పెట్రో ధరల మంట మండుతోంది.. పెట్రోల్ బంక్‌కు వెళ్లాలంటేనే వెనుకడుగు వేయాల్సిన పరిస్థితి దాపురించింది.. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో రూ.110ను క్రాస్ చేసింది లీటర్ పెట్రోల్ ధర.. ఇక, డీజిల్ ధర కూడా తానే తక్కువ అనే స్థాయిలో పెరుగుతూనే ఉంది.. తాజాగా మధ్యప్రదేశ్‌లోని ఓ జిల్లాలో ఏకంగా లీటరు పెట్రోల్ ధర ఏకంగా రూ.120 మార్కును కూడా దాటేసింది.. డీజిల్ ధర రూ.110కిపైగానే ఉండడంతో.. ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌లోని అనుప్పూర్ జిల్లా కేంద్రంలో లీటర్ పెట్రోల్ ధర రూ.120.4కు చేరగా.. డీజిల్ ధర రూ.110ని దాటేసింది.. మరోవైపు, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన బాలాఘాట్‌లోనూ లీటరు పెట్రోల్ రూ. 119.23గా ఉంటే.. రాజధాని భోపాల్‌లో రూ.116.62కు పెరిగింది.. ఇవాళ పెట్రోల్‌పై 36పైసలు పెరగడంతో లీటరు పెట్రోల్ ధర రూ.120 మార్కును దాటినట్లు అధికారులు చెబుతున్నారు. డీజిల్‌పై 37 పైసలు పెరగడంతో రూ.109.17కి చేరింది.