ఆంధ్రప్రదేశ్‌లో బూతుల పర్వం కాస్త.. కేసుల నమోదుకు దారితీసింది.. అయితే, బాధితుల మీదే కేసులు నమోదు చేస్తున్నారు.. ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు.. తనపై గుంటూరులో కేసు నమోదు చేయడంపై స్పందించిన ఆయన.. బాధితుల మీదే కేసులు పెడుతున్నారు.. ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారని మండిపడ్డారు.. చంపుతామన్న మైదుకూరు ఎమ్మెల్యే మీద ఏం కేసులు పెట్టారు..? అంటూ ఈ సందర్భంగా నిలదీసిన ఆయన.. చంద్రబాబు మీద బాంబులేస్తామన్న కుప్పం […]
కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చే విషయాన్ని గత కొంతకాలంగా వాయిదా వేస్తూ వచ్చిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు సిద్ధమైంది.. మరో 24 గంటల్లోగా కోవాగ్జిన్‌పై గుడ్‌న్యూస్ చెబుతాం అంటున్నారు డబ్ల్యూహెచ్‌వో ప్రతినిధులు. కోవాగ్జిన్ వ్యాక్సిన్‌కు సంబంధించిన మరింత డేటాను భారత్ బయోటెక్.. డబ్ల్యూహెచ్‌వోకి సమర్పించింది.. దీనిపై ఇవాళ డబ్ల్యూహెచ్‌వో సాంకేతిక కమిటీ సమీక్ష నిర్వహించింది. ఈ సందర్భంగా.. 24 గంటల్లో కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి ఆమోదం లభించే అవకాశం […]
తన వ్యాఖ్యలతో ఒక్కసారిగా ఏపీ రాజకీయాల్లో ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించిన టీడీపీ నేత పట్టాభిరామ్.. సీఎం వైఎస్ జగన్‌పై చేసిన వ్యాఖ్యలకు గాను అరెస్ట్ కావడం, జైలుకు పోవడం.. బెయిల్‌పై విడుదల కావడం అన్నీ జరిగిపోయాయి.. అయితే, ఆ తర్వాత ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.. ఎక్కడున్నారు అనేది తెలియదు. ఇదే సమయంలో.. ఆయన మాల్దీవ్స్ వెళ్లారంటూ సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు, వీడియోలు రచ్చ చేశాయి.. విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చిన పట్టాభి.. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి […]
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనను ముగించుకుని తిరుగు ప్రయాణం అయ్యారు.. ఏపీలో పరిణామాలపై ఫిర్యాదు చేసేందుకు హస్తినకు వెళ్లింది చంద్రబాబు టీమ్.. అయితే, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సమావేశానికి ప్రయత్నించి విఫలం అయినట్టుగా తెలుస్తోంది.. దీంతో.. హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కినట్టుగా చెబుతున్నారు.. కానీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమయం ఇచ్చినప్పుడు మళ్లీ ఢిల్లీకి వచ్చేందుకు చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.. ఇక, ఇంగ్లీషు, హిందీ (జాతీయ మీడియా) మీడియా […]
బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు సవాల్ విసిరారు ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి… కడపలో మీడియాతో మాట్లాడిన ఆయన.. సోము వీర్రాజు ఆరోపణలపై స్పందించారు.. విభజన చట్టంలో స్పెషల్ స్టేటస్, పోర్టు వంటి హామీలు అమలు చేస్తే మద్దతు ఇస్తామన్న ఆయన.. కానీ, సోము వీర్రాజు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.. బీజేపీ విభజన హామీలు అమలు చేయలేదని అర్థమైందని ఎద్దేవా చేసిన శ్రీకాంత్ రెడ్డి.. తాను ఇసుక వ్యాపారం చేస్తున్నానని సోము వీర్రాజు అంటున్నారు… […]
