ఇంద్రవెల్లి వేదికగా నిర్వహించిన తొలి దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా కార్యక్రమంలో విజయవంతం కావడంతో.. అదే ఊపుతో మరో సభకు సిద్ధమైంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ… ఇంద్రవెల్లి బహిరంగసభ వేదికగానే.. ఈ నెల 18వ తేదీన ఇబ్రహీంపట్నంలో తర్వాతి సభ ఉంటుందని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ప్రకటించారు.. అయితే, పోలీసులు అనుమతి నిరాకరించడం.. ఇతర కారణాలతో ఆ వేదిక కాస్తా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి మహేశ్వరం నియోజకవర్గానికి షిఫ్ట్ అయిపోయింది.. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని […]
ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు. మరికొన్ని చోట్ల మోస్తరు వర్షం, చిరుజల్లులు పడుతుండగా.. మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు తప్పేలా లేవని హెచ్చరిస్తోంది హైదరాబాద్ వాతావరణ కేంద్రం.. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది వాయవ్య బంగాళాఖాతం నుంచి నైరుతి దిశవైపునకు వంపు తిరిగి ఉన్నదని, వచ్చే 48 గంటల్లో పశ్చిమ వాయవ్యదిశగా కదలొచ్చని అంచనా వేస్తోంది హైదరాబాద్ […]
మేషం : ఈ రోజు ఈ రాశివారికి ఆర్థిక ఇబ్బందులు లేకపోయినా సంతృప్తికానరాదు. అధిక ఉష్ణం వల్ల కుటుంబ పెద్దల పట్ల ఆందోళన చెందుతారు. చిన్నతరహా పరిశ్రమలలో వారికి అనుకూలత. సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. వృషభం : ఈరోజు ఈ రాశిలోని వస్త్ర, బంగారు, వెండి వ్యాపారస్థులకు జయం చేకూరగలదు. వృత్తుల వారికి సంఘంలో మంచి గుర్తింపు. శ్రమకు తగిన ఆదాయం లభిస్తుంది. కొన్ని అనుకోని సంఘటనలు మనస్తాపం కలిగిస్తాయి. ముఖ్యుల కోసం […]
ఆఫ్ఘన్లో పరిస్థితిలు చాలా వేగంగా మారిపోయాయి.. ఎవ్వరూ ఊహించని తరహాలో తాలిబన్లు ఆఫ్ఘన్‌పై పట్టు సాధిస్తూ తక్కువ సమయంలో ఆ దేశాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. దీంతో.. ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ.. ఆఫ్ఘన్‌ను విడిచి పరారయ్యాడు.. ఖరీదైన కార్లతో పాటు.. పెద్ద ఎత్తున క్యాష్‌ను తన వెంట తీసుకొని వెళ్లాడని ప్రచారం జరిగింది.. అయితే, ఇప్పుడు తానే ఆపద్ధర్మ అధ్యక్షుడిని అంటూ తెరపైకి వచ్చారు ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్.. అధ్యక్షుడు దేశాన్ని విడిచి వెళ్లిపోవడంతో […]
ఆఫ్ఘనిస్థాన్‌లో పాగా వేశారు తాలిబన్లు.. ఒక్కొనగరం.. ఒక్కొ రాష్ట్రం.. దేశ సరిహద్దులు ఇలా ఏవీ వదలకుండా అంతా తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు.. ఆఫ్ఘన్ పరిస్థితుల ప్రభావం భారత్‌పై ఎంత మేరకు ఉంటుందనే చర్చ కూడా సాగుతోంది.. ఈ నేపథ్యంలో.. ప్రధాని నరేంద్ర మోడీ.. భద్రతా వ్యవహారాలపై కేబినెట్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఆఫ్ఘనిస్థాన్ లో పరిస్థితులపై చర్చించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, […]
ఏ మాత్రం బెరుకు లేకుండా క్రమంగా ముందుకు కదులుతూ.. తమ ఆకృత్యాలను కొనసాగిస్తూ మొత్తంగా ఆఫ్ఘనిస్థాన్‌ను స్వాధీనం చేసుకున్నారు తాలిబన్లు.. దేశ రాజధాని కాబూల్‌లోని ప్రధాన కార్యాలయాల్లోనూ పాగా వేశారు.. ఇక, ఆఫ్ఘన్ తమ వశం అయిన తర్వాత తొలిసారి మీడియా ముందుకు వచ్చి కీలక ప్రకటనలు చేశారు.. ఇవాళ మీడియాతో మాట్లాడిన తాలిబన్ అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్.. గతంలో తమ వైఖరికి, విధానాలకు భిన్నంగా వ్యాఖ్యలు చేశారు.. 20 ఏళ్ల తర్వాత విదేశీ సైన్యాన్ని […]
అన్నదాతలకు గుడ్‌న్యూస్ చెబుతూ.. రుణమాఫీ నిధుల విడుదల చేసిన ప్రభుత్వం… దశలవారీగా లబ్ధిదారులైన రైతుల ఖాతాల్లో ఆ సొమ్మును జమ చేస్తూ వస్తుంది.. రూ.25 వేల నుంచి రూ.50 వేల లోపు రుణాలున్న రైతులకు రుణమాఫీ నిధుల విడుదల కొనసాగుతుండగా.. ఇక, రెండో రోజులో భాగంగా 38,050 మంది రైతుల ఖాతాల్లోకి రుణమాఫీ నిధులను బదలాయించింది ప్రభుత్వం.. ఇవాళ ఒకేరోజు రుణమాఫీ కింద రూ.100.70 కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయ్యాయి. కరోనా పరిస్థితులతో ఆర్థిక కష్టాలున్నా.. […]
ఆఫ్ఘనిస్థాన్‌ను తమ ఆధీనంలోకి తీసుకుని తమకు ఎదురే లేదంటున్న తాలిబన్లకు షాక్‌లు కూడా తగులుతున్నాయి.. తాజాగా, జర్మనీ కీలక నిర్ణయం తీసుకుంది.. ఆఫ్ఘన్‌కు డెవలప్మెంట్ సాయాన్ని నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది.. ఈ విషయాన్ని జర్మన్ డెవలప్మెంట్ మంత్రి గెర్డ్ ముల్లర్ రినిష్ వెల్లడించారు.. డెవలప్మెంట్ ఫండ్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామన్న ఆయన.. ఇదే సమయంలో.. అక్కడినుంచి వచ్చేయాలని భావిస్తున్న స్థానిక అభివృద్ధి అధికారులు, ఎన్జీవోలకు చెందిన సభ్యులను దేశానికి రప్పించే చర్యలు మాత్రం కొనసాగిస్తామని తెలిపారు. అయితే, ఏడాదికి 430 […]