కరోనా ఫస్ట్ వేవ్ ముగిసిపోయి.. సెకండ్ వేవ్ ఇంకా కొనసాగుతూనే ఉంది.. మరోవైపు థర్డ్ వేవ్ కూడా ప్రారంభదశలో ఉందంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరికలు జారీ చేసింది.. ఈ సమయంలో.. సీరం సర్వేలో ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి.. తెలంగాణలో ఇటీవల నాలుగో దఫా సీరం సర్వేని నిర్వహించింది ఐసీఎంఆర్ అనుబంధ సంస్థ నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ … ఆ సర్వేలో 60 శాతం మందిలో కోవిడ్ యాంటీ బాడీలను గుర్తించినట్టు ప్రకటించింది. […]
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీమంత్రి, వైసీపీ నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) పురోగతి సాధించింది.. ఈ కేసులో సుదీర్ఘ విచారణ కొనసాగిస్తున్న సీబీఐ.. వివేకానందరెడ్డి ఇంటి వాచ్మెన్ రంగయ్య నుంచి కీలక సమాచారాన్ని రాబట్టింది.. రంగయ్య తన వాంగ్మూలంలో సంచలన విషయాలు వెల్లడించారు.. వివేకా హత్యకు రూ. 8 కోట్లు సుపారీ ఇచ్చినట్లు తెలిపిన ఆయన.. ఈ హత్యలో తొమ్మిది మంది భాగంగా ఉన్నారని తెలిపారు. హత్య […]
మహిళలపై జరుగుతోన్నఅఘాయిత్యాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. శ్రీకాకుళంలో నిర్వహించిన దిశ యాప్ అవగాహన సదస్సులో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సమాజంతో పాటు పురుషుల ఆలోచనా ధోరణి మారాలన్నారు.. న్యాయానికి అన్యాయం జరిగినప్పుడు అవుట్ ఆఫ్ లా ఒక్కటే మార్గమని.. బయటికొచ్చి న్యాయం చేయాలన్న ఆయన.. తెలంగాణలో మృగాళ్లను సీపీ సజ్జనార్ వేటాడిన విధానం అద్భుతం.. అందుకే సైబరాబాద్ సీపీ సజ్జనార్ ను మరోసారి అభినందిస్తున్నట్టు తెలిపారు.. మగాడు […]
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతూ వచ్చినా.. ఇంకా కొన్ని ప్రాంతాల్లో మాత్రం భారీ సంఖ్యలో కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి.. పశ్చిమగోదావరి జిల్లా అల్లవరంలోనూ కోవిడ్ ఉధృతి కొనసాగుతూనే ఉంది.. దీంతో.. ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. ఈ నెల 31 తేదీ వరకు కర్ఫ్యూ విధిస్తూ నిర్ణయం తీసుకుంది ఏపీ సర్కార్.. అల్లవరంలో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు దుకాణాలు, వ్యాపార సముదాయాలు పనియేనుండగా.. మధ్యాహ్నం 2 […]
తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.. పలు ప్రాంతాలను వరదలతో ముంచెత్తాయి. ఇక, భారీవర్షాల కారణంగా రాయగఢ్ జిల్లాలో మూడు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనల్లో ఇప్పటివరకు 36 మంది మరణించినట్టు అధికారులు చెబుతున్నారు.. మరికొంతమంది గల్లంతు కాగా.. రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు.. సహాయక చర్యలు చేపట్టాయి.. ఇప్పటికే కొందరిని కాపాటినట్టు తెలుస్తుండగా.. శిథిలాల కింది ఎంతమంది చిక్కుకున్నారనేదానిపై వివరాలు లేవు.. […]
నవజ్యోత్ సింగ్ సిద్ధూ స్టైలే వేరు.. ఈ టీమిండియా మాజీ క్రికెటర్‌కు సిక్సర్ల సిద్ధూగా పేరు ఉండగా.. ఇప్పుడు తన పనిలోనూ.. ఆ సిక్సర్లను గుర్తు చేస్తున్నారు.. ఏకంగా స్టేజ్‌పైనే సిక్సర్ బాదినట్టు పోజులు ఇచ్చారు.. ఇప్పుడు ఆ వీడియో వైరల్‌గా మారిపోయింది.. స్టేట్పైన సిద్ధూ సిక్స్ కొట్టడం ఏంటనే విషయానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు నవజ్యోత్ సింగ్ సిద్ధూ.. ఆ తర్వాత 62 మంది ఎమ్మెల్యేలతో బలప్రదర్శన కూడా […]
రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు వ్యవహారం ఏపీ, తెలంగాణ మధ్య కాకరేపాయి.. పరస్పరం ఆరోపణలు, విమర్శలు, ఫిర్యాదులు.. ఇలా చాలా వరకే వెళ్లింది వ్యవహారం.. అయితే, విషయంలో కృష్ణా నది యాజమాన్యబోర్డుకు కీలక ఆదేశాలు జారీ చేసింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ), చెన్నై బెంచ్.. సొంతంగా తనిఖీలు జరిపి నివేదిక ఇవ్వాలని కృష్ణా బోర్డుకు ఆదేశాలు జారీ చేసింది.. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు తనిఖీలకు ఏపీ ప్రభుత్వం సహకరించడం లేదన్న కృష్ణా బోర్డు నివేదనను పరిగణలోకి […]
కరోనా మహమ్మారి కారణంగా స్కూళ్లతో పాటు విద్యాసంస్థలు అన్నీ మూతబడ్డాయి.. క్లాసులు ఆన్లైన్లోనే.. ఇక పరీక్షల సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు.. ఎందుకంటే.. పోటీ పరీక్షలు మినహా.. బోర్డు ఎగ్జామ్‌లతో పాటు అన్నీ రద్దు చేశారు. అయితే, కరోనా సెకండ్ వేవ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టడంతో.. స్కూళ్లను పున:ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఆగస్టు 16వ తేదీ నుంచి స్కూల్స్ రీఓపెనింగ్‌కు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. […]
ఇవాళే టీఆర్ఎస్లో చేరిన కౌశిక్‌రెడ్డికి భారీ షాక్ ఇచ్చింది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ).. ఈ మధ్యే కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పిన హుజురాబాద్ అసెంబ్లీ నియోకవర్గానికి చెందిన పాడి కౌశిక్ రెడ్డి.. ఇవాళ తెలంగాణ భవన్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.. కౌశిక్‌రెడ్డికి పార్టీ కండువా కప్పి.. టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు కేసీర్.. అయితే, తన చేరిక సందర్భంగా.. హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, కటౌట్లు, బ్యానర్లు ఏర్పాటు చేశారు కౌశిక్ రెడ్డి.. […]