టీడీపీ వర్సెస్ వైసీపీ.. విజయనగరం జిల్లాలో ఉద్రిక్తత..
విజయనగరం జిల్లాలోని గుర్ల మండలం జమ్ము గ్రామంలో దేవి విగ్రహ నిమజ్జన కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసింది. వైసీపీ, టీడీపీ వర్గాలు గ్రామంలో వేర్వేరుగా అమ్మవారి విగ్రహాలు ఏర్పాటు చేశారు. నవరాత్రులు ముగియడంతో ఇరు పార్టీలు నిమర్జన కార్యక్రమాన్ని చేపట్టాయి.. టీడీపీ వర్గీయులు ముందుగా అమ్మవారి విగ్రహాన్ని ఊరు దాటించారు. అయితే, వెనుక వస్తున్న వైసీపీ వర్గీయుల విగ్రహాన్ని చూసి రిథిగి ఓ వీధిలోకి మళ్లించారు. రెండు విగ్రహాలు ఎదురెదురు కావడంతో కాస్త ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరువర్గాల మధ్య నెలకొన్ని వివాదం కాస్తా సమసిపోతున్న సమయంలో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు.. లాఠీచార్జ్‌కు దిగారు. పోలీసులు వైసీపీ వర్గీయులపై దాడి చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మహిళలపై కూడా పోలీసులు లాఠీచార్జ్ కు పాల్పడ్డారని గ్రామస్తులు మండిపడుతున్నారు.. ఇది హేయమైన చర్య అని ఫైర్ అవుతున్నారు.. అయితే, ఈ ఘర్షణలో కనీసం 10 మందికి గాయాలు కాగా, వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా చెబుతున్నారు.. బాధితులను విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆనంద్ అనే యువకుడిని పోలీసులు చుట్టుముట్టి విచక్షణారహితంగా చితకబాదారని చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు వ్యవహారించిన తీరుపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు వైసీపీ కార్యకర్తలు.. ముఖ్యంగా సంబంధిత సీఐ అత్యుత్సాహం చూపించి, పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని స్థానిక నేతలు మండిపడుతున్నారు.
నేడు స్వచ్ఛ ఆంధ్ర-2025 అవార్డుల ప్రదానం
స్వచ్ఛ ఆంధ్ర-2025 అవార్డులు ప్రదానం చేసేందుకు సిద్ధమైంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఇవాళ సాయంత్రం విజయవాడలో స్వచ్ఛ ఆంధ్ర 2025 అవార్డులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రదానం చేయనున్నారు.. మొత్తం 21 కేటగిరీల్లో జిల్లా, రాష్ట్ర స్థాయిలో అవార్డులను ఇప్పటికే ప్రకటించింది స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్.. రాష్ట్ర స్థాయిలో 69 అవార్డులు, జిల్లా స్థాయిలో 1,257 అవార్డులు అందజేయనున్నారు.. స్వచ్ఛత కార్యక్రమాల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన మున్సిపాలిటీలకు కేంద్రం ఇస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల తరహాలో స్వచ్ఛ ఆంధ్ర అవార్డులు ఇస్తున్నారు.. స్వచ్ఛ మునిసిపాలిటీలు, స్వచ్ఛ గ్రామ పంచాయతీలు, స్వచ్ఛ స్కూల్స్, స్వచ్ఛ ఆసుపత్రులు, స్వచ్ఛ కార్యాలయాలు, స్వచ్ఛ రైతు బజార్లు, స్వచ్ఛ బస్సు స్టేషన్లు, స్వచ్ఛ పరిశ్రమల కేటగిరీల్లో అవార్డులకు ఎంపిక చేశారు.. మూడు దశల్లో వెరిఫికేషన్ తర్వాత పూర్తి డిజిటల్ విధానంలో అవార్డులను ఎంపిక చేశారు.. ఈ సారి రాష్ట్ర స్థాయిలో ఉత్తమ స్వచ్ఛ జిల్లాగా అనంతపురం తోపాటు 6 మున్సిపాలిటీలు, 6 గ్రామ పంచాయతీలు ఎంపిక చేశారు.. అవార్డులకు ఎంపికైన మునిసిపాలిటీల విషయానికి వస్తే.. మంగళగిరి -తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్, తాడిపత్రి, బొబ్బిలి, పలమనేరు, ఆత్మకూరు (నెల్లూరు జిల్లా), కుప్పం ఉన్నాయి.. ఇక, అవార్డులకు ఎంపికైన గ్రామ పంచాయతీలను పరిశీలిస్తే.. చౌడువాడ (అనకాపల్లి జిల్లా), ఆర్.ఎల్.పురం (ప్రకాశం జిల్లా), లోల్ల (కోనసీమ జిల్లా), చల్లపల్లి (కృష్ణా జిల్లా), చెన్నూరు (వైఎస్సార్ కడప జిల్లా), కనమకుల పల్లె (చిత్తూరు జిల్లా) ఉన్నాయి.. అద్భుత ప్రతిభ కనబరిచిన పారిశుధ్య కార్మికులు, గ్రీన్ అంబాసిడర్ లు, స్వయం సహాయక సంఘాలకు కూడా అవార్డులు అందజేయనున్నారు..
