Minister Kandula Durgesh: తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో విజయదశమిని పురస్కరించుకొని జనసేన పార్టీ జిల్లా ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు.. ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్.. కీలక వ్యాఖ్యలు చేశారు.. విజయం సాధించిన తర్వాత ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రాష్ట్ర అభివృద్ధిలో సంస్కరణలు తీసుకువచ్చారని తెలిపారు.. పవన్ కల్యాణ్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల అభిమాన్ని చూరగొన్నాయన్న ఆయన.. పవన్ చేపట్టిన శాఖల ద్వారా అమలు చేస్తున్న పథకాలు దేశవ్యాప్తంగా ప్రజాధరణ పొందాయని ప్రశంసించారు.. దేశంలో ఎక్కడా జరగని విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి గ్రామ సభలు నిర్వహించి ప్రజా సమస్యల పరిష్కరించారు అంటూ పవన్ కల్యాణ్‌ను అభినందించారు కందుల దుర్గేష్..
Read Also: Kaleshwaram Projcet : కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణపై రాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయం
ఇక, గ్రామాల్లో చేపట్టవలసిన పనులను గ్రామసభల్లో ప్రజలే నిర్ణయించి అమలు చేసేలా పవన్ కల్యాణ్ వినూత్న ప్రణాళిక నిర్వహించారు.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అత్యద్భుతంగా పరిపాలన అందిస్తుందన్నారు మంత్రి కందుల దుర్గేష్.. ఒకపక్క సమర్థవంతమైన ముఖ్యమంత్రి చంద్రబాబు మరోపక్క పేదల కన్నీళ్లు తడవడానికి వచ్చిన పవన్ కల్యా్‌ణ్.. వీరిద్దరికీ పైన ప్రధాన నరేంద్ర మోడీ రాష్ట్ర అభివృద్ధిలో నిధులు విడుదల అభివృద్ధికి పూర్తిస్థాయి సహాయ సహకారాలు అందిస్తున్నారని పేర్కొన్నారు. జనసేన కార్యకర్తలు అంతా అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు మంత్రి కందుల దుర్గేష్.. ఈ ఆత్మీయ సమావేశానికి కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, జిల్లాలోని వివిధ నియోజకవర్గాల జనసేన ఇంఛార్జ్‌లు హాజరయ్యారు.