ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు మరోసారి షాకిచ్చింది ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం.. ఏపీ మద్యం కుంభకోణం కేసులో 12 మంది నిందితుల రిమాండ్ పొడిగించింది ఏసీబీ కోర్టు.. ఈ కేసులో 12 మంది నిందితుల రిమాండ్‌ను సెప్టెంబర్ 3వ తేదీ వరకు పొడిగించింది న్యాయస్థానం .. రిమాండ్ పొడిగించిన నేపథ్యంలో నిందితులను జైలుకు తరలిస్తున్నారు అధికారులు.
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అన్ని రాష్ట్రాల్లో ఇండియా కూటమి అభ్యర్థికి, ఎన్డీఏ అభ్యర్థికి ఓట్లు పడతాయి... కానీ, ఒక్క ఏపీలోనే ఎన్డీఏ అభ్యర్థికి వన్ సైడ్ ఓట్లు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రామకృష్ణ.. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అంటూ కొత్త నిర్వచనం చెప్పి ఆయన.. ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్ రెడ్డిని కించపరిచే విధంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యలు చేస్తున్నారు..
కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. మద్దికేర మండలం ఎం అగ్రహారంలో భర్తను దారుణంగా హత్య చేసింది ఓ మహిళ. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వెంకటేష్ అనే వ్యక్తిని భార్య సరస్వతి మూడు రోజుల క్రితం హత్య చేసింది.. ఆ తర్వాత ఇంట్లోనే మృతదేహాన్ని ఉంచింది.. అక్కడి నుంచి పరారైంది..
విశాఖ సెంట్రల్ జైల్లో జీవిత ఖైదీగా ఉన్న శ్రీకాంత్ కు మెమో జారీ చేశారు నెల్లూరు జైలు సూపరిండెంటెంట్ ... పెరోల్ రద్దుచేసి ఈ నెల 23వ తేదీన విశాఖ సెంట్రల్ జైలుకు శ్రీకాంత్ ను తరలించారు అధికారులు..
ఐఏఎస్ అధికారి లక్ష్మీపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి.. టీడీఆర్ బాండ్లు విషయంలో ఏ విచారణకైనా నేను సిద్ధం అంటూ సవాల్ విసిరారు.. నాపై వచ్చే విమర్శలకు నేను ఎప్పుడూ స్పందించను.. కానీ, రెండు సంవత్సరాలు నా మనసులో ఉన్న అభిప్రాయం ఇది అన్నారు.
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తరాంధ్రలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో 24 గంటల్లో వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. వీటి ప్రభావం వల్ల మరో మూడు రోజుల పాటు పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం ప్రకటించింది.
చిత్తూరు జిల్లా పలమనేరులో దారుణం చోటు చేసుకుంది.. 18 నెలల బాలుడిపై పైశాచికత్వంగా కొట్టడమే కాకుండా మర్మంగాలపైన.. శరీర భాగాల పైన విచక్షణ రహితంగా కొరికి గాయాలు చేశాడు మరో మైనర్ బాలుడు... రోజువారి పనులు కోసం వెళ్తున్న సమయంలో పక్క ఇంట్లో 13 ఏళ్ల బాలుడిని నమ్మి వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది..
కుబేర సినిమా చూశారుగా .. సేమ్ అచ్చం అలానే స్క్రిప్ట్‌తో కోట్ల రూపాయలు కొట్టేశారు కొందరు నిందితులు. ఫేక్ సాఫ్ట్ వేర్ కంపెనీలు పెట్టి, అందులో అమాయకులను ఉద్యోగులుగాచూపించి, వారి పేరు మీద లక్షలు లోన్ తీసుకున్నారు. ఇప్పుడు వాటికి ఈఎంఐలు చెల్లించాలంటూ .. బాధితులకు నోటీసులు వస్తున్నాయి. అంతేనా.. ఏజెంట్ల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి.