కరోనా సమయంలో ఆయుర్వేద మెడిసిన్‌తో వార్తల్లో నిలిచిన నెల్లూరు జిల్లాకు చెందిన ఆనందయ్య.. ఒమిక్రాన్ టెన్షన్ పెడుతోన్న సమయంలో.. తాను ఒమిక్రాన్‌ను కూడా మందు తయారు చేశానని ప్రకటించారు.. దీంతో.. ఆయన నివాసం ఉండే కృష్ణపట్నానికి పక్క రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు తరలివచ్చారు.. అయితే, అక్కడే ఆనందయ్యకు ఊహించని షాక్ తగిలింది… ఓవైపు ఆనందయ్య మందు పంపిణీకి అనుమతి ఇవ్వొద్దంటూ కృష్ణపట్నం పంచాయతీ ఏకగ్రీవ తీర్మానం చేయగా… అసలు, నీ మందుకు ఉన్న అనుమతి ఏంటి? పంపిణీకి ఎవరు అనుమతులు ఇచ్చారో చెప్పాలంటూ నోటీసులు జారీ చేశారు నెల్లూరు జిల్లా అధికారులు.. అయితే, ఈ వ్యవహారంపై హైకోర్టు మెట్లు ఎక్కారు ఆనందయ్య..
Read Also: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. కొత్త సంవత్సరం రోజు సిఫార్సు లేఖలు రద్దు
తనను కరోనా మందు పంపిణీ చేయనీయకుండా పోలీసులు అడ్డుకుంటున్నారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.. ఇక, ఆనందయ్య పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం… ఇవాళ విచారణ చేపట్టనుంది. గతంలోనూ హైకోర్టును ఆశ్రయించి కరోనా మందు పంపిణీకి అనుమతి పొందిన ఆనందయ్య.. ఇప్పుడు విజయం సాధిస్తారా? లేక హైకోర్టు ఎలా స్పందిస్తుంది? అనేది ఉత్కంఠగా మారిపోయింది.