పండగ వేళ గుడ్‌న్యూస్.. తగ్గనున్న వంటనూనెల ధర..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వంట గదిలో కుంపటి పెడుతున్నాయి వంట నూనెల ధరలు.. అమాంతం పెరిగిపోయిన వంట నూనెల ధరలతో సామాన్యులకు చుక్కలు కనిపిస్తున్నాయి… పెట్రో ధరలు, గ్యాస్ బాదుడుకు తోడు వంట నూనెల ధరల ప్రభావం అందరిపై పడుతోంది.. అయితే, పండుగల వేళ వినియోగదారులకు శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం.. ముడి పామాయిల్, సోయాబీన్, పొద్దుతిరుగుడు నూనెలపై బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది.. ఇక, వంటనూనెలపై ఉన్న అగ్రిసెస్‌ను కూడా తగ్గించింది కేంద్రం.. దీంతో దేశీయంగా వంట నూనె ధరలు కొంత వరకు తగ్గనున్నాయి. ఇది పండగల సమయంలో.. సామాన్యులకు కాస్త ఊరట కల్పించే విషయమే.
కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ముడి పామాయిల్‌పై ఉన్న అగ్రిసెస్ 7.5 శాతానికి, ముడి సోయాబిన్ ఆయిల్, ముడి పొద్దుతిరుగుడు నూనెపై 5.5 శాతానికి తగ్గిపోయింది.. ఇక రిఫైన్డ్ వంట నూనెలపై బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని 32.5 శాతం నుంచి 17.5 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది ఎన్డీఏ సర్కార్.. కేంద్రం తగ్గించిన ఈ ధరలు ఈ నెల 14వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.. మొత్తంగా గత ఏడాది కాలంగా అమాంతం పెరిగిపోయిన వంట నూనె ధర కాస్త తగ్గనుంది. పండుగ సీజన్‌లో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే ప్రయత్నాలలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది సర్కార్.. దీనికి సంబంధించి ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని రెవెన్యూ శాఖ బుధవారం రెండు నోటిఫికేషన్‌లను జారీ చేసింది.
Also Read
- Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
- Maharashtra: నాందేడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు-టాటా మ్యాజిక్ ఢీ.. 9 మంది మృతి
- IndiGo Flight: టిష్యూ పేపర్‌పై ‘బాంబు’ బెదిరింపు.. అహ్మదాబాద్‌లో ఇండిగో ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Osama Bin Laden: రేపటితో 9/11 ఘటనకి 25 ఏళ్లు.. బిన్ లాడెన్ ఎలా హతమయ్యాడు.. కుటుంబం ఎక్కడుంది?
తాజావార్తలు
-
Ravi Mohan: ప్రియురాలిగా వార్తల్లో నిలిచిన కెనీషానే ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్..
-
Lala Amarnath: భారత్‌కు తొలి సెంచరీ అందించిన వీరుడు.. పాకిస్థాన్‌ను చిత్తు చేసిన ఈ హీరో గురించి మీకు తెలుసా?
-
BRICS Summit 2026: భారతీయ రుచుల ఘుమఘుమలు.. BRICS దేశాధినేతలకు ప్రత్యేక విందు
-
Bank Strike 2026: బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్.. నేటి నుంచి వరుసగా 4 రోజులు బ్యాంకులు బంద్..
-
Indian 3: కమల్ హాసన్ ‘ఇండియన్ 3’ని శంకర్ మళ్లీ మొదలు పెట్టబోతున్నారా ?
ట్రెండింగ్
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!