కొనసాగుతున్న PHC డాక్టర్ల ఆందోళన.. ఆ ఐదు డిమాండ్లపై పట్టు..!
ఏపీలో PHC డాక్టర్ల నిరసన నిరాహారదీక్షగా మారింది.. మొత్తం 5 ప్రధాన డిమాండ్లతో నిరసన దీక్ష చేపట్టారు PHC డాక్టర్లు.. అయితే, PHC డాక్టర్లు సమ్మె విరమించాలని, వారి డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని, అవకాశాన్ని బట్టి డిమాండ్లు పరిష్కరిస్తామని మంత్రి సత్యకుమార్ యాదవ్ హామీ ఇస్తూ ప్రెస్ రిలీజ్ ఇచ్చారు.. ఇదే నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండ్యన్, డైరెక్టర్ పద్మావతి PHC డాక్టర్లతో చర్చలు జరిపారు.. మొదటి విడత చర్చల్లో డాక్టర్ల డిమాండ్లలో ఇన సర్వీసు కోటా 20 శాతం అన్ని స్పెషాలిటీలకు ఇస్తూ, ఒక సంవత్సరం మాత్రమే అవకాశం ఇస్తామనడంతో PHC డాక్టర్లు ససేమిరా అంటూ వెనుదిరిగారు.. మొత్తంగా ఏపీలో PHC డాక్టర్ల రిలే నిరాహారదీక్ష కొనసాగుతుంది.. ప్రధానంగా 5 డిమాండ్లపై పట్టుపడుతున్నారు PHC డాక్టర్లు.. 20 శాతం PG ఇన్ సర్వీసు కోటా అన్ని స్పెషాలిటీలలో 5 సంవత్సరాలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఒక సంవత్సరానికే పరిమితం చేసింది ప్రభుత్వం.. 330 మంది PG ఇన్ సర్వీసు వైద్యులు అదనంగా ఉంటారంటుంది ప్రభుత్వం.. జీవో 99ను తొలగించడం ద్వారా న్యాయం చేయాలంటున్నారు PHC వైద్యులు.. PG ఇన్ సర్వీసు కోటాపై సందిగ్ధత కొనసాగుతుంది.. PHC వైద్యులు సమ్మె విరమించాలని కోరారు వైద్య ఆరోగ్య శాఖామంత్రి సత్యకుమార్ యాదవ్..
పవన్ కల్యాణ్ మాస్టర్ స్కెచ్.. పొలిటికల్ సర్కిల్‌లో హాట్ టాపిక్..!