తెలంగాణ పేరు వినిపిస్తేనే నిర్బంధం నుంచి గొంతు పిక్కటిళ్లేలా జై తెలంగాణ నినాదం ఎత్తుకున్న వరకు ఉద్యమనేతగా… తెలంగాణ సాధకుడిగా అశేష ఖ్యాతి సాధించిన కేసీఆర్.. మరో ఘనత సాధించారు. పద్నాలుగేళ్ల సుదీర్ఘ ఉద్యమంతో తెలంగాణ సాధించి.. స్వరాష్ట్రంలో తిరుగులేని నేతగా ఎదిగిన కేసీఆర్ మరో సారి అరుదైన ఘనతను సాధించారు. టీఆర్ఎస్ ప్లీనరీలో.. మరోసారి పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. దేశంలో.. అత్యధికాలం పాటు ఒక పార్టీకి అధ్యక్షుడిగా కొనసాగిన నేతల జాబితాలో చేరారు కేసీఆర్. హైదరాబాద్ […]
కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ సృష్టించిన విలయం అంతా ఇంత కాదు.. ప్రపంచ వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గిపోతూ వచ్చిన సమయంలో.. మళ్లీ సాధారణ పరిస్థితులు రానున్నాయని ఆశగా ఎదురుచూశారు.. కానీ, కరోనా మహమ్మారి పుట్టినిల్లు చైనా ఆ తర్వాత రష్యా, యూకే, అమెరికా.. ఇలా పలు దేశాల్లో క్రమంగా రోజువారి కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది.. ఈ సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక వ్యాఖ్యలు చేసింది.. కరోనా మహమ్మారి ఇంకా తగ్గలేదని, […]
కరోనా పాజిటివ్ కేసుల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతూనే ఉన్నాయి.. అయితే, కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో.. క్రమంగా అన్ని రాష్ట్రాల్లో స్కూళ్లు, విద్యా సంస్థలు అన్ని ఓపెన్ చేశారు.. కానీ, ఇప్పుడు విద్యార్థులు, ఉపాధ్యాయులు అక్కడక్కడ కరోనా బారినపడడం కలవరానికి గురిచేస్తోంది.. మరో విషయం ఏటంటే.. హిమాచల్‌ప్రదేశ్‌లో నెల రోజుల వ్యవధిలోనే ఏకంగా 550 మందికిపైగా విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్య అధికారి వెల్లడించారు.. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ […]
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి భారీ ఊరట లభించింది.. రేవంత్‌రెడ్డిపై నమోదైన మూడు కేసులను కొట్టివేసింది కోర్టు.. మహబూబాబాద్, చిక్కడపల్లి, ఉస్మానియా యూనివర్సిటీలో పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులపై ఇవాళ విచారణ జరిపిన ప్రజా ప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం.. ఆ మూడు కేసులను కొట్టివేసింది.. రేవంత్‌రెడ్డి అనుమతి లేకుండా కార్యక్రమాలు నిర్వహించారన్న అభియోగాలను తోసిపుచ్చింది.. అభియోగాలకు తగిన ఆధారాలు లేకపోవడంతో రేవంత్ రెడ్డిపై ఈ మూడు కేసులు వీగిపోయాయి.. కాగా, ప్రజాప్రతినిధులపై నమోదైన కేసుల విచారణ […]
హైదరాబాద్ వేదికగా జరిగిన గులాబీ పండుగ (టీఆర్ఎస్ పార్టీ ఫ్లీనరీ) సమావేశాలు ముగిశాయి… దాదాపు 8 గంటలపాటు వివిధ అంశాలపై చర్చ సాగింది.. మొత్తం 7 తీర్మానాలపై ప్లీనరీలో చర్చించింది ఆమోదం తెలిపారు.. అందులో కీలకమైనది పార్టీ బైలాస్‌లో పలు సవరణలకు ప్లీనరీ ఆమోదించడం.. పార్టీ ప్రెసిడెంట్ అందుబాటులో లేకపోతే వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు నిర్వహించేలా తీర్మానం చేశారు.. దీంతో.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న కేటీఆర్‌కు మరిన్ని పవర్స్ ఇచ్చినట్టు అయ్యింది.. ఇక, బీసీ గణన, […]