పంజాబ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలు ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే కొనసాగుతూ వచ్చాయి.. సీఎంగా ఉన్న ఓ సీనియర్ నేత పార్టీకి గుడ్‌బై చెప్పి వెళ్లిపోయారు.. ఇక, అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతోన్న సమయంలో.. సీఎం ఓవైపు, పీసీసీ చీఫ్ మరోవైపు.. తమకు తోచినట్టు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. ‘కాంగ్రెస్ పార్టీ లేదా పంజాబ్ కోరుకుంటే త్వరలోనే సీఎం అభ్యర్థిని ప్రకటిస్తుందని అన్నారు’. ఈ ప్రకటనతో చన్నీ వర్సెస్ సిద్ధూల మధ్య పోటీకి తెరపడినట్లు తెలుస్తోంది.. పంజాబ్ ఎన్నికలకు ముందస్తుగా సీఎం అభ్యర్ధి పేరును కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తుందని తెలిపారు రాహుల్.. అయితే, కాంగ్రెస్ పార్టీ, కార్యకర్తలు, పంజాబ్ ప్రజలు కోరుకుంటేనే ముందస్తు ప్రకటన చేస్తామన్నారు.. ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరనేది నిర్ణయంచుకోవాల్సిందిగా పార్టీ కార్యకర్తలను కోరతామన్నారు.. సీఎం చరణ్ జిత్ సింగ్, పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిధ్దుల మధ్య కొనసాగుతున్న వైరం నేపధ్యంలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇక, ఇద్దరు నాయకత్వం వహించలేరు.. కేవలం ఒక్కరే అని స్పష్టం చేశారు.. ఒకరు నాయకత్వం వహిస్తే, మరొకరు పూర్తిగా సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఇద్దరి హృదయాల్లోనూ, కాంగ్రెస్ పార్టీ భావజాలం ఉంది.. ముఖ్యమంత్రి పదవి కోసం పాకులాడబోమని ఇద్దరు నేతలు కూడా బాహాటంగా ప్రజలకు హామీ ఇచ్చారు ఇద్దరు నేతలు.. ఆ తర్వాతనే రాహుల్ గాంధీ ఈ ప్రకటన చేశారు.. అయితే, ముఖ్యమంత్రి అభ్యర్థి పై రాహుల్ గాంధీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని సిధ్ధూ హామీ ఇచ్చారు.. ప్రస్తుత సంక్షోభం నుంచి మనల్ని గట్టెక్కించే వారెవరా అని ప్రజల మనస్సుల్లో ప్రశ్న ఉందన్న ఆయన.. దానికి మార్గం ఏమిటన్నది ప్రజల మనసుల్లో ఉన్న రెండవ ప్రశ్న అన్నారు.. ఇక, ఈ సంస్కరణలను అమలు చేసేది ఎవరన్నది ప్రజల మనసుల్లో ఉన్న మూడవ ప్రశ్న అని చెప్పిన సిద్ధు.. క్రమశిక్షణ గల ఓ సైనికుడి లా రాహుల్ గాంధీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను అని ప్రకటించారు.
కాగా, మేమంతా సమష్టిగా ఉన్నాం.. మేమంతా ఒకరిపై ఒకరు పైచేయి సాధించడం కోసం పోట్లాడుకోవడం లేదు.. మేం పోరాటం అంతా తదుపరి ప్రభుత్వం ఏర్పాటు చేసిందుకు మాత్రమే. అందుకోసం, అవసరమైతే, నాకు నష్టం జరిగినా పర్వాలేదు. గొంతెత్తి మాట్లాడను. కానీ, నిర్ణయాలను తీసుకునే అధికారం, స్వేఛ్చ నివ్వండి. అంతేగాని, నన్ను ఓ “షోపీస్” లాగా వాడుకోవద్దు, చూడవద్దని నిక్కచ్చిగా చెప్పేశాడు రాజకీయనాయకుడిగా మారిన క్రికెటెర్ సిద్ధు.. మరోవైపు.. ముఖ్యమంత్రి ఛన్నీ కూడా మేమంతా ఐక్యంగా ఉన్నామని చూపే ప్రయత్నం చేశారు.. తానెలాంటి పదవి కోసం పాకలాడనని స్పష్టం చేశారు.. కాంగ్రెస్ పార్టీ లో అంతర్గత కుమ్ములాటలున్నాయని కేజ్రీవాల్ లాంటి పార్టీయేతరులు మాట్లాడినట్లుగా మాట్లాడవద్దని చేతులు జోడించి ప్రార్ధిస్తున్నా అని సిధ్దూను ఉద్దేశించి వేడుకున్నారు ముఖ్యమంత్రి ఛన్నీ… మరి పంజాబ్ కాంగ్రెస్‌లో కుమ్మలాటలు ఇకనైనా ఆగుతాయేమో చూడాలి.. కాగా, ఫిబ్రవరి 14వ తేదీన పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండగా, మార్చి 10న ఫలితాలు వెలువడనున్న విషయం తెలిసిందే.