జనసేన పార్టీ భవిష్యత్తు దిశలో కీలకమైన అడుగుగా పవన్ కల్యాణ్ మాస్టర్ స్కెచ్ వేశారు.. అదే త్రిశూల వ్యూహం.. అయితే, జనసేనాని రూపొందించిన త్రిశూల వ్యూహం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసింది. మూడు దిశల్లో పార్టీని బలోపేతం చేసే లక్ష్యంతో రూపొందిన ఈ వ్యూహం.. పార్టీ భవిష్యత్తు దిశను, కూటమి సమీకరణాలను ప్రభావితం చేసే ప్రయత్నంగా కనిపిస్తోంది. ఈ త్రిశూల వ్యూహం మూడు ప్రధాన అంశాలపై సాగుతోంది.. ప్రభుత్వంలో పాత్ర, పార్టీ బలపరచడం, ప్రజా సంబందాలు.. మొదటిగా ప్రభుత్వ వ్యవహారాల్లో చురుకుగా పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా కీలక నిర్ణయాల్లో పాల్గొంటున్నారు. ప్రజా సమస్యలను ప్రభుత్వస్థాయిలో పరిష్కరించడమే కాకుండా.. జనసేన హామీల అమలుపై కూడా దృష్టి సారిస్తున్నారు. రెండవది పార్టీ బలపరచడం. ఎన్నికల తరువాత కూడా కేడర్ మోటివేషన్ నిలబెట్టడం, బూత్ స్థాయి దాకా పార్టీలో చైతన్యం కొనసాగించడం మీద ఫోకస్ చేస్తున్నారు. సమన్వయకర్తలకు నేరుగా సూచనలు ఇచ్చి, పార్టీని వ్యవస్థీకృత దిశగా నడిపించే ప్రయత్నం కనిపిస్తోంది. మూడవది ప్రజా సంబంధం. అధికారంలో ఉన్నప్పటికీ ప్రజల మనసుకు దగ్గరగా ఉండే విధంగా పవన్ కల్యాణ్ వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో పర్యటనలు, ప్రజా సమావేశాలు, సమస్యలపై వెంటనే స్పందించడం ఇవన్నీ ఈ వ్యూహం భాగంగానే చూస్తున్నారు విశ్లేషకులు.
మొయినాబాద్ ఫామ్ హౌస్లో మైనర్ల గంజాయి పార్టీ..
రంగారెడ్డి జిల్లాలోని మొయినా బాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చెర్రీ వోక్స్ ఫామ్ హౌస్ లో మైనర్ల మద్యం, డ్రగ్స్ పార్టీ తీవ్ర కలకలం రేపుతుంది. పెద్ద మంగళారం గ్రామంలో ఉన్న ఓక్స్ ఫామ్ హౌస్ లో మైనర్స్ ఈ డ్రగ్స్ పార్టీ చేసుకున్నారు. పార్టీలో సుమారు 50 మంది మైనర్లు పాల్గొన్నారు. పక్కా సమాచారంతో తనిఖీలు చేసి రాజేంద్ర నగర్ ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. ఇక, డ్రగ్ టెస్ట్ లో ఇద్దరు మైనర్లకు గంజాయి పాజిటివ్ వచ్చింది. అలాగే, 8 విదేశీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని, ఈ పార్టీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మొయినాబాద్ పోలీసులు. ఇక, పట్టుబడిన వారిలో 12 మంది యువతులు, 38 మంది యువకులు ఉండగా, వీరిలో చాలా మంది మైన్లరే ఉన్నారని పోలీసులు తెలిపారు. అధిక డబ్బు ఈజీ మనీకి అలవాటు పడి ఫామ్ హౌస్ ఫార్మ్ హౌస్ ఓనర్ ఈ పార్టీని ఏర్పాటు చేశారు. ఇన్ స్టాగ్రామ్ లో ఫేక్ ఐడీని క్రియేట్ చేసి ఒక్కరికి 13,00 వందల రూపాయల ఎంట్రీ ఫీజ్ తో మద్యం, గంజాయి, డ్రగ్స్ అని యువతకు ఎర వేశాడు. అయితే, పోలీసుల ఏంట్రీతో ఒక్క సారిగా కథ అడ్డం తిరిగింది. అధిక డబ్బుకు అలవాటు పడి యువతను పక్క దారి పట్టిస్తున్న ఫామ్ హౌస్ ఓనర్ ని అరెస్ట్ చేశారు, ఈ ఘటనతో చుట్టుపక్కల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
జూబ్లీహిల్స్ అభ్యర్థిగా బీసీనే.. కాంగ్రెస్ పార్టీ బిగ్ స్కెచ్.. ఆ రెండు పార్టీలకు చెక్?
