సీడబ్ల్యూసీ భేటీ.. అసమ్మతి నేతలకు సోనియా వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశమైంది. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అధ్యక్షతన జరుగుతోన్న ఈ భేటీలో వాడివేడిగా చర్చలు సాగుతున్నాయి.. పార్టీ సంస్థాగత ఎన్నికలు, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, లఖింపూర్ ఖేరీ ఘటనపై చర్చిస్తున్నట్టు తెలుస్తుండగా.. ఈ సమావేశంలో 23 మంది అసమ్మతి నేతలకు సోనియా గాంధీ సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం.
పార్టీ అంతర్గత వ్యవహారాలపై మీడియాతో మాట్లాడితే సహించేది లేదని 23 మంది అసమ్మతి నేతలకు వార్నింగ్ ఇచ్చారు సోనియా గాంధీ.. అంతర్గత సమస్యలను పార్టీ సమావేశాల్లోనే చర్చించాలి హెచ్చరించినట్టు తెలుస్తోంది. ఇక, కాంగ్రెస్ పార్టీకి పూర్తిస్థాయి అధ్యక్షురాలిని తానేనని స్పష్టం చేవారు సోనియా గాంధీ.. పార్టీ వ్యవహారాలపై మీడియాకు ఎక్కితే సహించే ప్రసక్తేలేదనే నేతలను హెచ్చరించారు. ఎలాంటి సమస్యపై అయినా చర్చించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం.. కానీ, అంతర్గత సమస్యలను బహిర్గతం చేస్తే చూస్తూ ఊరుకోబోమని వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. కాగా, ‘జీ-23’గా ఏర్పడిన కాంగ్రెస్ సీనియర్ నేతలు.. కొన్ని అంతర్గత సమస్యలపై పార్టీ అధినేత్రికి బహిరంగ లేఖలు రాయడం.. హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు అందరికీ ప్రత్యక్షంగా వార్నింగ్ ఇచ్చారు సోనియా.. డబ్ల్యూసీ సమావేశంలో ప్రారంభోపన్యాసంలో అనేక సమస్యలను లేవనెత్తారు కాంగ్రెస్ అధినేత్రి.. వ్యవసాయ చట్టాలు, ప్రభుత్వ విధానాలు, వైఫల్యాలను ఎండగట్టారు. ఇదే, సమయంలో.. అన్ని సమస్యలు వినేందుకు సిద్ధంగా ఉన్నా.. ఎలాంటి మోహమాటం లేకుండా అన్ని విషయాలపై మాట్లాడండి.. కానీ, అంతర్గత వ్యవహారాలపై రచ్చకెక్కొద్దని స్పష్టం చేశారు.
Also Read
- Turkey-UN: టర్కీ బుద్ధి మారలేదు.. యూఎన్‌లో పాక్‌కు మద్దతుగా కాశ్మీర్ ప్రస్తావన
- Pezeshkian: ‘మేము ఉగ్రవాదులం కాదు.. బాధితులం’.. యూఎన్‌లో ఫొటోలు చూపించి ఇరాన్ అధ్యక్షుడు ప్రసంగం
- Jaishankar-Rubio: రూబియోతో జైశంకర్ భేటీ.. రష్యా ఆంక్షల బిల్లుపై అభ్యంతరం
- Bihar: లైంగిక కేసు నిందితుడి చెంప పగలగొట్టిన న్యాయవాది
తాజావార్తలు
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
-
Hashmi – Himesh : 20 ఏళ్ల తర్వాత ఇమ్రాన్ హష్మీ, హిమేష్ రేష్మియా రీ యూనియన్
-
Madras Regiment Arms Theft Case: బొల్లారం మద్రాసు రెజిమెంట్ ఆయుధాల చోరీ కేసులో బిగ్ ట్విస్ట్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
ట్రెండింగ్
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!