ఒమిక్రాన్ ఎంట్రీతో మరోసారి కరోనా మహమ్మారి రెచ్చిపోతోంది.. థర్డ్ వేవ్ రూపంలో విరుచుకుపడుతోంది.. ఈ సమయంలో.. అన్ని రాష్ట్రాలు ఆంక్షల బాటపడుతున్నాయి.. నైట్ కర్ఫ్యూ, వీకెండ్ లాక్‌డౌన్ అమలు చేస్తున్నాయి కొన్ని రాష్ట్రాలు.. మరికొన్ని చోట్ల 50 శాతం ఆక్యూపెన్సీతో సినిమాల ప్రదర్శనకు అనుమతి ఇస్తున్నారు.. ఇది, పెద్ద సినిమాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది.. ఈ నేపథ్యంలోనే పలు సినిమాలు వాయిదా బాట పట్టాయి.. సంక్రాంతి సీజన్లో విడుదల కావాల్సిన ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ వంటి పాన్ ఇండియా మూవీల విడుదలను వాయిదా వేయగా.. తాజాగా, మరో పాన్ ఇండియా మూవీ రిలీజ్‌కు కూడా బ్రేక్‌లు పడ్డాయి.. కన్నడ స్టార్ హీరో సుదీప్ టైటిల్ పాత్రలో నటించిన విక్రాంత్ రోణ మూవీ కూడా అదే బాటపట్టింది..
Read Also: పంజాబ్ పాలిటిక్స్.. రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు.. అంతా సైలెంట్..!
సుదీప్ హీరోగా అనూప్ భండారి దర్శకత్వంలో విక్రాంత్ రోణ త్రీడీ మూవీగా తెరకెక్కుతోంది.. కానీ, ప్రస్తుతం కరోనా ఉధృతి ఓవైపు.. థియేటర్లలో పూర్తిగా లేని ఆక్యుపెన్సీ వంటి నిబంధనల మరోవైపు.. ఇబ్బందిగా మారిన నేపథ్‌యంలో.. ‘విక్రాంత్ రోణ’ సినిమాను వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు.. ఇక, ఓటీటీలో భారీ ఆఫర్ వచ్చినా ప్రేక్షకులకు థియేట్రికల్ అనుభూతిని ఇవ్వాలనే.. సినిమా విడుదల వాయిదా వేసినట్టు చెబుతున్నారు.. 14 భాషల్లో 55 దేశాల్లో త్రీడీలో ఫిబ్రవరి 24న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు మేకర్స్.. కానీ, కోవిడ్ దెబ్బకు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.