సీఎం ఇంట్లో కరోనా కలకలం.. ఆయన సతీమణి సహా 15 మంది పాజిటివ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా మహమ్మారి ఎవ్వరినీ వదలడం లేదు… సామాన్యుల నుంచి ప్రముఖులు, వీఐపీలు, వీవీఐపీలు.. ఇలా ఎవ్వరికీ మినహాయింపు లేదు అనే విధంగా పంజా విసురుతూనే ఉంది.. ఇప్పటికే భారత్‌లో థర్డ్ వేవ్ ప్రారంభం అయిపోయింది.. ఈ సారి సినీ, రాజకీయ ప్రముఖులు ఎంతో మంది కోవిడ్ బారిన పడ్డారు.. తాజాగా, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఇంట్లో కరోనా కలకలం సృష్టించింది.. సీఎం హేమంత్ సోరెన్సతీమణి కల్పనా సోరెన్, ఆయన కుమారులు నితిన్, విశ్వజిత్ సహా మొత్తం 15 మంది కోవిడ్ బారినపడ్డారు.. వీరిలో సోరెన్ మరదలు సరళ మర్ముకూ కూడా ఉన్నారు.. అయితే, సీఎంకు నిర్వహించిన పరీక్షల్లో మాత్రం నెగెటివ్‌గా తేలింది.
Read Also: ప్రధాని కోసం మృత్యుంజయ హోమాలు.. బీజేపీ పిలుపు
Also Read
- IT Raids: హైదరాబాద్ టు హాంగ్‌కాంగ్.. ఐటీ దాడుల్లో రూ.1000 కోట్ల హవా లావాదేవీల గుట్టురట్టు..
- Heavy Rain Alert: ఆగస్టు 24 వరకు భారీ వర్షాలు.. హిమాలయాల నుంచి మధ్య భారతం వరకు హై అలర్ట్!
- India-Pakistan Tensions: పాక్ హైకమిషన్ వద్ద భద్రతా బారికేడ్లు తొలగించిన భారత్.. J&K వ్యాఖ్యల వేళ కీలక పరిణామం
- E10 Petrol: పాత బండ్లకు ఊరట.. బంకుల్లో మళ్లీ E10 పెట్రోల్..?
అయితే, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఇంట్లో కొంతమంది కోవిడ్ లక్షణాలతో బాధపడుతుండడంతో టెస్ట్‌లు నిర్వహించారు… మొత్తం 62 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్టు రాంచీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ వినోద్ కుమార్ తెలిపారు. అందులో సీఎం సతీమణి, ఇద్దరు పిల్లలు సహా ఏకంగా 15 మందికి పాజిటివ్‌గా తేలవడం కలకలం సృష్టించింది.. అయితే, వీరంతా ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లోనే ఉండి చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది.. కాగా, జార్ఖండ్‌లో కొత్తగా 5,081 కోవిడ్ పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి.. మరో ముగ్గురు బాధితులు మృతిచెందారు.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,74,000కు చేరుకోగా.. ఇప్పటి వరకు 5,164 మంది మృతిచెందారు.. 347,866 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు..
తాజావార్తలు
-
Varanasi Music Album: వారణాసి ఆల్బమ్ అదిరిపోద్ది.. మొత్తం ఎన్ని పాటలంటే?
-
Smart Phones: కేవలం రూ.17,999 లకే వాటర్ ప్రూఫ్ మొబైల్.. IP64, IP65 రేటింగ్.. 7000mAh బ్యాటరీ..
-
RC17లో రామ్ చరణ్‌కు జోడీగా ధురంధర్ బ్యూటీ.. లెక్కల మాస్టర్ స్కెచ్ ఇదేనా?
-
Spirit Release Date: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. ‘స్పిరిట్’ రిలీజ్ డేట్లో నో ఛేంజ్!
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
ట్రెండింగ్
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!