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ప్రధాన పార్టీలు సన్నాహాలు రూపొందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికార కాంగ్రెస్, విపక్ష బీజేపీలు ఈ ఎన్నికను ప్రస్టేజ్‌గా తీసుకుని.. కమిటీలు, సబ్ కమిటీలు, సర్వేలు, సమీక్షలతో బిజీగా మారిపోగా, బీఆర్ఎస్ మాత్రం ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించి, జోరుగా ప్రచారం కూడా చేస్తోంది. అయితే, జూబ్లీహిల్స్ బైపోల్ అభ్యర్థిని ఎంపిక చేయడానికి నలుగురి పేర్లను కాంగ్రెస్ ప్రతిపాదించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనలతో నవీన్ యాదవ్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, కార్పొరేటర్ సీఎన్ రెడ్డిల పేర్లను పీసీసీ కమిటీ ఇవాళ (అక్టోబర్ 6న) అధిష్టానం (ఏఐసీసీ)కి పంపనుంది. అయితే, నేడో, రేపో.. వీరిలో నుంచి పార్టీ అభ్యర్థిని ఏఐసీసీ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. బీసీలకు రిజర్వేషన్లు 42 శాతానికి పెంచుతూ జీఓ ఇచ్చినందుకు జూబ్లీహిల్స్ టికెట్‌ను కూడా అదే సామాజిక వర్గానికి ఇవ్వాలని అధిష్టానాన్ని టీ- కాంగ్రెస్ నేతలు కోరుతున్నట్లు సమాచారం. దీంతో గ్రేటర్ హైదరాబాద్‌లో బలమైన బీసీ సామాజిక వర్గం నుంచి ముగ్గురు పేర్ల తెరపైకి వచ్చింది. ఇక, వీరిలో నవీన్ యాదవ్ 2014 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోగా, అతడికి ఓటర్లతో మంచి పరిచయాలు ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నవీన్‌కే టికెట్ దక్కే ఛాన్స్ ఎక్కువగా ఉందని జోరుగా హస్తం పార్టీలో ప్రచారం జరుగుతుంది. మరోవైపు, అంజన్ కుమార్ యాదవ్ గతంలో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో.. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా ఈ టికెట్ ఆశిస్తున్నారు. అయితే, రహమత్ నగర్ డివిజన్ నుంచి గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున కార్పొరేటర్‌గా ఎన్నికైన సీఎన్ రెడ్డి తాజాగా కాంగ్రెస్ గూటికి చేరారు. ఆ డివిజన్ జూబ్లీహిల్స్ నియోజక వర్గంలోనే ఉండటంతో తనకు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు. ఈ నలుగురి పేర్లపై సీఎం రేవంత్ రెడ్డితో పలు దఫాలుగా ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ చర్చించి.. ఆర్థిక, సామాజిక బలాబలాలను బేరీజు వేసిన తర్వాతే వీరి పేర్లను ప్రతిపాదించినట్లు తెలుస్తుంది.
జైపూర్ ఆస్పత్రిలో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది రోగులు మృతి
జైపూర్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. సవాయి మాన్ సింగ్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 8 మంది రోగులు మృతిచెందగా.. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మంటలు అంటుకోగానే ఆస్పత్రి సిబ్బంది పారిపోయారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లోని ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సవాయి మాన్ సింగ్ (ఎస్ఎంఎస్) ఆస్పత్రిలో ఆదివారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. పొగ వేగంగా వ్యాపించడంతో రోగులు తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. దీంతో రోగుల కుటుంబాలు భయాందోళనకు గురయ్యారు. ఇక గైడెన్స్ చేయాలని ఆస్పత్రి సిబ్బంది ముందుగానే తప్పించుకుని పారిపోయారు. స్టోరేజ్ ఏరియాలో మంటలు చెలరేగినప్పుడు న్యూరో ఐసీయులో 11 మంది రోగులు చికిత్స పొందుతున్నారని ట్రామా సెంటర్ ఇన్‌చార్జ్ డాక్టర్ అనురాగ్ ధాకడ్ తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగి ఉంటాయని అనుమానిస్తున్నట్లు తెలిపారు. మంటలు అంటుకున్న కొద్దిసేపటికే అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేసినట్లు సమాచారం. 2 గంటల్లో మంటలను అదుపు చేశారు.
ఢిల్లీ మెట్రోలో డబ్ల్యూడబ్ల్యూఈ ఫైటింగ్.. వీడియో వైరల్
ఢిల్లీ మెట్రో రెజ్లింగ్ అరేనాగా మారింది. ఇద్దరు ప్రయాణికులు డబ్ల్యూడబ్ల్యూఈ తరహాలో ఫైటింగ్‌కు దిగారు. కిక్కిరిసి వెళ్తున్న కోచ్‌లో సడన్‌గా ఇద్దరు ప్యాసింజర్స్ కొట్లాటకు దిగారు. ఇద్దరూ కూడా ఒకకినొకరు తన్నుకోవడం.. కొట్టుకోవడం కనిపించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఢిల్లీ మెట్రోలో ప్రయాణం చేస్తుండగా ఇద్దరు వ్యక్తుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అంతలోనే ఒకరికొకరు భౌతికదాడులకు దిగారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను సహచర ప్రయాణికుడు మొబైల్‌లో షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. వీడియోలో ఇద్దరు తన్నుకోవడం కనిపించింది. అనంతరం కొందరు ప్రయాణికులు సర్థిచెప్పి విడదీశారు. అయితే దుర్భాషలాడడంతోనే ఈ గొడవకు కారణమైనట్లుగా తెలుస్తోంది. కోపంతో తన్నినట్లుగా సమాచారం.
నేడు ఈజిప్టు వేదికగా హమాస్-ఇజ్రాయెల్ కీలక చర్చలు.. బందీల విడుదలపై వీడనున్న ఉత్కంఠ
ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేసి మంగళవారంతో రెండేళ్లు పూర్తవుతుంది. అనంతరం గాజాపై ఏకధాటిగా ఇజ్రాయెల్ యుద్ధం చేస్తూనే ఉంది. ఇలాంటి తరుణంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. 20 పాయింట్ల ప్రణాళికను ప్రతిపాదించారు. దీనికి ప్రస్తుతం హమాస్, ఇజ్రాయెల్ అంగీకారం తెలిపాయి. ఈ నేపథ్యంలో ఈజిప్టు వేదికగా సోమవారం కీలక సమావేశం జరగబోతుంది. ఈజిప్టు రాజధాని కైరోలో చర్చలు జరగనున్నాయి. అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, ఖతార్ విదేశాంగమంత్రి షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రహమాన్ థాని సారథ్యంలో చర్చలు జరగనున్నాయి. ఇజ్రాయెల్ పరోక్షంగా పాల్గొనే అవకాశం ఉంది. ఇక ఈ చర్చల్లో కాల్పుల విరమణ, బందీల విడుదలపై చర్చించనున్నారు. చర్చలు ఫలిస్తే.. వెంటనే హమాస్ చెరలో ఉన్న బందీలందరినీ ఒకేసారి విడుదల చేయనున్నారు. అలాగే ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న పాలస్తీనా ఖైదీలను విడుదల చేస్తారు.
అటు అబ్బాయిలు, ఇటు అమ్మాయిలు.. పాపం భారత్ డామినేషన్‌ను తట్టుకోలేకపోతున్న పాకిస్థాన్..
పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్- పాకిస్థాన్ దేశాల మధ్య భీకర యుద్ధం కొనసాగింది. ఆపరేషన్ సింధూర్ తో భారత్ చేసిన దాడులను దాయాది దేశం ఎదుర్కోలేక మన ముందు మోకరిల్లింది. దీంతో అక్కడి నుంచి ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతునే ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన ఆసియా కప్ లో పాక్ తో టీమిండియా మూడు మ్యాచ్ లు ఆడింది.. అందులో మూడింట్లో ఘగ విజయం సాధించి, దాయాది దేశం పరువు తీసింది. తమ ముందు పాక్ నిలిచే అవకాశం లేదని సూర్యకుమార్ యాదవ్ సేన నిరూపించింది. మరోవైపు, మహిళల వన్డే వరల్డ్ కప్ లో సేమ్ సీన్ రిపీట్ అయింది. టీమిండియా వరుస విజయాలతో ప్రపంచకప్‌లో దూసుకుపోతుండగా, పాకిస్థాన్ మాత్రం ఆ ఒత్తిడిని భరించలేక పోతున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. భారత్ ప్రదర్శనపై అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు వెల్లువెత్తుతుండగా, పాక్ జట్టు ఆట తీరు, వ్యూహాలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. క్రీడా ప్రపంచంలో భారత్ ఆధిపత్యం రోజు రోజుకీ పెరుగుతుండటంతో, పాకిస్థాన్ అభిమానులు, ఆ దేశ మాజీ క్రికెటర్లు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారత బౌలర్ల దూకుడు, అద్భుతమైన బ్యాటింగ్, ఫిట్‌నెస్ స్థాయితో పాటు అన్నింట్లో పాకిస్థాన్ జట్టుతో పోల్చలేని స్థితికి టీమిండియా ప్లేయర్స్ ఎదిగారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే, భారత్ అన్ని విభాగాల్లో (అటు పురుషులు, మహిళల జట్లు) వరుస విజయాలతో టాప్ ర్యాంక్‌లో నిలుస్తుండగా, పాకిస్థాన్ మాత్రం దారుణ ఓటములతో వెనక బడిపోతుంది. పాపం, భారత్ డామినేషన్‌ను తట్టుకోలేని స్థితికి పాక్ చేరిందన్న కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారాయి.
