ఆంధ్రప్రదేశ్లో ఓ తల్లి అందరికీ ఆదర్శంగా నిలిచారు.. తమకు కున్న నలుగురు కూతుళ్లను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దదారు.. చేసేది వ్యవసాయమే.. కష్టపడి నలుగురిని చదివించారు.. ఇక, వారి కష్టాన్ని ఏ మాత్రం వమ్ము చేయకుండా.. ఆ నలుగురు పిల్లలు ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించి సగర్వంగా నిలిచారు.. దీంతో, ఆ తల్లి ఆనందానికి అవదలు లేకుండా పోయాయి..
2025 సంవత్సరం క్రికెట్ అభిమానులకు ఒకరకంగా విషాదకరమైన సంవత్సరం అనే చెప్పాలి. ఎందుకంటే ఈ సంవత్సరంలోనే క్రికెట్కు చాలామంది దిగ్గజ క్రీడాకారులు గుడ్ బై చెప్పేశారు. ఇప్పుడు ఈ జాబితాలోకి ఛతేశ్వర్ పుజారా కూడా చేరాడు. తన వన్డే కెరీర్లో కేవలం 5 మ్యాచ్లు మాత్రమే ఆడిన పుజారా, టెస్ట్ క్రికెట్లో మాత్రం 103 మ్యాచ్లలో మొత్తం 7,195 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో పుజారా కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు.
కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేల వైఖరికి సంబంధించి సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.. ప్రధానంగా టీడీపీ, జనసేన ఎమ్మెల్యేల పనితీరు మీద రకరకాలు విమర్శలు వస్తున్నాయి.. కొంతమంది ఎమ్మెల్యేలు వరస వివాదాలలో ఇరుక్కుంటున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తోంది.. సుమారు ఒక 25 మంది ఎమ్మెల్యేల పనితీరు మీద వాళ్ల మీద వచ్చిన వివాదాలకు సంబంధించి సీఎం చంద్రబాబు చాలా అసంతృప్తిగా ఉన్నారు.
యూరియా కొరతపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఆగస్టులో లక్షా 65 వేల టన్నులు రావాల్సి ఉండగా, ఇప్పటి వరకు 65 వేల టన్నుల యూరియా రాష్ట్రానికి వచ్చింది. ఇంకా లక్ష టన్నుల యూరియా రావాల్సి ఉంది. అయితే, జూలైలోనూ 50 వేల టన్నులు తక్కువ వచ్చింది. దీంతో రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడింది. గత నెల, ఈ నెల వర్షాలు విస్తారంగా కురవడంతో పంటల సాగు ఎక్కువగా జరిగింది.
ఇవాళ్టి నుంచి స్మార్ట్ రైస్ కార్డులు పంపిణీ చేయనున్నారు.. ఉదయం 10:30కు వరలక్ష్మీనగర్, విజయవాడ ఈస్ట్, ఎన్టీఆర్ జిల్లా.. మధ్యాహ్నం 12:00 గంటలకు కంకిపాడు, పెనమలూరు నియోజకవర్గం, కృష్ణా జిల్లాలో.. ఇంటింటికి స్మార్ట్ రైస్ కార్డుల కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్.
ఎమ్మెల్యేలు మాట వినకపోతే ఇక మాటల్లేవ్... అని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఇకపై మాటల్లేవ్... యాక్షన్ మాత్రమే ఉంటుందన్నారు.. గాడి తప్పుతున్న ఎమ్మెల్యేలకు సరిచేసుకోమని ఒకసారి చెప్తా అన్నారు.. అయినా తీరు మారకుంటే రెండో సారి పిలిచి చెప్తా..., అప్పటికీ మారకుంటే ఇక చెప్పటాలుండవు, నేను తీసుకోవాల్సిన చర్య తీసుకుంటా అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సీఎం చంద్రబాబు..
వైసీపీ ప్రతిపక్షం కాదు.. ఒక విషవృక్షం అంటూ ధ్వజమెత్తారు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. పార్లమెంట్ కమిటీల కూర్పుపై సమావేశం నిర్వహించారు చంద్రబాబు.. సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి 75 మంది పార్టీ నేతలు హాజరయ్యారు.. పార్లమెంట్ పార్టీ కమిటీల ఏర్పాటు కోసం ఏర్పాటు చేసిన త్రి సభ్య కమిటీలతో చంద్రబాబు భేటీ అయ్యారు..