పండగ సీజన్ పురస్కరించుకుని హోండా కార్స్ ఇండియా ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. మోడల్‌ను బట్టి కార్లపై 53వేల 500 వరకు ప్రయోజనాలు లభించనున్నాయి. ఈ ఆఫర్ ఈ నెలాఖరు వరకు అందుబాటులో ఉండనున్నాయి. క్యాష్‌బ్యాక్, యాక్సెసరీస్, లాయల్టీ బోనస్, స్పెషల్ ఎక్స్‌ఛేంజ్ బెనిఫిట్స్ రూపంలో ప్రయోజనాలు అందనున్నాయి. ఫిప్త్ జెన్ సిటీ కారు మోడల్‌పై 53వేల 500, ఫోర్త్ జెన్ సిటీపై 22వేలు , అమేజ్‌పై 18వేలు, DWR – V పై 40వేల 100, జాజ్‌పై 45వేల 900 వరకు డిస్కౌంట్ దొరుకుతుంది.