ఆప్ఘనిస్థాన్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు తాలిబన్లు.. దేశ రాజధాని కాబూల్ సహా.. అన్ని ప్రధాన నగరాలను.. చివరకు అధ్యక్ష భవనాన్ని సైతం స్వాధీనం చేసుకున్నారు.. అక్కడ పార్టీ కూడా చేసుకున్నారు.. అయితే, ప్రజలు మాత్రం భయంతో వణికిపోతున్నారు.. కాబూల్‌లో ప్రధాన రహదారులు.. వాహనాలతో భారీ ట్రాఫిక్‌తో దర్శనమిస్తుండగా.. ఇక, ఎయిర్పోర్ట్ లో ప్రజల రద్దీ పెరిగిపోయింది.. పెద్ద ఎత్తున ప్రజలు ఎయిర్‌పోర్ట్‌లోకి దూసుకెళ్లారు.. విమానంలో ఎక్కితే చాలు అనే అతృత వారిలో కనిపిస్తోంది.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని […]
మరో కొత్త రంగంలోకి అడుగుపెట్టనున్నారు ప్రముఖ వ్యాపారవేత్త అదానీ… ఇప్పటికే ఏ రంగాన్ని వదిలేది లేదు అన్న తరహాలో కొత్త అన్ని రంగంలోకి ఎంట్రీ ఇస్తూ తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ వస్తున్నారు ఆదానీ.. త్వరలో విల్మార్ కన్జూమర్ కంపెనీని ఏర్పాటు చేయబోతున్నారు. సిమెంట్ రంగంలో అడుగుపెడుతున్నట్టు ప్రకటించిన ఆయన… పెట్రో కమికల్, రిఫైనరీ సంస్థను కూడా ఫ్లోట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా యూనికార్న్ కంపెనీలపై కూడా దృష్టి సారించారు. టాటా సన్స్, రిలయన్స్ వంటి […]
కరోనా ఫస్ట్ వేవ్ అయినా.. సెకండ్ వేవ్ అయినా.. మహారాష్ట్రలో సృష్టించిన విలయం మామూలుది కాదు.. ఇప్పుడిప్పుడే కరోనా సెకండ్ వేవ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి.. ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చింది లేదు.. కానీ, ప్రజలు మాత్రం కోవిడ్ నిబంధనలు గాలి కొదిలి తిరిగేస్తున్నారు.. అయితే, ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించకపోతే మహారాష్ట్రలో మళ్లీ లాక్డౌన్ తప్పదని హెచ్చరించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే.. కరోనా మహమ్మారితో పోరాటం కూడా స్వాతంత్ర్య పోరాటం లాంటిదేనని వ్యాఖ్యానించిన […]
దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టారు సీఎం కేసీఆర్.. రాష్ట్రంలోని అన్ని దళితు కుటుంబాలకు విడతల వారీగా ఈ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు.. రైతు బంధు తరహాలో దళితబంధు అమలు చేస్తామని.. ప్రభుత్వ ఉద్యోగి ఉన్న దళిత కుటుంబానికి కూడా ఈ పథకాన్ని వర్తింపజేయనున్నట్టు వెల్లడించారు.. అయితే, దళితబంధు కాదు.. చరిత్రలో దళిత ద్రోహిగా మిగిలిపోతావు అంటూ సీఎం కేసీఆర్‌పై మండిపడ్డారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి.. దళితులకు సంబందించిన 30వేల కోట్ల రూపాయలని కమీషన్ల […]
అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం.. మళ్లీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి.. గతంలో పార్టీకి దూరమైనవారు కూడా తిరిగి టీఎంసీ గూటికి చేరుతున్నారు.. మరోవైపు.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ సుస్మితా దేవ్.. తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సుత్మితా దేవ్.. టీఎంసీ ఎంపీలు అభిషేక్ బెనర్జీ, డెరిక్ ఒబ్రెయిన్ సమక్షంలో టీఎంసీ కండువా […]
