వైద్య ఆరోగ్యశాఖపై సర్కార్ కీలక నిర్ణయం.. ఇక కుదరదు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైద్యారోగ్య శాఖపై కీలక నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ సర్కార్.. ప్రభుత్వ వైద్యుల ప్రైవేట్ సేవలపై నిషేధం విధించాలని వైఎస్ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.. ప్రభుత్వ డాక్టర్లు ప్రైవేట్ ప్రాక్టీస్ లేదా ప్రైవేట్ ఆస్పత్రుల్లో విధులు నిర్వహించకుండా చర్యలు తీసుకోవాలని యోచిస్తోంది.. వైద్యారోగ్య శాఖలో కొత్తగా చేపట్టనున్న 14 వేలకు పైగా పోస్టుల భర్తీలో ఈ నిబంధనను కచ్చితంగా అమలయ్యేలా చూడాలని అధికారులు భావిస్తున్నారు. డీఎంఈ, ఏపీవీవీపీ, డీపీహెచ్ సెంటర్లలో మొత్తంగా 14,037 పోస్టుల భర్తీకి ప్రణాళికలు సిద్ధం చేసింది వైద్యారోగ్య శాఖ. ఇప్పటికే ఉన్న ఖాళీగా 7740 పోస్టులతో పాటు.. కొత్తగా 6297 పోస్టుల భర్తీకి నిర్ణయం తీసుకున్నారు.. ఈ నెల 27వ తేదీ నుంచి వైద్యారోగ్య శాఖ పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రారంభించనున్నారు.. డిసెంబర్ 21 తేదీ నాటికి పోస్టుల భర్తీ పూర్తి చేయాలని చేసేలా రిక్రూట్‌మెంట్ క్యాలెండర్ సిద్ధం చేసింది ప్రభుత్వం.. ఇక, అదనపు పోస్టుల భర్తీతో ప్రభుత్వంపై రూ. 676.83 కోట్ల భారం పడుతుందని అంచనా వేస్తున్నారు. కాగా, నిన్న వైద్య ఆరోగ్యశాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం వైఎస్ జగన్.. వైద్య ఆరోగ్యశాఖలో 14 వేలకు పైగా వివిధ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
Also Read
- Ketan Agarwal Case: సియా-చేతన్‌ను కలిపిన ‘దీపావళి’.. ఆరోజు ఏం జరిగిందంటే..!
- Ketan Agarwal Case: కేఫ్‌లో గంటపాటు ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర.. వెలుగులోకి వీడియోలు
- Ketan Agarwal Case: ‘సియా’ది ఇంత క్రిమినల్ మైండా? ప్రియుడి మైండ్ బ్లోయింగ్ స్టేట్మెంట్
- Shehbaz Sharif: ఇరాన్ అధ్యక్షుడి టూర్లో పాక్ ప్రధాని వింత ప్రవర్తన.. నెట్టింట తీవ్ర విమర్శలు
తాజావార్తలు
-
Pakistan: సైనికుల జీతాలు 25% పెంచిన పాక్.. సిందూర్ దెబ్బకు పరిహారమా?
-
Ration Card New Rules: రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. 80 కోట్ల మందికి లబ్ధి..!
-
LPG Supply: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఇక కష్టాలు తీరినట్లే..
-
CM Revanth Reddy : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ గిఫ్ట్.. రూ.1 కోటి రక్షణ
-
Passport Fee: 14 ఏళ్ల తర్వాత పాస్‌పోర్ట్ ఫీజులు పెంపు.. ఎంత పెరిగాయంటే..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!