ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్యకు ప్రమాదం తప్పింది.. ఆయన ప్రయాణిస్తున్న కారు టేకులపల్లి సమీపంలో అదుపుతప్పి బోల్తా పడడంతో ప్రమాదం జరగగా.. ఈ ఘటనలో ఆయనకు స్వల్పగాయాలు అయినట్టుగా చెబుతున్నారు.. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని నర్సయ్యను చికిత్స కోసం ఇల్లందు ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయనకు ప్రథమ చికిత్స నిర్వహించారు.. ఈ ప్రమాదంలో కారు కూడా స్వల్పంగా దెబ్బతిన్నట్టుగా తెలుస్తోంది.. కొత్తగూడెం నుంచి ఇల్లందు వైపు వెళ్తుండగా కారు ప్రమాదానికి గురైనట్టుగా […]
తాను ఎప్పుడూ పేదల ప్రజల పక్షాన కొట్లాడే బిడ్డనేనని .. సీఎం కేసీఆర్‌తో అనేక అంశాలపై పెనుగులాడానని గుర్తుచేసుకున్నారు మాజీ మంత్రి ఈటల రాజేందర్.. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని కృష్ణ కాలనీలో ఈటెల రాజేందర్, మాజీ ఎంపీ వివేక్ సమక్షంలో పలువురు బీజేపీలో చేరారు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈటల మాట్లాడుతూ.. పదవుల కోసం పెదవులు మూయొద్దని, కేసీఆర్ సీఎం అయిన తర్వాత అనేక అంశాలపై ఆయనతో పెనుగులాడానని.. బయటికి చెప్పకపోయినా, అంతర్గతంగా కొట్లడానని.. […]
ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల వశం అయిపోయింది.. ప్రస్తుత అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశం విడిచి పారిపోయాడు.. దీంతో ఆఫ్ఘన్లో తాలిబన్ల రాజ్యం వచ్చేసింది.. ఇక, కొత్త అధ్యక్షుడి ఎంపికపై దృష్టిసారించారు తాలిబన్లు.. ఈ క్రమంలో తాలిబన్ కోఫౌండర్ ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ పేరు తెరపైకి వచ్చింది.. ఆఫ్ఘన్ శాంతి చర్చల సమయంలో అత్యధికంగా అందరి నోళ్లలో నానినపేరు ఇది.. ఇంతకీ.. ఎవరీ ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్.. ఆయనకు తాలిబన్ సంస్థకు ఉన్న సంబంధం ఏంటి? తాలిబన్ […]
కరోనా సెకండ్ వేవ్ కేసులు అన్ని రాష్ట్రాల్లో క్రమంగా తగ్గుతూ వస్తున్నా.. కేరళలో మాత్రం ఇంకా పెద్ద సంఖ్యలోనే పాజిటివ్ కేసులు బయట పడుతున్నాయి.. దీనికి పెద్ద సంఖ్యలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడం కూడా కారణంగా చెబుతున్నారు.. అయితే, కరోనా అత్యవసర ప్రతిస్పందన ప్యాకేజీ 2 కింద కేరళ రాష్ట్రానికి రూ.267.35 కోట్ల నిధులు కేటాయించినట్లు ఇవాళ ప్రకటించారు కేంద్ర ఆరోగ్య మంత్రి మాన్సుఖ్ మాండవియా.. ఇవాళ తిరువనంతపురం వెళ్లిన మాన్సుఖ్ మాండవియా.. ఆ రాష్ట్ర […]
ఆఫ్ఘనిస్థాన్ క్రమంగా తాలిబన్ల ఆధీనంలోకి వెళ్లిపోతుంది.. ఇప్పటికే దేశ రాజధాని కాబూల్‌లోకి ప్రవేశించిన తాలిబన్లు.. అధ్యక్ష భవనాన్ని సైతం స్శాదీనం చేసుకున్నారు.. ఇక, క్రమంగా అన్ని అధికార కార్యాలయాలను స్వాధీనం చేసుకుంటున్నారు. తాజాగా కాబూల్‌లో భారత్ నిర్మించిన ఆఫ్ఘన్ పార్లమెంట్ భవనాన్ని సాయుధ తాలిబన్లు ఇవాళ తమ ఆధీనంలోకి తీసుకున్నారు. స్పీకర్ చైర్లో ఒక తాలిబన్ కూర్చొని టేబుల్‌పై తుపాకీని ఉండగా.. అధ్యక్షుడితోపాటు ఇతర ప్రముఖులు ఆశీనులయ్యే స్థానాల్లో మరి కొందరు తాలిబన్లు కూర్చున్నారు.. కాగా, మొన్నటి […]
కృష్ణా నది జలాల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.. ఈ నేపథ్యంలో ఈ నెల 27న జరగనున్న కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.. ఇప్పటికే కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ ఉమ్మడిగా సమావేశం నిర్వహించగా.. ఈ నెల 27వ తేదీన సమావేశం నిర్వహిస్తున్నామని.. ఈ సమావేశానికి హాజరుకావాల్సిందిగా రెండు తెలుగు రాష్ట్రాలకు కేఆర్ఎంబీ నోటీసులు జారీ చేసింది. ఇక, నోటీసులతో భేటీ అజెండాను జతపరిచిన కేఆర్ఎంబీ.. కృష్ణాజలాల్లో రాష్ట్రాల వాటా, అజెండాలో […]
శ్రీశైలం మల్లన్న భక్తులకు గుడ్‌న్యూస్ చెప్పారు అధికారులు.. కరోనా మహమ్మారి కారణంగా ఎన్నో మార్పులు చేసుకోగా.. ఈ నెల 18 నుంచి స్వామివారి స్పర్శ దర్శనానికి భక్తులను అనుమతించనున్నట్లు ఈవో కేఎస్ రామారావు ప్రకటించారు.. ఇక, ప్రతిరోజు గర్భాలయంలో ఏడు విడతలుగా అభిషేకాలు, నాలుగు విడతలుగా సామూహిక అభిషేకాలు నిర్వహిస్తామని తెలిపిన ఆయన.. కోవిడ్ నేపథ్యంలో భక్తులను పరిమిత సంఖ్యలో మాత్రమే అనుమతించనున్నట్లు వెల్లడించారు. మరోవైపు.. అంతరాలయంలో భ్రమరాంబదేవికి ఆర్జిత కుంకుమార్చనలు జరుగుతాయని పేర్కొన్నారు.. వేదాశీర్వచనాలు, నవావరణ […]