ప్రభుత్వ ఉద్యోగి ఉన్న దళిత కుటుంబానికి కూడా దళితబంధు పథకం వర్తింపజేస్తామని ప్రకటించారు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. రైతు బంధు తరహాలో దళిత బంధు కూడా అందరికీ వర్తింస్తుందని.. ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండి భూమి ఉన్నవారికి రైతు బంధు వచ్చినట్టే.. ప్రభుత్వ ఉద్యోగి ఉన్న కుటుంబానికి కూడా దళిత బంధు వస్తుందని వెల్లడించారు.. హుజూరాబాద్ వేదికగా దళితబంధు పథకం ప్రారంభోత్సవంలో.. సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఇదే వేదిక నుంచి రైతుబంధు కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం.. ఆ […]
సుప్రీంకోర్టు ఎదుట ఓ జంట ఆత్మహత్యాయత్నం చేసుకుంది… ఢిల్లీలోని సుప్రీంకోర్టు ప్రాంగణంలోని గేట్ డి వద్ద మధ్యాహ్నం 12.20 గంటల సమయంలో.. ఒక పురుషుడు, మహిళ తమ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకున్నారు.. మంటలు అంటుకున్న తర్వాత.. సుప్రీంకోర్టు ఆవరణలోకి వెళ్లేందుకు యత్నంచారు.. దీంతో అక్కడ కలకలం రేగింది. ఇక, వెంటనే స్పందించిన పోలీసులు.. మంటలను ఆర్పివేశారు. గాయాలపాలైన ఆ ఇద్దరనీ ఆస్పత్రికి తరలించారు.. మహిళలకు తీవ్ర గాయాలు కాగా.. పురుషుడి కాళ్లకు గాయాలయ్యాయి. ప్రస్తుతం […]
ఆఫ్ఘనిస్థాన్‌ను తాలిబన్ల వశం అయిపోయింది.. ఎవరూ ఊహించని రేతిలో వేగంగా కాబూల్‌ను హస్తగతం చేసుకున్నారు తాలిబన్లు.. అయితే, ఇప్పుడు మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ఆఫ్ఘన్‌తో స్నేహనికి సిద్ధం అంటోంది డ్రాగన్ కంట్రీ.. ఆఫ్ఘనిస్థాన్‌లో జరుగుతున్న తాజా పరిణామాలపై స్పందించిన చైనా.. ఆ దేశాన్ని హస్తగతం చేసుకున్న తాలిబన్ ఫైటర్లతో స్నేహ సంబంధాలు కొనసాగించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది.. ఇక, ఆఫ్ఘన్ పొరుగు దేశమైన రష్యా మాత్రం ఆందోళన వ్యక్తం చేసింది. ఆ దేశంలో […]
అనుకున్నతం పని అయిపోయింది.. ఇప్పటికే ఆఫ్ఘనిస్థాన్‌లోని 19 రాష్ట్రాలకు సంబంధించిన రాజధానుల్లో పాగా వేసిన తాలిబన్లు.. ఇక. ఆఫ్ఘన్‌పై పూర్తిస్థాయిలో పట్టు సాధించేదశగా కదులుతున్నారు.. దీనిలో భాగంగా తాలిబన్ తిరుగుబాటుదారులు రాజధాని కాబూల్‌లోకి ప్రవేశించిరాని ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎఫ్‌పీ ప్రకటించింది.. దేశంలోని అన్ని ప్రధాన నగరాలను ఇప్పటికే ఆక్రమించారు తాలిబన్లు.. ఇప్పుడు రాజధాని నగరాన్నీ తమ ఆధీనంలోకి తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.. ఎందుకంటే.. ఇప్పటికే దేశ రాజధాని కాబూల్‌లో అడుగుపెట్టారు తాలిబన్లు.. కేపిటల్ సిటీపై పూర్తిస్థాయిలో […]