మా ఎన్నికలు సినీ పరిశ్రమలో కాకరేపుతున్నాయి.. ప్రకాష్‌రాజ్, మంచు విష్ణు ప్యానళ్ల మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది.. అయితే, తాజాగా మా ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు మెగా బ్రదర్ నాగబాబు.. దేశ ప్రధానితో పోరాటం తెలిసిన వ్యక్తి ప్రకాశ్ రాజ్ అని.. ప్రకాశ్ రాజ్ కు ఉన్న ప్రత్యేకతలు విష్ణులో లేవన్నారు.. ప్రకాశ్ రాజ్ తో పోల్చాలంటే మోహన్ బాబును పోల్చాలని సూచించిన ఆయన.. విద్యార్థులకు ఏం కావాలో విద్యాసంస్థ నడుపుతున్న మోహన్ బాబుకు తెలుసు, […]
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన.. లఖింపూర్ ఘటనలో కీలక నిందితుడిగా ఉన్న కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు… ఆశిష్ మిశ్రా ఆచూకీ ఇంకా తెలియలేదు. అతను ఎక్కడున్నాడనే దానిపై స్పష్టత కొరవడింది. క్రైమ్ బ్రాంచ్ కార్యాలయానికి హాజరు కావాలంటూ జారీ చేసిన నోటీసులకూ ఆశిష్ స్పందించలేదు. ఇవాళ ఉదయం పదింటికి.. క్రైం బ్రాంచ్‌లో విచారణకు హాజరుకావాల్సి ఉన్నప్పటికీ.. అతను రాకపోవడంతో ఎక్కడున్నాడనే ఉత్కంఠ నెలకొంది. ఆశిష్ మిత్రా ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడనే విషయం.. ఎవరికీ తెలియడం లేదు. పోలీసులు […]
తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా పడింది. అసెంబ్లీ సమావేశాలు ఏడు రోజుల పాటు జరిగాయి. మొత్తం అరు బిల్లులకు సభ ఆమోదం తెలపగా… ఆరు అంశాలపై స్వల్పకాలిక చర్చ జరిగింది. మొత్తం 32 గంటల 5 నిమిషాలు సభ జరిగింది. ఆఖరి రోజు సభలో సంక్షేమ పధకాలపై స్వల్ప కాలిక చర్చ జరిగింది. కేజీ టు పీజీ ఉచిత విద్య ఇవ్వాలని కోరారు భట్టి. ఇండ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లు, డబుల్ బెడ్రూమ్ అర్హులకు అందడం లేదని […]
హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురుస్తోంది… దాదాపు రెండు గంటలకు పైగా వర్షం దంచికొడుతోంది… బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, మలక్‌పేట్, నాగోల్, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్, పెద్ద అంబర్పేట్, అబ్దుల్లాపూర్‌మెట్, దిల్సుఖ్నగర్, సరూర్‌నగర్, బడంగ్పేట్, మెహిదీపట్నం, అత్తాపూర్, రాజేంద్రనగర్, కిస్మత్పూర్, శంషాబాద్ సహా తదితర ప్రాంతాల్లో జోరు వాన కురుస్తోంది.. దీంతో.. పలుచోట్ల చెరువులను తలపిస్తున్నాయి రోడ్లు, లోతట్టు ప్రాంతాలకు వర్షం చేరడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.. దీంతో.. అప్రమత్తమైన […]
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని శాశ్వతంగా సమాధి చేస్తే తప్ప రాష్ట్రానికి భవిష్యత్ ఉండదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు… ఇవాళ చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు కనిగిరికి చెందిన పలువురు వైసీపీ కార్యకర్తలు… ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… నదుల అనుసంధానం చేసి ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాలకు నీళ్లు ఇవ్వాలనుకున్నామని.. కానీ, పక్క రాష్ట్రంతో గొడవపడి హక్కులన్ని కేంద్రానికి అప్పజెప్పారని విమర్శించారు. కాల్వలు తవ్వాలన్నా కేంద్రం అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి […]
