తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య స్థిరంగా కొనసాగుతోంది.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 239 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మరో ఇద్దరు కోవిడ్ బాధితులు ప్రాణాలు వదిలారు.. ఇక, 336 మంది ఒకేరోజు కోలుకున్నారు.. దీంతో.. ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,64,650కు చేరగా.. రికవరీ కేసులు 6,55,961కు పెరిగాయి. మృతుల సంఖ్య 3,911కు పెరిగింది. రికవరీ రేటు రాష్ట్రంలో 98.69 శాతంగా ఉందని.. ప్రస్తుతం రాష్ట్రంలో 4,778 యాక్టివ్ కేసులు ఉన్నాయని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. మరోవైపు గత 24 గంటల్లో రాష్ట్రంలో 50,569 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. తాజా కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 68 నమోదయ్యాయి.