టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనను ముగించుకుని తిరుగు ప్రయాణం అయ్యారు.. ఏపీలో పరిణామాలపై ఫిర్యాదు చేసేందుకు హస్తినకు వెళ్లింది చంద్రబాబు టీమ్.. అయితే, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సమావేశానికి ప్రయత్నించి విఫలం అయినట్టుగా తెలుస్తోంది.. దీంతో.. హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కినట్టుగా చెబుతున్నారు.. కానీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమయం ఇచ్చినప్పుడు మళ్లీ ఢిల్లీకి వచ్చేందుకు చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి..
ఇక, ఇంగ్లీషు, హిందీ (జాతీయ మీడియా) మీడియా ప్రతినిధులతో నిన్న రాత్రి పిచ్చాపాటి మాట్లాడిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు.. దేశ రాజకీయ పరిణామాలు, రానున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలోమారనున్న రాజకీయ సమీకరణాలపై మాట్లాడారు.. రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ తో సమావేశం బాగా జరిగిందని సంతోషం వ్యక్తం చేశారు. కాగా, టీడీపీ నేత పట్టాభి వ్యాఖ్యల తర్వాత ఏపీలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం మారిపోవడం.. పట్టాభి ఇంటితో పాటు.. టీడీపీ ప్రధాన కార్యాలయం, మరికొన్ని జిల్లా కార్యాలయాలపై కూడా దాడులు జరగడం.. ఆ తర్వాత చంద్రబాబు 36 గంటల దీక్ష.. ఇలా ఒక్కసారిగా ఏపీలో పొలిటికల్ హీట్ పెరిగిన సంగతి తెలిసిందే.