సెంచూరియన్ టెస్టులో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టిన సంగతి తెలిసిందే.. సౌతాఫ్రికాపై 113 పరుగుల తేడాతో విజయం సాధించింది భారత్.. మూడు టెస్ట్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని సాధించింది.. అయితే, ఆ ఓటమి తర్వాత సంచలన నిర్ణయం తీసుకున్నాడు దక్షిణాఫ్రికా స్టార్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ క్వింటన్ డికాక్… టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెబుతున్నట్టు ప్రకటించాడు.. ఇక, ఆయన రిటైర్మెంట్ విషయాన్ని క్రికెట్ సౌత్ ఆఫ్రికా కూడా ధృవీకరించింది. భారత్-సౌతాఫ్రికా మధ్య జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 34 పరుగులు, సెకండ్ ఇన్నింగ్స్‌లో 21 పరుగులు చేశాడు డికాక్.. కానీ, ఈ టెస్ట్‌లో సౌతాఫ్రికా ఓటమిపాలైన తర్వాత అనూహ్యంగా తన టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ ఆశ్చ్యపరిచాడు.
Read Also: విశాఖలో న్యూఇయర్ ఆంక్షలు ఇలా..
ఇక, తన కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడిపేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పుకొచ్చాడు డికాక్… ఎంతో ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చినట్టు పేర్కొన్నారు.. “ఇది అంత తేలిగ్గా తీసుకున్న నిర్ణయం కాదు.. సాషా, నేను మా మొదటి బిడ్డను ఈ ప్రపంచంలోకి స్వాగతించబోతున్నాం.. నా జీవితంలో దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి అనే దాని గురించి ఎంతో ఆలోచించా.. నా కుటుంబమే నాకు సర్వస్వం.. మా కుటుంబంతో ఎక్కువ సమయం గడిపేందుకు ఈ నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశాడు..