భారత రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసిన, పార్లమెంట్ సమవేశాలను కుదిపేస్తోన్న పెగాసస్ వ్యవహారంపై విచారణ చేపట్టనుంది సుప్రీంకోర్టు.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం ముందు వాదనలు జరగనున్నాయి.. కేంద్ర మాజీ ఆర్ధిక మంత్రి యశ్వంత్ సిన్హా తో సహా మొత్తం 10 మంది పిటిషనర్లుగా ఉన్నారు.. కాగా, ప్రపంచవ్యాప్తంగా మొత్తం 17 ప్రముఖ మీడియా సంస్థలు సంయుక్త పరిశోధనాత్మక వార్తా కథనాలతో పెగాసస్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగు చూసింది.. […]
తమిళనాడులో మరో మాజీ మంత్రిపై అవినీతి నిరోధకశాఖ దాడులు చేస్తోంది.. తమిళనాడు మాజీ మంత్రి ఎస్పీ వేలుమణి ఇంటిపై డైరెక్టర్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీ కరెప్షన్ అధికారులు.. ఇవాళ ఉదయం నుంచి సోదాలు చేస్తున్నారు.. చెన్నై, కోయంబత్తూరు, కాంచీపురం, దింగిల్ సహా మొత్తం 54 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు.. ఇప్పటికే కొన్ని కీలమైన డాక్యుమెంట్లు , కంప్యూటర్లు, హార్డ్ డిస్క్‌లు సీజ్ చేసినట్టుగా చెబుతున్నారు.. అన్నా డీఎంకే ప్రభుత్వంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా […]
కరోనా మహమ్మారి విజృంభణతో విదేశీ ప్రయాణాలు పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి… కోవిడ్ కేసులు అదుపులోకి వస్తున్న తరుణంలో.. కొన్ని దేశాలు.. ఆంక్షలను సడలిస్తూ వస్తున్నాయి… విమానాల రాకపోకలపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నాయి.. కానీ, భారతీయ విమానాలపై ఆంక్షలను మరోసారి పొడిగించింది కెనడా ప్రభుత్వం… సెప్టెంబర్ 21 తేదీ వరకు భారత్ విమానాలపై నిషేధాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.. కాగా, డెల్టా వేరియంట్ వెలుగు చూడడంతో ఏప్రిల్ 22న ఇండియా నుంచి నేరుగా వెళ్లే విమానాలపై కెనడా నిషేధం విధించింది.. […]
తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటు చేసిన వైఎస్ షర్మిల.. ప్రజా సమస్యలు, ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తున్నారు… ముఖ్యంగా నిరుద్యోగ సమస్యపై ఫోకస్ పెట్టిన ఆమె.. నిరుద్యోగ నిరాహార దీక్ష పేరుతో.. ప్రతీ మంగళవారం దీక్ష చేస్తూ వస్తున్నారు.. అందులో భాగంగా… ఇవాళ కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో దీక్ష చేయనున్నారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. హుజురాబాద్ నియోజర్గంలోని ఇల్లంతకుంట మండలం సిరిసేడు గ్రామంలో ఇవాళ దీక్షకు కూర్చోనున్నారు.. సిరిసేడు గ్రామం […]
పీఎఫ్ చందాదారులకు అలెర్ట్… ఈ నెల 31వ తేదీలోపే మీరు తప్పనిసరగా ఇది చేయాల్సింది.. లేదంటే పీఎఫ్‌కు సంబంధించిన ఎలాంటి సేవలు పొందకుండా పోయే ప్రమాదం పొంచి ఉంది.. యూఏఎన్ (UAN) నంబర్‌తో తమ ఆధార్‌ను జత చేయడాన్ని ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) తప్పనిసరి చేసింది. ఆగస్టు 31ను ఇందుకు గడువుగా విధించింది. ఒకవేళ ఆధార్‌ను జత చేయలేకపోతే సెప్టెంబర్ 1 నుంచి పీఎఫ్‌కు సంబంధించి ఎలాంటి సేవలూ పొందలేరని స్పష్టం చేసింది.. యాజమాన్యాలు పీఎఫ్ […]