తన డైట్‌పై రాశి ఖన్నా క్రేజీ కామెంట్స్..!
తెలుగు సినీ ప్రియులకు రాశి ఖన్నా గురించి పరిచయం అక్కర్లేదు. తెలుగు, తమిళంలో వరుస సినిమాలతో అలరించిన ఈ అమ్మడు.. ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీగా ఉంటుంది. హిందీలో వరుస అవకాశాలు అందుకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది. ఇటీవల సిద్ధార్థ్ మల్హోత్రా సరసన యోధ చిత్రంలో నటించింది. ప్రజంట్ భాషతో సంబంధం లేకుండా వరుస చిత్రాలు లైన్ లో పెట్టిన ఈ బ్యూటీ.. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన డైట్, బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ గురించి ఓపెన్‌గా మాట్లాడింది. ‘చిన్నప్పటి నుంచే నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం. పరాఠా, మఖాన్ లాంటి వాటిని బాగా తినేదాన్ని. అందుకే అప్పట్లో కొంచెం లావుగా ఉండేదాన్ని. సినిమాల్లోకి వచ్చిన తర్వాత స్క్రీన్‌పై అందంగా కనిపించాలంటే ఫిట్‌గా ఉండాల్సిందే అని అర్థమైంది. నాకు నేనే లావుగా కనిపించాను. అందుకే తగ్గాలని నిర్ణయించుకున్నాను. కానీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూనే స్లోగా తగ్గాలని ఫిక్స్ అయ్యాను. జిమ్‌కు రెగ్యులర్‌గా వెళ్లడం మొదలుపెట్టాను. ఇప్పుడు జిమ్ నా జీవితంలో ఓ భాగమైపోయింది. రోజూ వర్కౌట్స్, యోగా చేయడం వల్ల మెంటల్‌గా కూడా ఫిట్‌గా ఫీల్ అవుతున్నాను’ అని చెప్పింది. డైట్ గురించి రాశి చెప్పిన మాటలు కూడా ఇంట్రెస్టింగ్‌గానే ఉన్నాయి.. ‘స్లిమ్‌గా మారే క్రమంలో నేను డైట్ మార్చలేదు. చిన్నప్పటి నుంచి ఏం తినేదాన్ని, అదే తింటున్నాను. కానీ ఒకేసారి ఎక్కువ కాకుండా కొంచెం కొంచెం తినడం అలవాటు చేసుకున్నాను. అందుకే హెల్త్ మైంటైన్ అవుతూ, బరువు కూడా కంట్రోల్‌లో ఉంచగలుగుతున్నాను’ అని రాశి ఖన్నా చెప్పుకొచ్చింది.
