జనసేన అధినేత పవన్ కల్యాణ్.. విశాఖ పర్యటన ఖరారైంది… జనసేనాని పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రకటించింది ఆ పార్టీ.. ఉక్కు పరిరక్షణ పోరాట ఉద్యమానికి సంఘీభావం తెలపనున్న పవన్ కల్యాణ్.. ఈనెల 31 మధ్యాహ్నం ఉక్కు పరిరక్షణ సభలో పాల్గొంటారని వెల్లడించింది.. కాగా, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం వడివడిగా అడుగులు వేస్తుండగా… విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ సాధించుకున్న స్టీల్ ప్లాంట్‌ను వదులుకోవడానికి సిద్ధంగాలేని కార్మిక, ప్రజాసంఘాలు ఆందోళన చేస్తూ వస్తున్నాయి.. వారికి […]
ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ డీలర్ల ఆందోళనకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.. సమస్యను పరిష్కరిస్తామన్న మంత్రి కొడాలి నాని హామీతో వెనక్కు తగ్గారు రేషన్ డీలర్లు.. నవంబర్ కోటా రేషన్‌కు ఇబ్బంది లేకుండా సరఫరా చేస్తామని రేషన్ డీలర్ల అసోసియేషన్ ప్రకటించింది. కాగా.. జీవో నంబర్ 10 రద్దుతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలంటూ రేషన్ డీలర్లు ఆందోళన చేస్తూ వచ్చారు.. సీఎం జగన్ తమ సమస్యలపై స్పందించేంత వరకు నిరసనలు కొనసాగుతాయని ప్రకటించారు.. Read Also : బీజేపీకి […]
భారతీయ జనతా పార్టీ నేతలకు సవాల్ విసిరారు తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి.. సాగు, ధాన్యం కొనుగోళ్ల విషయంలో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తుండగా.. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. బీజేపీకి సవాల్ విసిరారు.. ఇవాళ సాయంత్రం 5 గంటల లోపు కేంద్రం నుంచి తెలంగాణలో యాసంగిలో వేసే ఏ పంట అయిన కొంటాం అని ఉత్తరం తీసుకురావాలన్నారు.. ఒక వేళ లెటర్ తీసుకురాకపోతే పదవులకు బండి సంజయ్, కిషన్ రెడ్డి […]
దళితబంధు పథకంపై దాఖలైన నాలుగు పిటిషన్లను కొట్టివేసింది తెలంగాణ హైకోర్టు.. ఎన్నికల కమిషన్ నిర్ణయం విషయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. హుజురాబాద్‌లో దళితబంధు నిలిపివేయడాన్ని సవాల్ చేస్తూ.. హైకోర్టులో నాలుగు పిటిషన్లు దాఖలయ్యాయి… వాటిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. ఎన్నికల కమిషన్ విషయంలో జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది. ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు రద్దు చేయాలన్న అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు.. ఈసీ నిర్ణయాల్లో జోక్యం చేసుకోమని.. నిష్పక్షపాత ఎన్నికల కోసం తగిన నిర్ణయాలు తీసుకునే అధికారం ఈసీకి […]
మహిళలపై అఘాయిత్యాలకు కొన్ని ప్రాంతాల్లో అడ్డూ అదుపులేకుండా పోతోంది.. ప్రతీరోజూ ఏదో ఒక చోట దారుణమైన ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి.. బయటకు వెళ్తేనే కాదు.. ఇంట్లో ఉన్నా రక్షణలేని పరిస్థితి ఏర్పడింది.. తన పిల్లలతో కలిసి నిద్రిస్తున్న ఓ మహిళ ఇంట్లోకి దూరిన యువకులు.. ఆమెను బెదిరించి సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో కలకలం రేపుతోంది.. ఆ పాశవిక ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జాలౌన్ జిల్లా ఉరయ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో.. […]
భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది… కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. ఏకంగా 3 వేల వరకు కేసులు పెరిగాయి.. ఇక, గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 16,156 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మరో 733 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు వదిలారు.. ఇదే సమయంలో 17,095 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. ఇక, తాజాగా 12,90,900 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.. దీంతో.. ఇప్పటి […]
హైదరాబాద్‌లో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు… ప్రేమకు నిరాకరించిన యువతిపై విచక్షణారహితంగా దాడి చేసినట్టుగా చెబుతున్నారు.. యువతి ఇంట్లోకి చొరబడి.. అమ్మాయి గొంతు, చేతులు, వెళ్లు, కాళ్లు, మనికట్టు ఇలా.. చాలా చోట్ల గాయపరిచాడు.. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వట్టి నాగులపల్లిలో యువతి పై యువకుడి హత్యాయత్నానికి పాల్పడ్డాడు.. యువతి ఇంటికి వచ్చి దాడి చేశాడు ప్రేమ్ సింగ్ అనే యువకుడు.. గొంతు, చేతులు, వెళ్లు, కాళ్లు.. […]
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ఇవాళ జరగనుంది.. సచివాలయంలో ఉదయం 11 గంటలకు సీఎం జగన్ అధ్యక్షతన భేటీ అవుతుంది.. వచ్చే నెలలో అసెంబ్లీ సమావేశాల నిర్వహించాలని భావిస్తున్న ప్రభుత్వం..ఆన్లైన్లో సినిమా టికెట్లు అమ్మకం, సినిమాటోగ్రఫీ చట్ట సవరణ చేసే అర్డినెన్సుకు అమోదం తెలిపే అంశంపైనా చర్చించే ఛాన్సుంది. ఇక, దేవాదాయ స్థలాలు, దుకాణాల లీజుల అంశంపై దేవాదాయశాఖ చట్టసవరణ, దేవాదాయ శాఖలో విజిలెన్స్ అండ్ సెక్యూరిటీవింగ్ ఏర్పాటుపై చర్చించనుంది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల అభివృద్ధి కార్యకలాపాల పర్యవేక్షణ […]
ప్రతీ రోజు పెట్రోల్, డీజిల్‌పై వడ్డిస్తూనే ఉన్నాయి చమురు సంస్థలు.. వరుసగా పెరిగిపోతున్న పెట్రో ధరలు సామాన్యుడికి భారంగా మారుతున్నా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కనికరించడంలేదు.. చమురు ధరలు ప్రత్యక్షంగా కొన్ని రంగాలపై, పరోక్షంగా అన్ని రంగాలపై ప్రభావం చూపుతూ.. సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి.. రోజుకో కొత్త రికార్డు సృష్టిస్తూ పైపైకి కదులున్న పెట్రో ధరలు.. ఇవాళ కూడా పెరిగాయి.. లీటర్ పెట్రోల్‌పై 35 పైసలు, లీటర్ డీజిల్‌పై 38 పైసలు వడ్డించాయి.. తాజా పెంపుతో దేశరాజధాని […]
భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్ అత్యవసర వినియోగపు అనుమతుల కోసం తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.. కానీ, ఎప్పటికప్పుడు అడ్డంకులు వస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అనుతులు వస్తే ప్రపంచ వ్యాప్తంగా కోవాగ్జిన్ వాడటానికి అవకాశం వస్తుంది. ప్రస్తుతం డబ్ల్యూహెచ్‌వో అమోదించిన వ్యాక్సిన్లు తీసుకున్నవారికి మాత్రమే విదేశాలకు ప్రయాణించే అవకాశం ఉంది. దీంతో, కోవాగ్జిన్ తీసుకున్న భారతీయులు విదేశాలకు ప్రయాణించాలంటే ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా విదేశాల్లో చదువుకోవాలనుకుంటున్న విద్యార్థులకు తీవ్ర అడ్డంకులు ఏర్పడుతున్నాయి.నవంబర్ 3న అత్యవసర […]