బీహార్ ఎన్నికల తరుణంలో ఓట్లచోరీ ఆరోపణలే హైలైట్ అవుతున్నాయి. ఈ అంశాన్నే ఫోకస్ చేస్తూ.. రాహుల్ ఇప్పటికే ఓటర్ అధికార యాత్ర పేరుతో ఎన్నికల ప్రచారం షురూ చేశారు. ఓట్ల చోరీపై రాహుల్ విమర్శలు, ఈసీ కౌంటర్లు, సుప్రీం డైరక్షన్ తర్వాత.. బీహార్ ఎన్నికలు ఎవరి వాదనను నమ్ముతున్నారనేది అసెంబ్లీ ఎన్నికల్లో తేలిపోనుంది.
నాగర్సోల్ నుంచి నరసాపురం వెళుతున్న నర్సాపూర్ ఎక్స్ ప్రెస్ రైలు తెల్ల వారుజామున 2.47 గంటలకు నడికుడి రైల్వేస్టేషన్ సమీపానికి చేరుకుంది. ఆ సమయంలో మాచర్ల హైవే అండర్ బ్రిడ్జి సమీపంలో దుండగులు పట్టాల పక్కన హోమ్ సిగ్నలింగ్‌ను ట్యాంపర్ చేశారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. నేడు విశాఖపట్నం వెళ్లనున్నారు.. గత ఎన్నికల్లో కూటమి విజయంలో కీలక భూమిక పోషించింది జనసేన.. ఆ తర్వాత కీలకమైన డిప్యూటీ సీఎం పదవి కూడా జనసేనాని వరించింది.. ఓ వైపు కూటమి సర్కార్‌లో కీలక శాఖలు నిర్వహిస్తూనే.. మరోవైపు పార్టీ బలోపేతంపై దృష్టిసారించారు పవన్ కల్యాణ్.. దీనికోసం విశాఖ వేదికగా మూడు రోజుల పాటు జనసేన విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహించబోతున్నారు..
ప్రతి ఏడా వినాయక చవితి (గణేష్ చతుర్థి) భాద్రపద మాసం శుక్లపక్ష చతుర్థి తేదీన వస్తుంది. 10 రోజుల అనంతరం గణేష్ పండుగ అనంత చతుర్దశి రోజున ముగుస్తుంది. ఈ సంవత్సరం గణేష్ చతుర్థి ఆగస్టు 27 నుంచి అంటే ఇవాళ ప్రారంభమై.. సెప్టెంబర్ 7 వరకు కొనసాగుతుంది. వినాయక చవితికి ఉత్సవాలు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి..
* నేడు వినాయక చవితి.. దేశవ్యాప్తంగా గ్రామాలు, వీధులు, పట్టణాలు, ఇళ్లలో కొలువుదీరనున్న గణనాథులు.. * భారత్‌పై సుంకాలు 50 శాతానికి పెంచిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. నేటి నుంచే అమల్లోకి రానున్న 50 శాతం సుంకాలు.. * ఢిల్లీ: ఇవాళ సీపీఐ, సీపీఎం అగ్రనేతలను కలవనున్న ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి.. మధ్యాహ్నం 2 గంటలకు సీపీఐ జాతీయ పార్టీ కార్యాలయానికి, 3 గంటలకు సీపీఎం కార్యాలయాలనికి వెళ్లనున్న సుదర్శన్ రెడ్డి.. […]
ఐపీఎస్ అధికారి, ఏపీ సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్ కుమార్ కు మరోసారి షాక్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. అతడిపై సస్పెన్షన్‌ను మరోసారి పొడిగించింది.. మరో 6 నెలల పాటు సస్పెన్షన్ వేటు వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది..
బ్యాంకర్ల తో ఏర్పాటు చేసే సమావేశాల్లో రైతులు, ప్రజలు, ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయాలు ఉండాలన్నారు సీఎం చంద్రబాబు . రోటీన్ సమావేశాల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్నారు.. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 232వ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం జరిగింది.. వ్యవసాయ, ప్రాథమిక రంగాలు, MSME, గ్రామీణ బ్యాంకింగ్ సేవలపై సమీక్ష నిర్వహించారు..