యాక్టింగ్ వద్దని.. డైరెక్టర్లుగా మారిన స్టార్ కిడ్స్
స్టార్ హీరోలంతా తమ పిల్లల్ని హీరోలుగానో, హీరోయిన్లుగానో చూడాలనుకుంటున్నారు. కిడ్స్ కూడా పేరెంట్స్ అడుగు జాడల్లో నడుస్తుంటారు. కానీ నెపో కిడ్స్ విమర్శల వేళ తమ టాలెంట్‌తో పైకి రావాలని ట్రై చేస్తున్నారు. యాక్టర్స్ పిల్లలు యాక్టర్లే కావాలా ఏంటీ అంటూ ప్రశ్నిస్తున్నారు షారూఖ్ ఖాన్ తనయడు ఆర్యన్, సూర్య డాటర్ దియా సూర్య, దళపతి విజయ్ సన్ జేసన్ సంజయ్. మొహానికి మేకప్ కాదు మెగా ఫోన్‌పై ఫోకస్ చేస్తున్నారు. వీరిలో ఇప్పటికే కింగ్ ఖాన్ సన్ ఆర్యన్ బ్యాడ్ ఆఫ్ బాలీవుడ్ వెబ్ సిరీస్‌తో ఫ్రూవ్ చేసుకున్నాడు. కొడుకును హీరోగా కాకుండా డైరెక్టురుగా నిలిపేందుకు బాద్ షా పెద్ద తతంగమే నడిపాడు కానీ దర్శకుడిగా ఆర్యన్ ఓకే అనిపించుకున్నాడు. కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ సన్ జేసన్ సంజయ్ తండ్రి నటనా వారసత్వాన్ని కాదని, మెగా ఫోన్ పడుతున్నాడు. కెమెరా ముందు కన్నా వెనుక ఉండేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నాడు. టొరంటో ఫిల్మ్ స్కూల్, సెంట్రల్ ఫిల్మ్స్ స్కూల్లో ట్రైనప్ అయిన జేసన్ లాస్ట్ ఇయర్ సందీప్ కిషన్ హీరోగా ఓ ప్రాజెక్ట్ పట్టాలెక్కించాడు. ఈ సినిమాను లైకా నిర్మిస్తోంది. షారూఖ్, దళపతి తనయులే కాదు. కోలీవుడ్ మరో స్టార్ హీరో సూర్య తనయ చిన్న వయస్సులోనే మెగా ఫోన్ పట్టి లీడింగ్ లైట్ అనే డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ తెరకెక్కించింది. మహిళా లైటింగ్ టెక్నీషియన్స్ కష్టాలను చూపించింది దియా. రీసెంట్‌గా లాస్ ఏంజెల్స్ లోని రెజెన్సీ థియేటర్ లో ఆస్కార్ క్వాలిఫయింగ్ రన్ లో భాగంగా ఈ చిత్రం ప్రదర్శితమైంది. నటన కన్నా దర్శకురాలిగా ఆమెకున్న ఇంటస్ట్ర్ తెలుసుకున్న పేరేంట్స్ సూర్య అండ్ జ్యోతిక ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్ నిర్మించారు. ఇలా స్టార్ హీరోల పిల్లలు.. నటనా వారసత్వాన్ని కాదని.. దర్శకత్వంపై ఫోకస్ చేస్తూ ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు.
సెల్ఫ్ బుకింగులతో సినిమా హిట్ అవదు.. బుక్ మై షో బండారం బయట పెట్టిన కరణ్
సినిమా రిలీజ్ కాగానే ప్రేక్షకులు ఆన్లైన్‌లో టికెట్లు బుక్ చేయడం సాధారణమే. అయితే, బుక్ మై షో లాంటి ప్లాట్‌ఫామ్ ఓపెన్ చేస్తే ముందే కొన్న వరుసల సీట్లు “సోల్డ్ ఔట్” అని కనిపిస్తాయి. కానీ ఆ సీట్లు వాస్తవానికి అమ్ముడుపోకుండా, నిర్మాతలు లేదా హీరోలు ముందుగానే కార్పొరేట్ బుకింగ్స్ పేరుతో బుక్ చేసుకుంటారట. ఈ విధంగా హైప్ క్రియేట్ చేసి, సినిమా చాలా బాగా నడుస్తోందనే ఇమేజ్ క్రియేట్ చేయడానికి ఇది ఒక ట్రిక్. కానీ, ఒక సినిమా బాగుందా? లేదో తేల్చేది ప్రేక్షుల మౌత్ టాక్ మాత్రమే. థియేటర్ నుంచి బయటికి వచ్చినవారు యూట్యూబ్ రివ్యూల్లోనూ, తమ స్నేహితులకు, పొరుగు వారికి నిజాయితీగా చెప్పేస్తారు. కాబట్టి ఇలాంటి సెల్ఫ్ బుకింగ్స్‌తో ప్రజలను మోసం చేయడం వృథా ప్రయత్నం. అయితే ఇదే విషయం పై బాలీవుడ్ అగ్ర దర్శక–నిర్మాత కరణ్ జోహార్ కూడా బహిరంగంగా స్పందించారు.. “కార్పొరేట్ బుకింగ్స్, సెల్ఫ్ బుకింగ్స్ అనేవి ఇండస్ట్రీలో ఉన్న చెత్త పద్ధతులు. వీటితో సినిమా హిట్ కాదని, తాత్కాలికంగా టికెట్ సేల్స్ పెరిగిన, ఇవి సినిమాకు నష్టంలో పడేస్తాయి” అని ఆయన హెచ్చరించారు.