విద్యుత్ సంక్షోభం ఇప్పుడు భారత్‌ను టెన్షన్ పెడుతోంది… ఈ తరునంలో ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. విద్యుత్ సంక్షోభంపై వెంటనే జోక్యం చేసుకోవాలి లేఖలో విజ్ఞప్తి చేశారు.. యూరోప్, చైనాల్లో ఉన్న విద్యుత్ సంక్షోభం ఇప్పుడు భారత దేశాన్నీ తాకిందని లేఖలో పేర్కొన్న సీఎం.. కోవిడ్ అనంతరం రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ గత ఆరు నెలల్లో 15 శాతం, గత నెల నుండి 20 శాతం పెరిగిందని.. బొగ్గు […]
తాలిబన్ల వశమైన ఆప్ఘనిస్థానలో ఓ వైపు అరాచక పాలన కొనసాగుతుంటూ.. మరోవైపు.. దాడులు, ఆత్మహుతి దాడులు అక్కడి ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.. ఇవాళ మరోసారి ఆఫ్ఘనిస్థాన్ రక్తసిక్తమైంది.. కుందుజ్‌లో మసీదుపై ఆత్మహుతి దాడి కలకలం రేపింది.. ఈ ఘటనలో మొత్తంగా 100 మంది మృతిచెందారు.. చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆత్మాహుతి దాడి జరిగిన సమయంలో.. మసీదులో వందలాది మంది ముస్లింలు ప్రార్థనలు చేస్తున్నారు. నివేదికల ప్రకారం ఆత్మాహుతి దాడి ఘటనలో 100 మంది […]
హెటిరో డ్రగ్స్ సంస్థల్లో జరుగుతున్న ఐటీ సోదాల్లో వందల కోట్ల నగదు బయట పడడంతో అధికారులే నోరు వెల్లబెడుతున్నారు.. ఐటీ దాడులులో అక్రమాలు వెలుగు చూడడంతో పాట గుట్టల కొద్ద డబ్బులు దర్శనమిస్తున్నాయి.. మూడు రోజులుగా హెటిరో డ్రగ్స్‌లో ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతుండగా.. రెండో రోజే రూ.100 కోట్లకు పైగా నగదు సీజ్ చేశారనే వార్తలు వచ్చాయి.. కానీ, ఇవాళ ఆ మొత్తం ఏకంగా రూ.200 కోట్లకు చేరినట్టుగా తెలుస్తోంది.. మూడ్రోజులుగా హెటిరో డ్రగ్స్‌లో ఐటీ […]
చైనా పెద్ద సంక్షోభంలో పడిపోయింది… తీవ్రమైన కరెంట్ కోతలతో అల్లాడిపోతోంది.. అయితే, ఇప్పుడు భారత్‌కు కూడా విద్యుత్ ఉత్పత్తి, కరెంట్ కోతల ముప్పు పొంచిఉందనే హెచ్చరికలు కలవరపెడుతున్నాయి.. బొగ్గు నిల్వలు నిండుకోవడంతో ఈ పరిస్థితి దాపురిస్తోందని భయాలు వెంటాడుతున్నాయి.. మరి, తెలంగాణలో పరిస్థితి ఏంటి..? అనే చర్చ మొదలైంది. దీనిపై విద్యుత్ శాఖ అధికారులు క్లారిటీ ఇచ్చారు.. దేశంలోనే సేఫ్ విద్యుత్ ఉత్పత్తి, సరఫరా చేస్తున్న రాష్ట్రం తెలంగాణగా వెల్లడించారు. సీఎం కేసీఆర్, సీఎండీ ప్రభాకర్ రావు […]
రూ.18 వేల కోట్ల ఓపెన్ బిడ్‌తో ఎయిరిండియాను సొంతం చేసుకుంది టాటా సన్స్.. దీంతో 68 ఏళ్ల తర్వాత తిరిగి ఎయిరిండియా.. టాటాల చేతిలోకి వెళ్లినట్టు అయ్యింది.. డిసెంబర్ నుంచి టాటాల చేతిలోకి వెళ్లిపోనుంది ఎయిరిండియా.. అయితే, టాటాల చేతికి సంస్థ వెళ్లిపోతుండడంతో.. అసలు ఎయిరిండియాలో పనిచేస్తున్న ఉద్యోగుల పరిస్థితి ఏంటి? అనే ఆందోళన ఉద్యోగుల్లో మొదలైంది.. దీనిపై క్లారిటీ కూడా ఇచ్చారు.. ఏఐలో పని చేస్తున్న ఉద్యోగులను ఏడాది పాటు అలాగే కొనసాగించనుంది టాటా గ్రూప్.. […]