బాధితుల మీదే కేసులు.. ప్రశ్నిస్తే దాడులు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్‌లో బూతుల పర్వం కాస్త.. కేసుల నమోదుకు దారితీసింది.. అయితే, బాధితుల మీదే కేసులు నమోదు చేస్తున్నారు.. ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు.. తనపై గుంటూరులో కేసు నమోదు చేయడంపై స్పందించిన ఆయన.. బాధితుల మీదే కేసులు పెడుతున్నారు.. ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారని మండిపడ్డారు.. చంపుతామన్న మైదుకూరు ఎమ్మెల్యే మీద ఏం కేసులు పెట్టారు..? అంటూ ఈ సందర్భంగా నిలదీసిన ఆయన.. చంద్రబాబు మీద బాంబులేస్తామన్న కుప్పం వైసీపీ నేత సెంథిల్ కుమార్ పై ఏం చర్యలు తీసుకున్నారు? అని నిలదీశారు.. చంద్రబాబును.. టీడీపీ నేతలను దుర్భాషలాడిన కావటి మనోహర్ నాయుడుపై ఏం కేసులు పెట్టారు..? అంటూ ప్రశ్నల వర్షం కురిపించిన బోండా ఉమ.. అయితే, కేసులకు భయపడం.. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.
కాగా, టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుపై కేసు నమోదు చేశారు అరండల్ పేట పోలీసులు.. మూడు రోజుల క్రితం బోండా ఉమపై ఫిర్యాదు చేశారు గుంటూరు మేయర్ కావటి మనోహర్… టీడీపీ అధినేత చంద్రబాబు దీక్ష సమయంలో బోండా ఉమా చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు.. దీంతో.. బోండా ఉమాపై ఐపీసీ 153ఏ, 294 బీ, 504 , 505, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు అరండల్ పేట్ పోలీసులు.
Also Read
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!