ఆంధ్రప్రదేశ్‌లోని బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగుతోన్న ఉప ఎన్నిక కాక రేపుతోంది.. బీజేపీ మండల అధ్యక్షుడు ఇప్పుడు వైసీపీలో చేరడం హీట్ పెంచుతోంది… ఈ విషయాన్ని ఏకంగా కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికే తీసుకెళ్లింది భారతీయ జనతా పార్టీ.. అధికార వైసీపీపై కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు బీజేపీ నేతలు జీవీఎల్, సునీల్ దేవధర్. బద్వేల్ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగం, హింస, బెదిరింపులు, ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు పాల్పడుతోంది […]
పర్యాటక రంగం అభివృద్ధిపై ఫోకస్ పెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం… ఇవాళ సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన క్యాంప్ కార్యాలయంలో స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎస్ఐపీబీ) సమావేశం జరిగింది.. రాష్ట్రంలో భారీ టూరిజం ప్రాజెక్టుల పై బోర్డులో చర్చించారు.. ఏపీలో పర్యాటక రంగానికి ఊతం ఇచ్చే దిశగా రానున్న పలు కీలక ప్రాజెక్టులపై చర్చ జరగగా.. ఒక్కో ప్రాజెక్టు పై కనీసం రూ.250 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నారు.. వివిధ ప్రాజెక్టులపై మొత్తంగా రూ.2868.6 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి […]
తెలంగాణ గడ్డపై మరో కొత్త పార్టీ పురుడు పోసుకోనుంది.. దీనికి సంబంధించిన ఏర్పాట్లలో మునిగిపోయారు మాజీ కేంద్ర మంత్రి శివశంకర్ తనయుడు డాక్టర్ వినయ్ కుమార్… రాష్ట్రంలో కొత్త పార్టీ పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్న ఆయన.. అందులో భాగంగా ఇవాళ హైదరాబాద్‌లో తన మద్దతు దారులతో సమావేశం అయ్యారు. సాధించుకున్న తెలంగాణలో అందరికీ న్యాయం జరగాలనే ప్రధాన డిమాండ్‌తో కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు వినయ్.. ఈ ఏడా డిసెంబర్లో కొత్త పార్టీ పేరును , […]
బద్వేల్ ఉప ఎన్నికలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు.. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. అన్ని అక్రమాలకు పాల్పడుతున్న అధికార పార్టీ, మంత్రి పెద్దిరెడ్డి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.. అధికార పార్టీ యథేచ్చగా బెదరింపులకు పాల్పడుతుందని విమర్శించిన బీజేపీ ఎంపీ.. రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డితో సహా బెదరింపులకు దిగుతున్నారని.. బీజేపీ మండల […]
సంచలనం సృష్టించిన పెగాసెస్ కుంభ కోణం విషయంలో రేపు తీర్పు వెలువరించనుంది సర్వోన్నత న్యాయస్థానం.. పెగాసెస్ స్పైవేర్‌ను నిబంధనలకు వ్యతిరేకంగా ఉపయోగించి ప్రజలపై కేంద్ర ప్రభుత్వం నిఘా ఉంచిందా..? లేదా..? తెలుసుకోవాలనుకుంటున్నామని వ్యాఖ్యానించిన సుప్రీంకోర్టు.. సెప్టెంబర్ 13న తీర్పు రిజర్వు చేసిన సంగతి తెలిసిందే.. ఈ కుంభకోణంపై నిపుణుల కమిటీతో సంప్రదించాల్సి ఉందని వ్యాఖ్యానించింది ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ట్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమకోహ్లిలతో కూడిన ధర్మాసనం. సంప్రదించిన కొంతమంది నిపుణులు వ్యక్తిగత కారణాలతో […]
పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు సమయం అసన్నమైంది… సమావేశాల షెడ్యూల్‌ను ఖరారు చేసింది కేంద్ర ప్రభుత్వం.. ఈ నెల 29వ తేదీ నుంచి డిసెంబర్ 23వ తేదీ వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నిర్వహించనున్నట్టు ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.. ఇక, ఈ సెషన్లో ప్రభుత్వం ఆర్థిక రంగానికి చెందిన రెండు కీలక బిల్లులను ప్రవేశపెట్టబోతోంది.. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ చట్టం-2013 సవరణ బిల్లు, అదేవిధంగా బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం-1949 సవరణ బిల్లు ఈ […]
హుజురాబాద్ ఉప ఎన్నికల సమయంలో ఫిర్యాదుల పర్వం కొనసాగుతూనే ఉంది.. అధికార పక్షం టీఆర్ఎస్పై ఓవైపు బీజేపీ ఫిర్యాదులు అందిస్తుంటే.. మరోవైపు.. బీజేపీ గీత దాటుతోంది ఇవిగో ఆధారాలంటూ టీఆర్ఎస్ పార్టీ నేతలు ఫిర్యాదులు చేస్తూ వస్తున్నారు. ఇక, ఇవాళ బీజేపీ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుతో పాటు.. 31-హుజూరాబాద్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌పై రాష్ట్ర ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు టీఆర్ఎస్ నేతలు.. రఘునందన్ రావు రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేశారని.. […]
టీఆర్ఎస్ విజయోత్సవ సభ తర్వాత ఒక్కొక్కరికి పిచ్చి పడుతుందని వ్యాఖ్యానించారు మంత్రి జగదీష్ రెడ్డి.. నల్గొండ కలెక్టరేట్లో యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు, వానాకాలం ధాన్యం కొనుగోళ్లపై సమావేశం నిర్వహించిన ఆయన.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు.. రాష్ట్రంలో 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిస్తే కేవలం 24 లక్షల టన్నులే తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది, సీఎం కేసీఆర్ చొరవతో 45 లక్షల టన్నులకు పెరిగిందని తెలిపారు.. ఉమ్మడి జిల్లాలో వానాకాలం సీజన్లో వరి సాగు […]
వ్యాక్సినేషన్‌పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన భారత ప్రభుత్వం.. ఈ ఏడాదిలోనే 100 శాతం వ్యాక్సినేషన్ చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది.. అయితే, ఇంకా ప్రజలను అపోహలు వెంటాడుతూనే ఉన్నాయి.. కొందరు ఫస్ట్ డేసు వేసుకోవడానికే ముందుకు రాకపోగా.. మరోవైపు.. ఫస్ట్ డోస్ తర్వాత రెండో డోసు తీసుకోవడానికి కూడా వెనుకడుగు వేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి.. ఇటీవలే వ్యాక్సినేషన్ 100 కోట్ల మార్క్‌ను క్రాస్ చేసి రికార్డు సృష్టించింది. కానీ, ఫస్ట్ డోసు, సెకండ్ డోసులు […]
కరోనా మహమ్మారిపై విజయం సాధించాలంటే ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. దీంతో విస్తృతంగా వ్యాక్సిన్లను పంపిణీ చేస్తోంది ప్రభుత్వం.. అయితే, ఇదే సమయంలో.. సోషల్ మీడియా వేదికగా కొందరు ఫేక్‌గాళ్లు.. వ్యాక్సినేషన్‌పై తప్పుడు ప్రచారానికి తెరలేపుతున్నారు. ఇది నిజమా..? అబద్ధమా..? అని నిర్ధారణకు రాకుండానే.. చాలా మంది లైక్‌లు, షేర్లతో అది కాస్త వైరల్ చేస్తున్నారు. తాజాగా.. వ్యాక్సిన్ తీసుకోనివారికి వచ్చేనెల (నవంబర్ 1వ తేదీ) నుంచి రేషన్, పింఛన్ నిలిపివేసే ఆలోచనలో వైద్యారోగ్య శాఖ ఉందంటూ.. […]