కార్వీ కేసులో ఈడీ దూకుడు.. రూ.700 కోట్ల షేర్లు ఫ్రీజ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కార్వీ స్టాక్ బ్రోకింగ్ కేసు వ్యవహారం దర్యాప్తులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మరింత దూకుడు పెంచింది.. 3,000 కోట్ల రూపాయల ఫ్రాడ్ కేస్‌లో సీసీఎస్ఎఫ్ఐఆర్ ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ.. దర్యాప్తు ముమ్మరం చేసింది.. ఇటీవల హైదరాబాద్, గుంటూరులో కార్వీ సంస్థ ఛైర్మన్ పార్థసారథి ఇళ్లు, కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు నిర్వహించింది.. హైదరాబాద్ కార్వీ హెడ్ ఆఫీస్‌లో 10 గంటల పాటు సోదాలు నిర్వహించిన ఈడీ.. కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది.. ఇక, ఈ నేపథ్యంలోనే కార్వీ సంస్థ షేర్లను ఫ్రీజ్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్.. కార్వీ ఛైర్మన్ పార్థసారధి, ఆయన కుమారులు రజట్ పార్థసారథి, అధిరజ్ పార్థసారథిలకు సంబంధించిన షేర్లను ఫ్రీజ్ చేయనున్నారు అధికారులు.. కార్వీ సంస్థకు సంబంధించిన సుమారు 700 కోట్ల రూపాయల షేర్లను ఫ్రీజ్ చేసింది ఈడీ. కాగా, నిబంధనలకు విరుద్ధంగా పెట్టుబడిదారుల షేర్లను 9 డొల్ల కంపెనీలకు మళ్లించినట్లు సీసీఎస్ పోలీసుల దర్యాప్తులో తేలింది. సెబీకి సమాచారం ఇవ్వకుండా షేర్లను బ్యాంకుల్లో తనఖా పెట్టి దాదాపు రూ.1,500 కోట్లను కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ రుణంగా తీసుకుంది. బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలను వైస్ ప్రెసిడెంట్ శ్రీకృష్ణ 9 డొల్ల కంపెనీలకు మళ్లించారనే అభియోగాలున్నాయి.. పెట్టుబడిదారులకు నష్టం చేకూర్చే విధంగా వ్యవహరించడంతో పాటు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను నిబంధనలకు విరుద్ధంగా దారి మళ్లించినట్లు గుర్తించారు.
Also Read
- Tags
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: “టాస్ వేసేదాకా చెప్పలేదు”.. తీవ్ర నిరాశతో కన్నీరు పెట్టినంత పని చేసిన వైభవ్.. సీనియర్స్ ఫైర్!
-
Mohanlal: క్రిషాండ్తో మోహన్‌లాల్ కొత్త ప్రయోగం.. ‘చోటా ముంబై’ తరహా ఎంటర్టైనర్కు రంగం సిద్ధం!
-
Harry Brook: టీమిండియా బౌలింగ్ జుజుబి.. చాలా సరదాగా బ్యాటింగ్ చేశాం.. హ్యారీ బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Argentina vs Switzerland: అల్వారెజ్, మార్టినెజ్ల మాయాజాలం.. సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన అర్జెంటీనా..
-
Samsung Galaxy Tab S12+: సామ్ సంగ్ గెలాక్సీ ట్యాబ్ S12+ ఫస్ట్ లుక్.. ఫ్రంట్ డిజైన్ వెల్లడి, త్వరలో లాంచ్?
ట్రెండింగ్
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్‌లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్‌తో పోలీసులకు చిక్కిన యువకుడు.!