా తయారైంది.. కరోనా విలయం, లాక్డౌన్ ఆంక్షలతో స్కూలు విద్య బాగా దెబ్బతింది. అయితే, స్కూళ్ల పునర్ ప్రారంభంపై ఐసీఎంఆర్ సెక్రటరీ డాక్టర్ బలరామ్ భార్గవ కీలక సూచనలు […]
కరోనా వైరస్ ఓ వైపు కల్లోలం సృష్టిస్తుంటే.. మరోవైపు సైబర్ నేరగాళ్లు పంజా విసురుతున్నారు.. కొత్త కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు.. తాజాగా సైబర్ కేటుగాళ్ల బాధితుల జాబితాలో ఓ 77 ఏళ్ల వృద్ధుడు చేరాడు.. సరదాగా డేటింగ్ అంటూ చాటింగ్‌తో స్టార్ట్ అయ్యి.. చివరకు రూ.11 లక్షలు పోగుట్టుకున్న తర్వాత గానీ ఆ వృద్ధుడికి తాను చీటింగ్‌కు గురయ్యాను అనే సంగతి తెలిసిరాలేదు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌కు చెందిన ఓ 77 ఏళ్లు వృద్ధుడు.. […]
కృష్ణా నది జలాల విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.. మంత్రులు, నేతల మధ్య మాటల యుద్ధం సాగగా… కేంద్ర ప్రభుత్వం గెజిట్లతో వివాదాలకు తెరదింపాలని చూసింది.. కానీ, వాటిపై అసంతృప్తి వ్యక్తం చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం.. మరోవైపు.. కృష్ణా నదీ జలాలను 50:50 నిష్పత్తిలో పంచాలని కోరుతూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డును లేఖ రాసింది తెలంగాణ ప్రభుత్వం.. ఈ మేరకు నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ ఛీప్ మురళీధర్‌రావు కేఆర్ఎంబీ ఛైర్మన్‌కు […]
పోలవరం నిర్వాసితుల సమస్యలపై ఆంధ్రప్రదేశ్, కేంద్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది జాతీయ గిరిజన కమిషన్… పోలవరం నిర్వాసితులకు నష్ట పరిహారం, పునరావాసంపై రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే సీతంశెట్టి వెంకటేశ్వర్లు జాతీయ ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.. దీనిపై స్పందించిన కమిషన్.. 15 రోజుల్లో వాస్తవాలతో కూడిన నివేదిక ఇవ్వాలి, లేకపోతే సమాన్లు జారీ చేస్తామని పేర్కొంది.. పోలవరం నిర్వాసితులకు నష్ట పరిహారం, పునరావాసం కల్పించకుండా తరలించడంపై స్పందించిన జాతీయ గిరిజన కమిషన్.. ఈ మేరకు ఏపీ, […]
అమెజాన్ సంస్థను తక్కువ కాలంలోనే తిరుగులేని శక్తిగా మలచిన ఆ సంస్థ అధినేత జెఫ్ బెజోస్.. అంతరిక్ష యాత్ర విజయవంతంగా పూర్తి చేశారు.. 11 నిమిషాల్లో 105 కిలోమీటర్లు ప్రయాణించి భూమికి తిరిగి వచ్చింది బెజోస్ బృందం.. ఆయన వెంట మరో ముగ్గురు ఈ అంతరిక్ష ప్రయాణం చేశారు. ఇవాళ సాయంత్రం 6.42 గంటలకు పశ్చిమ టెక్సాస్ నుంచి రోదసీలోకి దూసుకెళ్లిన బ్లూ ఆరిజిన్ సంస్థకు చెందిన న్యూ షెపర్డ్ స్పేస్ క్రాఫ్ట్.. 11 నిమిషాల్లో తిరిగి […]
కరోనా మహమ్మారి విజృంభణతో సినిమా థియేటర్లు మూతపడ్డాయి… ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో.. ఈ నెల 23వ తేదీ నుంచి తెలంగాణలో వందశాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు తిరిగి తెరుచుకోనున్నాయి… ఇదే, సమయంలో.. సినిమా థియేటర్లలో పార్కింగ్ ఫీజు వసూలుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.. అయితే, మల్టీప్లెక్స్, కమర్షియల్ కాంప్లెక్స్‌లలో మాత్రం యాథావిధిగా నో పార్కింగ్ ఫీజు విధానాన్ని అమలు చేయాలని స్పష్టం చేసింది ప్రభుత్వం.. తక్షణమే ఆదేశాలు అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో […]
సింగరేణి కార్మికులకు గుడ్‌న్యూస్ చెప్పారు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం, కోల్ బెల్ట్ ఏరియా ఎమ్మెల్యేల అభ్యర్థన మేరకు.. సింగరేణి ఉద్యోగులు, కార్మికుల పదవీ విరమణ వయస్సును 61 ఏళ్లకు పెంచాలని నిర్ణయించారు.. ఈ మేరకు ఈనెల 26 తేదీన జరిగే బోర్డు మీటింగ్‌లో అమలు తేదీని నిర్ణయించి ప్రకటించాలని సింగరేణి ఎండీ శ్రీధర్‌ను ఆదేశించారు.. ఈ నిర్ణయం ద్వారా మొత్తం 43,899 మంది సింగరేణి కార్మికులు, అధికారులకు లబ్ధి చేకూరనున్నది. […]
సీనియర్ ఐపీఎస్, తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్)కు ఆమోదం తెలిపింది రాష్ట్ర సర్కార్.. ఆయన చేసుకున్న వీఆర్ఎస్ దరఖాస్తును పరిశీలించిన ప్రభుత్వం విధుల నుంచి రిలీవ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది… కాగా, 26 ఏళ్ల సర్వీస్ పూర్తిచేసిన ఈ ఐపీఎస్… ప్రస్తుతం అడిషనల్ డీజీ ర్యాంక్‌లో ఉన్నారు. ఇంకా ఆరేళ్ల సర్వీసు ఉన్నప్పటికీ వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.. ఇంకా స్వేచ్ఛగా […]
వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తులు, భూముల విలువ, రిజిస్ట్రేషన్ రుసుము పెంచుతూ నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం.. ఈ మేరకు సీఎస్ సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.. పెంచిన మార్కెట్ విలువలు ఈ నెల 22 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు.. ఇక, వ్యవసాయేతర భూముల విలువను ఇప్పటి కన్నా గరిష్ఠంగా 50 శాతం పెంచాలని రిజిస్ట్రేషన్ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేయగా.. ఈ క్రమంలో సాగుభూములు గరిష్ఠ, కనిష్ఠ విలువల్లో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. భూముల […]