సోమువీర్రాజు తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి.. క్షమాపణ చెప్పాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. కడప ఎయిర్‌పోర్టు విషయంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.. అయితే, ఆయన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి.. బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఓ ప్రాంత ప్రజల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్న ఆయన.. కడప ప్రజలు మనుషులను చంపుతారని వారికి ఎయిర్ పోర్టు అవసరమా అని సోమువీర్రాజు వ్యాఖ్యలు చేయడం శోచనీయం అన్నారు.. ఆయన తన మాటలు వెంటనే వెనక్కు తీసుకోవాలి.. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Read Also: డ్రగ్స్‌పై ముగిసిన డీజీపీ సమీక్ష.. వాళ్ల చిట్టా సిద్ధం..
Also Read
- Land Fraud: కృష్ణా జిల్లాలో సంచలనం.. ఇలా కూడా స్థలాలు కబ్జా చేస్తారా?
- Secretariat Employees: సచివాలయ ఉద్యోగుల ఆందోళన.. ధర్నాచౌక్ వద్ద ఉద్రిక్తత!
- Tribal Boy: అత్యవసర పరిస్థితి.. తాడు పట్టుకుని వాగు దాటిన గిరిజన బాలుడు!
- Chintur Rains: చింతూరు ఏజెన్సీలో తగ్గుముఖం పట్టిన వర్షాలు.. కూనవరం వద్ద 30 అడుగులకు చేరిన గోదావరి!
లాభాల కోసం సినిమాల్లో ఆ ప్రాంత సాంస్కృతిని దిగజార్చారని మండిపడ్డారు శ్రీకాంత్ రెడ్డి.. ఆ ప్రాంతంలో బీజేపీ జెండా పట్టుకుని తిరిగే వారున్నారు.. వాళ్లయినా, సోము వీర్రాజు అయినా ఈ వ్యాఖ్యలపై సిగ్గుపడాలన్న ఆయన.. రాయల సీమ ప్రజలను ఫ్యాక్షనిస్టులుగా చిత్రీకరణ చేశారు.. రాష్ట్రంలో ఏ ప్రాంతాల్లో ఎఫ్ఐఆర్ లు నమోదు అవుతూన్నాయో సోము వీర్రాజు చూడాలని హితవుపలికారు.. వెంటనే ఆయన వ్యాఖ్యలు వెనక్కు తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.. రాయల సీమ సంస్కృతిని సినిమాల్లోనే కించపరిచేలా వ్యవహరించారని.. టీడీపీ తన పబ్బం గడుపుకోవడం కోసం ఫ్యాక్షన్ గొడవలు రేపిందని ఆరోపించిన ఆయన.. మద్దెలచెరువు సూరికి కూడా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేందుకు తిరస్కరించిన ఘనత వైఎస్ ది అని గుర్తుచేశారు.. టీడీపీ పెట్టె వ్యూహాత్మక సమావేశాలకు కుట్ర మీటింగ్‌లని పేరు పెట్టుకోవాలని ఎద్దేవా చేశారు శ్రీకాంత్‌రెడ్డి.
తాజావార్తలు
-
Kishan Reddy: మేము ఓట్లను చోరీ చేయం.. ప్రజల మనసులను గెలుచుకుంటాం..
-
Aadhaar Biometric Update: ఆధార్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఆ ఫ్రీ అప్డెట్కు సెప్టెంబర్ 30 చివరి తేదీ!
-
CM Vijay: కరూర్ తొక్కిసలాటకు ఏడాది.. ‘ఎప్పటికీ మానని గాయం’ అంటూ సీఎం విజయ్ భావోద్వేగం
-
SS Rajamouli 25 Years: కథలు మారాయి, హీరోలు మారారు.. కానీ జక్కన్న ఆలోచన మాత్రం మారలేదు!
-
Pongal 2027 : ఇది అసలైన పోటీ అంటే.. సంక్రాంతి బరిలో సూపర్ స్టార్ రజనీ
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?