ఏపీలో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో ఏసీబీ కోర్టు సోమవారం రోజు సిట్కు ఝలక్ ఇచ్చింది. లిక్కర్ స్కాం కేసులో సిట్ దాఖలు చేసిన చార్జిషీట్ల మీద అభ్యంతరాలు వ్యక్తం చేసింది. రెండు ఛార్జ్షీట్లలో 21కి పైగా అభ్యంతరాలు తెలిపారు న్యాయమూర్తి. నిందితులు అందరికీ ముద్దాయి కాపీలు అందజేశారా..? అని ప్రశ్నించారు. ఈ కేసుకు అవినీతి నిరోధక చట్టం ఎలా అప్లయ్ అవుతుందో చెప్పాలని అడిగారు.
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు విచారణలో సిట్ దూకుడు పెంచింది. ఈ కేసుకు సంబంధించి మరింత విచారణ చేయాలని కోర్టు దృష్టికి తీసుకుని వెళ్లారు సిట్ అధికారులు. పునర్విచారణ చేసి 90 రోజుల్లోపు అడిషనల్ చార్జీ షీట్ దాఖలు చేయాలని న్యాయస్థానం గత నెల 22న ఆదేశాలు ఇచ్చింది.. ఇప్పటికే ఎమ్మెల్సీ గన్ మెన్ ను విచారణ చేశారు... మరోవైపు అనంతబాబు భార్య లక్ష్మీ దుర్గతో పాటు ఇద్దరు అనుచరులు గంగాధర్, ప్రవీణ్ లను కూడా విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు..
తల్లికి వందనం పథకంపై శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఏపీలో తల్లికి వందనం పథకం పెండింగ్ దరఖాస్తులకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆమోదం తెలిపారు.. విద్యా శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించిన లోకేష్.. పథకానికి సంబంధించి పెండింగ్ లో ఉన్న రూ.325 కోట్లు రిలీజ్ కు అనుమతి ఇచ్చారు.. దీంతో, త్వరలోనే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం పథకానికి సంబంధించిన సొమ్ము జమకానుంది.
డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.. తనపై హైదరాబాద్ లో దాఖలైన ఎఫ్ఐఆర్ ను కొట్టివేసింది సుప్రీంకోర్టు.. అయితే, ఏపీ కానిస్టేబుల్ పై దాడి జరిగిందంటూ రఘురామ కృష్ణంరాజు, అతని కార్యాలయ సిబ్బందిపై గతంలో ఎఫ్ఐఆర్ దాఖలు అయ్యింది.
తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం గాడాల ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎరువుల సరఫరాలో పారదర్శకత పాటించాలని ఆదేశించారు.
విజయవాడ తూర్పు నియోజకవర్గంలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ ప్రారంభించారు మంత్రి నాదెండ్ల మనోహర్.. వరలక్ష్మి నగర్లో ఇంటింటికీ వెళ్లి స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు మంత్రి నాదెండ్ల మనోహర్,ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, కలెక్టర్ లక్ష్మీషా.. ఈ సందర్భంగా నాదెండ్ల మాట్లాడుతూ.. నేడు రాష్ట్రంలో పండుగ వాతావరంలో స్మార్ట్ రేషన్ కార్డ్స్ పంపిణీ జరుగుతుందన్నారు.. రేషన్ పంపిణీలో అక్రమాలు అరికట్టడానికి స్మార్ట్ కార్డులు అందుబాటులోకి తెచ్చాం.. స్మార్ట్ కార్డ్స్ వల్ల ఉన్నతస్థాయిలో మానిటరింగ్ జరుగుతుందని వెల్లడించారు..
వైఎస్ జగన్మోహన్రెడ్డి అడ్డాలో ఆధిపత్యం కోసం టీడీపీ తమ్ముళ్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది... నిన్న మొన్నటి వరకు టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఎవరిని ఎంపిక చేయాలా? అని తలలు పట్టుకునే టీడీపీకి ఇప్పుడు తీవ్ర పోటీ నెలకొనడంతో అదే తలనొప్పిగా మారింది.