కోవాగ్జిన్‌కు డబ్ల్యూహెచ్‌వో గుడ్ న్యూస్..! 24 గంట్లోనే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చే విషయాన్ని గత కొంతకాలంగా వాయిదా వేస్తూ వచ్చిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు సిద్ధమైంది.. మరో 24 గంటల్లోగా కోవాగ్జిన్‌పై గుడ్‌న్యూస్ చెబుతాం అంటున్నారు డబ్ల్యూహెచ్‌వో ప్రతినిధులు. కోవాగ్జిన్ వ్యాక్సిన్‌కు సంబంధించిన మరింత డేటాను భారత్ బయోటెక్.. డబ్ల్యూహెచ్‌వోకి సమర్పించింది.. దీనిపై ఇవాళ డబ్ల్యూహెచ్‌వో సాంకేతిక కమిటీ సమీక్ష నిర్వహించింది. ఈ సందర్భంగా.. 24 గంటల్లో కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి ఆమోదం లభించే అవకాశం ఉందన్నారు గ్లోబల్ హెల్త్ బాడీ ప్రతినిధి మార్గరెట్ హారిస్.. మీడియాతో మాట్లాడిన ఆయన.. టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ప్రస్తుతం కరోనావైరస్ వ్యాధికి (కోవిడ్ -19) వ్యతిరేకంగా భారతదేశం దేశీయంగా తయారు చేసిన వ్యాక్సిన్ డేటాను సమీక్షిస్తున్నట్టు వెల్లడించారు.
ఇక, అన్నీ సక్రమంగా ఉంటే.. అన్నీ సరిగ్గా జరిగితే, కమిటీ సంతృప్తి చెందితే, మేం రాబోయే 24 గంటలలోపు సిఫార్సును ఆశిస్తున్నామని హారిస్ చెప్పినట్టు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. కాగా, ఇప్పటికే మిలియన్ల కొద్ది మంది భారతీయులు కోవాగ్జిన్ వేయించుకున్నారు.. కానీ, డబ్ల్యూహెచ్‌వో మాత్రం పెండింగ్‌లో పెడుతూ వచ్చింది.. హైదరాబాద్‌కు చెందిన ఫార్మాస్యూటికల్ కంపెనీ భారత్ బయోటెక్ ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. ఇది ఏప్రిల్ 19 నాటికి అత్యవసర వినియోగ ఆమోదం కోసం దరఖాస్తు చేసుకుంది.. అయితే, గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ముందు కంపెనీ నుండి మరింత డేటా అవసరమని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది.. దీంతో, అదనపు సమాచారాన్ని కూడా అందించింది ఆ సంస్థ. మరోవైపు, డబ్ల్యూహెచ్‌వో ఆమోదం లేకుండా, కోవాగ్జిన్ రెండు డోసులు వేయించుకున్నాసరే.. ప్రపంచవ్యాప్తంగా చెల్లుబాటు అయ్యే పరిస్థితి ఉండదు. వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ కంపల్సరీ చేసిన సందర్భంలో.. కోవాగ్జిన్ తీసుకున్నవారి అంతర్జాతీయ ప్రయాణాలు ప్రశ్నార్థకంగా మారాయి. దీంతో, ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పే గుడ్‌న్యూస్ కోసం భారత్ బయోటెక్‌తోపాటు.. ఇప్పటికే ఈ వ్యాక్సిన్ వేయించుకున్నవారు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read
తాజావార్తలు
-
NCP: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో ట్విస్ట్.? విలీనం దిశగా ఎన్సీపీ.. బీజేపీ ప్లాన్..
-
Kitchen Tips: వెల్లుల్లి తొక్క తీయడానికి ఇబ్బంది పడుతున్నారా? ఈ ఈజీ టిఫ్‌తో సెకన్లలో పని పూర్తి!
-
UCC Bill: ‘ఒక్క పెళ్లి చేసుకున్నవారికే రాష్ట్రంలో ఉండే హక్కు ఉంటుంది’.. సీఎం సంచలన ప్రకటన..
-
CM Chandrababu : అమరావతి దేవతల రాజధాని.. నవ్యాంధ్రను నెంబర్ వన్ చేయడమే నా లక్ష్యం
-
Success Story: 20 గంటల పోలీసు డ్యూటీ, గర్భం, రెండు వైఫల్యాలు..అయినా ఒక రైతు కూతురు డీఎస్పీ అయింది..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్‌పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్‌కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!