ఆంధ్రప్రదేశ్‌లో నాటుబాంబులు కలకలం సృష్టించాయి.. మద్యం మత్తులో ఓ వ్యక్తి నాటుబాంబులతో వీరంగం సృష్టించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే తిరుపతిలోని పాకాల మండలం వల్లివేడు పంచాయతీలో నాటుబాంబుల తీవ్ర కలకలం రేపాయి… మద్యం మత్తులో పది నాటుబాంబులతో వీరంగం సృష్టించాడు కృష్ణయ్య అనే వ్యక్తి… దీంతో.. ఓ నాటుబాంబు పేలింది. దీంతో.. స్థానికులు భయాందోళనకు గురయ్యారు.. అయితే, ఆ నాటుబాంబు పేలినా.. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో.. స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.. […]
బంగారం కొనుగోలు చేయడానికి ఎదురుచూస్తున్నవారికి గుడ్‌న్యూస్… పసిడి ధరలు మరోసారి తగ్గాయి… మరోవైపు వెండి కూడా పసిడి దారిలోని కిందకు దిగింది.. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.530 పతనం కావడంతో రూ.47,300కు దిగిరాగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.490 తగ్గుదలతో రూ.43,350కు క్షీణించింది. ఇక, వెండి ధర ఏకంగా రూ.1500 పతనం కావడంతో.. కిలో వెండి ధర రూ.68,700కు దిగొచ్చింది. అయితే, అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం […]
మేషం : ఈ రోజు ఈ రాశివారు తమ సంతానానికి స్థోమతకు మించిన వాగ్ధానాల ఇవ్వడం వల్ల ఇబ్బందులెదుర్కొంటారు. కళ, క్రీడా రంగాల వారికి ప్రోత్సాహం లభిస్తుంది. ప్రముఖులను కలుసుకుంటారు. కొత్త సమస్యలు తలెత్తే ఆస్కారం వుంది. విద్యార్థులకు ఆశించిన విద్యావకాశాలు లభిస్తాయి. వృషభం : ఈ రోజు మీరు పాతవస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. విద్యార్థులు కొన్ని నిర్బంధాలకు లోనవుతారు. వ్యాపారాభివృద్ధికి నూతన ప్రణాళికలు, పథకాలు అమలు చేస్తారు. బంధు మిత్రుల నుంచి ధన సహాయ […]
పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ.13,500 కోట్ల మేర ముంచి విదేశాలకు చెక్కేసిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. తనను భారత్‌కు అప్పగించవద్దని కోరుతూ అప్పీల్ దాఖలు చేసేందుకు లండన్ హైకోర్టు అనుమతి ఇచ్చింది. నీరవ్ మానసిక స్థితి అంశాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ అవకాశం కల్పించింది కోర్టు.. నీరవ్ ఇప్పటికే తీవ్ర కుంగుబాటుకు గురయ్యారు. ఇలాంటి సమయంలో ఆయన్ను ఇక్కడి నుంచి తరలిస్తే.. మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని.. […]
డెల్టా వేరియంట్.. ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ వేరియంట్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా అమెరికాలో పరిస్థితి మళ్లీ చేజారుతున్నట్లు కనిపిస్తోంది. అక్కడ ఒక్క రోజే లక్షకు పైగా కేసులు రావడం కలకలం రేపింది. జూన్‌లో అత్యంత తక్కువగా నమోదైన కేసులు.. ఇప్పుడు మళ్లీ పీక్‌కి చేరుకోవడంతో అగ్రరాజ్యం అప్రమత్తమైంది. ఒక శుక్రవారం రోజే లక్షా 30 వేలకు పైగా కొత్త కేసులు బయటపడ్డాయి. జూన్ నెల చివరిలో రోజువారీ కేసులు 11 వేలకు పడిపోయాయి. కానీ, […]