భారత్‌లో కరోనా మరోసారి పడగవిప్పుతోంది.. గత ఐదారు రోజులుగా యమ స్పీడ్‌గా పెరిగిపోతున్నాయి పాజిటివ్ కేసులు.. నిన్నటితో పోలిస్తే.. ఇవాళ ఏకంగా 18 వేలకు పైగా కేసులు పెరిగాయి.. అయితే, సౌతాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వెలుగు చూసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతూ పోతున్నాయి.. భారత్‌లోనూ ఒమిక్రాన్ ఎంట్రీ తర్వాతే రోజువారి కేసులు మరోసారి కోవిడ్ మీటర్ పరుగులు పెడుతోంది.. ఇక, భారత్‌లో థర్డ్ వేవ్ ప్రారంభమైందని.. ఇప్పటికే 15కు పైగా రాష్ట్రాల్లో బుసలు కొడుతుందనే ప్రభుత్వ వర్గాలే చెబుతున్నాయి.. ఈ తరుణంలో కరోనా థర్డ్ వేవ్‌కు ఒమిక్రాన్‌కు ఏదైనా సంబంధం ఉందా అనే చర్చ కూడా సాగుతోంది.. అసలు ఒమిక్రాన్ వల్లే థర్డ్ వేవ్ మొదలైందా? అనే అనుమానాలు కూడా ఉన్నాయి.
Read Also: భారత్‌పై కరోనా పంజా.. ఒకే రోజు 1.59 లక్షలకు పైగా కేసులు
ఇక, కొత్త వేరియంట్ వస్తేనే థర్డ్ వేవ్‌కు అవకాశం ఉంటుందన్న అంచనాలను నిజం చేస్తూ, ఒమిక్రాన్ పాజిటివ్‌లు భారీగా నమోదవుతున్నట్లు స్పష్టమవుతోంది.. ఇప్పటికే దేశంలో ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య 3.6 వేలకు దాటేసింది.. ఈ వేరియంట్‌తో దేశంలో థర్డ్‌వేవ్ నడుస్తోందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.. కొద్ది రోజుల క్రితం వరకు ఒమిక్రాన్ ప్రభావం దేశంలోని పశ్చిమ రాష్ట్రాల్లోనే ఉందని, ప్రస్తుతం అన్ని రాష్ట్రాలకూ వ్యాపించిందని చెప్పాయి. అందుకనే పాజిటివ్‌లు అధికంగా వస్తున్నాయని వివరించాయి. మరోవైపు ఇటీవలి వరకు ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, ఒడిసాలలో డెల్టా వ్యాప్తి కొనసాగిందని.. ఇప్పుడు ఆ స్థానాన్ని ఒమిక్రాన్ ఆక్రమించిందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్న మాట.. దేశంలో కొత్త కేసులు 1,59,632 నమోదయ్యాయి.. మరో 327 మంది బాధితులు కన్నుమూశారు.. కోవిడ్ పాజివిటీ రేటు 10.21 శాతానికి పెరిగింది.. ఇప్పటికే పలు రాష్ట్రాలు ఆంక్షల బాటపట్టాయి.. లాక్‌డౌన్ తరహా ఆంక్షల అమలు చేస్తున్నాయి.. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటిస్తున్నాయి.. కొన్ని చోట్ల నైట్ కర్ఫ్యూలు అమలు అవుతుంటే.. మరికొన్ని చోట్ల వీకెండ్ లాక్‌డౌన్ పెడుతున్నారు.. ఇక, దేశంలో కరోనా థర్డ్ వేవ్ ఫిబ్రవరి 1–15 మధ్య తారాస్థాయికి చేరుకుంటుందని అంచనా వేసింది ఐఐటీ మద్రాస్ తాజా అధ్యయనం..