తెలుగు అకాడమి స్కాంలో పోలీసుల రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు వెలుగుచూశాయి. తెలుగు అకాడమీ డిపాజిట్ల కేసులో 10 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు, వారి రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు పొందుపర్చారు. 9 పేజీల రిమాండ్ రిపోర్ట్ లో ఇప్పటికే 10మందిని అరెస్ట్ చేశామని వీరిలో కీలక సూత్రదారి సాయికుమార్ గా తేల్చారు. ఈ కేసులో 10 మంది నిందితులు వివరాలు ఇలా ఉన్నాయి. A1. మస్తాన్ వలి (యూనియన్ బ్యాంక్ మేనేజర్), A2. […]
కరోనా మహమ్మారి కేసులు ఇంకా పెద్ద సంఖ్యలోనే వెలుగు చూస్తున్నాయి.. ఫస్ట్ వేవ్ కంటే.. సెకండ్ వేవ్‌లో పెద్ద సంఖ్యలో కేసులు నమోదు అవ్వడమే కాదు.. మృతుల సంఖ్య కూడా పెరిగిపోయింది.. అయితే, దీనికి కారణం.. ఫస్ట్ వేవ్ కేసులు కాస్త తగ్గుముఖం పట్టిన తర్వాత.. ప్రజలు లైట్‌గా తీసుకోవడమే కారణం అని పలు సందర్భాల్లో నిపుణులు చెబుతూనే ఉన్నారు. ఇప్పుడు సెకండ్ వేవ్ కేసులు తగ్గుతూ వస్తున్నా.. ఇంకా భారీగానే కేసులు నమోదు అవుతున్నాయి.. ఈ […]
హెటిరో డ్రగ్స్ ఐటీ సోదాల్లో భారీగా నగదు బయటపడింది.. ఇవాళ హెటిరో డ్రగ్స్ సీఈవో, డైరెక్టర్ ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.. తొలిరోజు సోదాలు ముగిసిన తర్వాత సీఈవో, డైరెక్టర్ ఇళ్లతో పాటు కార్పొరేట్ ఆఫీస్‌లో భారీగా నగదు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.. దాదాపు రూ. 100 కోట్లకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుండగా.. ఎంత నగదు అనేదానిపై ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు.. అయితే, సోదాలు పూర్తిస్థాయిలో ముగిసిన తర్వాత నగదు ఎంత […]
తెలంగాణలో డిగ్రీ కాలేజీల్లో భారీగా మిగిలిపోయాయి సీట్లు.. మూడు విడతల కౌన్సిలింగ్ ముగియగా ఇప్పటి వరకు రెండు లక్షలకు పైగా సీట్లు ఖాళీగా ఉండిపోయాయి. దోస్త్ పరిధిలో 947 కాలేజీల్లో 4,16,575 సీట్లు ఉండగా… ఇప్పటి వరకు కాలేజీల్లో సీట్లను 1,96,691 మంది విద్యార్థులు కంఫర్మ్ చేసుకున్నారు.. దీంతో, సుమారు రెండు లక్షల 20 వేల సీట్లు ఖాళీగా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు అధికారులు.. ఇంటర్లో అందరిని పాస్ చేసిన నేపథ్యంలో డిగ్రీలో చేరే వారి […]
హుజురాబాద్‌లో పొలిటికల్ హీట్ ఓవైపు కొనసాగుతుండగా.. మరోవైపు ఫిర్యాదుల పర్వం కూడా కొనసాగుతోంది.. ఇప్పటికే ఈ వ్యవహారంపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయగా.. ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి బీజేపీ ఫిర్యాదు చేసింది… కరీంనగర్ జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారులను బదిలీ చేయాలని.. ఎన్నికలు పారదర్శకంగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలి కోరింది.. రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఇంటెలిజెన్స్ వాళ్లు ఉంటున్నారు, […]
హుజురాబాద్‌లో ఉప ఎన్నికల వాతావరణం హీటెక్కిస్తోంది… ఇప్పటికే అధికార పార్టీకి చెందిన అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ నామినేషన్ దాఖలు చేయగా… మరో రెండు ప్రధాన పార్టీలు కూడా రంగంలోకి దిగాయి… బీజేపీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఈటల రాజేందర్, కాంగ్రెస్ అభ్యర్థిగా బలమూరి వెంకట్ రేపే నామినేషన్ దాఖలు చేయనున్నారు.. రేపు ఈటల రాజేందర్ నామినేషన్ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు పలువురు నేతలు, […]
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా రోజువారి కేసుల సంఖ్చ మరోసారి భారీగా తగ్గింది… ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 48,028 శాంపిల్స్ పరీక్షించగా.. 643 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మరో 8 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు. ప్రకాశం జిల్లాలో ముగ్గురు, కృష్ణా జిల్లాలో ఇద్దరు, గుంటూరు, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు మరణించారు. ఇక, ఇదే సమయంలో 839 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో […]
లఖింపూర్ ఖేరి ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది… ఈ వ్యహారంపై సుప్రీంకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది… ఈ ఘటనకు సంబంధించి ఇప్పటిదాకా ఎంత మందిని అరెస్ట్ చేశారో చెప్పాలంటూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు సీజేఐ ఎన్వీ రమణ.. అయితే, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నల నేపథ్యంలో యూపీ ప్రభుత్వంలో కదలిక మొదలైంది.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాను విచారణకు రావాల్సిందిగా ఆదేశించారు పోలీసులు.. కాగా, గత సోమవారం ఆశిష్ […]
టీటీడీ పాలకమండలి ఇవాళ జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది.. జమ్మూలో శ్రీ వేంకటేశ్వర ఆలయ నిర్మాణానికి రూ.17.40 కోట్లతో టెండర్లకు ఆమోదముద్ర వేసింది. చెన్నై, బెంగళూరు, ముంబైలో టీటీడీ సమాచార కేంద్రాలు మరియు శ్రీవారి ఆలయాల స్థానిక సలహా మండళ్లకు ఛైర్మన్ల నియామకానికి ఆమోదం లభించగా.. చెన్నై కేంద్రానికి ఏజే శేఖర్ రెడ్డి, బెంగళూరు కేంద్రానికి రమేష్ శెట్టి, ముంబై కేంద్రానికి అమోల్ కాలేను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక, అలిపిరి కాలిబాట సుందరీకరణ […]
టీఆర్ఎస్ సర్కార్‌లో పరిణామాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు హుజురాబాద్ ఉప ఎన్నికల బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేదర్.. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ.. దళిత జాతి ఆత్మగౌరవం కోసం నా చిన్న నాడే కొట్లాడి మా కుల బహిష్కరణకు గురైన వాళ్లం.. అలాంటి కుటుంబం మాది అని గుర్తు చేసుకున్నారు.. ఇక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా మీ హృదయాల్లో చోటు సంపాదించుకున్న వాడిని.. కేసీఆర్‌తో ఆరేళ్లుగా అనుభవిస్తున్న బాధ […]