టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ కుమారుడు, సినీ నటుడు, నిర్మాత రమేష్ బాబు అంత్యక్రియలు ఈ రోజు మధ్యాహ్నం నిర్వహించనున్నారు.. ఇప్పటికే పద్మాలయ స్టూడియోకు రమేష్ బాబు భౌతికకాయాన్ని తరలించారు.. ఇక, కుటుంబసభ్యులు, బంధువులు, అభిమానులు పద్మాలయ స్టూడియోకు చేరుకుంటున్నారు.. రమేష్ బాబు తల్లి ఇందిరాదేవి.. పద్మాలయకు చేరుకున్నారు.. రమేష్ బాబు భౌతికకాయానికి సీనియర్ నటుడు మురళీమోహన్ సహా పలువురు సినీ ప్రములు నివాళులర్పించారు..
Read Also: ‘హీరో’ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు..
ఉదయం 11 గంటల వరకు రమేష్ బాబు పార్థివ దేహాన్ని పద్మాలయా స్టూడియోస్ ఉంచనున్న కుటుంబ సభ్యులు.. ఆ తర్వాత అంతిమ యాత్ర ప్రారంభిస్తారు.. మధ్యాహ్నం 12 గంటల నుంచి మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.. మరోవైపు, ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు.. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, మా శ్రేయోభిలాషులందరినీ కోవిడ్ నిబంధనలకు కట్టుబడి, దహన సంస్కారాల స్థలంలో గుమికూడకుండా ఉండాలని విజ్ఞప్తి చేసింది ఘట్టమనేని కుటుంబం. ఘట్టమనేని రమేష్‌బాబు భౌతికంగా దూరమైన.. ఆయన ఎప్పటికీ మన హృదయాల్లో నిలిచిపోతారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.