డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో.. చైనా ప్రస్తావన వస్తేనే ఫైర్ అయ్యేవారు.. ఇక, కరోనా మహమ్మారి వెలుగుచూసిన తర్వాత.. అది చైనా వైరస్ అంటూ.. ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో వివాదాస్పదమయ్యాయి… అయితే, అమెరికా-చైనా మధ్య యుద్ధం జరగొచ్చు అంటూ ఇప్పుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.. ఓవైపు తైవాన్ గగనతలంలో చైనా యుద్ధ విమానాల దూకుడు పెంచిన సమయంలో.. ట్రంప్ వ్యాఖ్యలు కీలకంగా మారాయి.. చైనాతో అగ్రరాజ్యం అమెరికా యుద్ధం చేసేలా ఉందంటూ వ్యాఖ్యానించిన ఆయన.. అమెరికాలోని ప్రస్తుత బలహీన, అవినీతి ప్రభుత్వాన్ని చైనా ఏమాత్రం గౌరవించడం లేదంటూ.. జో బైడెన్ సర్కార్‌ను టార్గెట్ చేవారు.. ఇక, చైనా, అమెరికా అధికారుల మధ్య త్వరలోనే ఉన్నతస్థాయి సమావేశంలో స్విట్జర్లాండ్‌లో జరగనుందన్న వార్తల నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖలు చేసి మరింత కాకరేపారు.
మరోవైపు.. ఇప్పటికే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తన ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న డొనాల్డ్ ట్రంప్… యూఎస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని మరోసారి ఆరోపించారు. అవినీతి ప్రభుత్వం దేశాన్ని ఏలుతోందంటూ బైడన్ సర్కార్‌పై విమర్శలు గుప్పించిన ఆయన.. ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా సైన్యాన్ని వెనక్కి పిలిచిన సమయంలో బైడెన్ ప్రభుత్వం అనుసరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.