భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభణ తగ్గినా.. ఇతర దేశాల్లో మళ్లీ భారీగా కొత్త కేసులు వెలుగు చూస్తుండడంతో.. థర్డ్ వేవ్ తప్పదా? అనే ఆందోళనకు నెలకొన్నాయి.. ఓవైపు కోవిడ్ పోయిందనే భావనతో నిబంధనలు సడలిస్తూ వస్తున్న సమయంలో.. మళ్లీ మహమ్మారి విరుచుకుపడుతుందేమోన్న టెన్షన్ వెంటాడుతోంది. ఇక, కరోనా బారినపడుతున్నవారిలో యువతే ఎక్కువగా ఉన్నారని ప్రభుత్వ నివేదికలు చెబుతున్నాయి.. తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో 20 ఏళ్లలోపు యువతే 90,561 మంది ఉన్నారని పేర్కొంది. పదేళ్లలోపు […]
మేషం : ఈ రోజు ఈ రాశిలోని చేతివృత్తుల వారికి ఓర్పు, నేర్పు ఎంతో అవసరం. కొన్ని అనుకోని సంఘటనలు మనస్థిమితం లేకుండా చేస్తాయి. మీ సంతానం భవిష్యత్ గురించి కొత్త కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ రంగాల్లో వారికి సదవకాశాలు లభిస్తాయి. వృషభం : ఈ రోజు ఈరాశివారికి ప్రైవేటు సంస్థల్లో సదవకాశాలు లభిస్తాయి. బ్యాంకింగ్ పనులు మందకొడిగా సాగుతాయి. ఇతరులకు వాదోపవాదాలకు దూరంగా ఉండటం మంచిది. సేవ, సందర్భానికి అనుగుణంగా మీ కార్యక్రమాలు, […]
ఫ్రెంచ్ ప్రభుత్వం ఆహ్వానం మేరకు ఫ్రాన్స్ వెళ్లిన తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ బిజీగా గడిపేస్తున్నారు.. నాలుగు రోజుల పాటు ఈ పర్యటన కొనసాగనుండగా.. ప్యారిస్‌లో జరగనున్న సమావేశాల్లో కేటీఆర్ బృందం పాల్గొననుంది.. ఇక, ఫ్రాన్స్ పర్యటన తొలిరోజున మంత్రి కేటీఆర్ ఫ్రెంచ్ ప్రభుత్వ డిజిటల్ అఫైర్స్ అంబాసిడర్ హెన్రీ వర్డియర్తో సమావేశం అయ్యారు. ఇన్నోవేషన్, డిజిటలైజేషన్, ఓపెన్ డేటా వంటి ఫ్రాన్స్, తెలంగాణ మధ్య పరస్పర సహకారం అందించుకునే అవకాశం గురించి ఈ […]
ఆంధ్రప్రదేశ్‌లో బూతుల వ్యవహారం ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది.. ఆ తర్వాత దీక్షలు, ఆందోళనలు, నిరసనలు ఇలా ఒక్కటేంటి.. బూతులు వెతికిమరీ తిట్టేస్థాయికి వెళ్లిపోయింది. ఆ తర్వాత చంద్రబాబు హస్తిన పర్యటనకు కూడా హాట్ టాపిక్‌గా మారిపోయింది.. అయితే, ఈ పరిణామాల నేపథ్యంలో.. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌తో భేటీకి సిద్ధం అయ్యారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. రేపు సాయంత్రం 5.30 గంటలకు రాజ్‌భవన్ వెళ్లనున్న ఏపీ సీఎం వైఎస్ జగన్.. గవర్నర్‌తో సమావేశం కానున్నారు.. టీడీపీ […]
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ప్రలోభాల పర్వంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ సాగుతోంది.. అక్కడ అంత డబ్బు పంచుతున్నారాట.. ఈ బ్రాండ్ లిక్కర్ ఇస్తున్నారట అనే గుసగుసలు వినిపిస్తున్నాయి.. ఇక, ఈ ఎన్నికలపై బెట్టింగ్‌లు కూడా నడుస్తున్నాయట.. అయితే, హుజురాబాద్ ఉప ఎన్నికల వ్యవహారం ఇప్పుడు మానవ హక్కుల కమిషన్‌కు చేరింది.. డబ్బులు, మద్యం పంపిణీపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో ఓ న్యాయవాది ఫిర్యాదు చేశారు. హుజురాబాద్ ఉపఎన్నికల ప్రచారం నేటితో ముగియగా.. రాజకీయ పార్టీల అభ్యర్థులు […]
తెలంగాణ ప్రజలు మొత్తం హుజురాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలను ఆసక్తిగా పరిశీలిస్తున్నారు.. ఇప్పటికే ప్రచార పర్వానికి తెరపడగా.. ప్రలోభాలకు తెరలేపారు.. వాస్తవానికి హుజురాబాద్‌లో గత రెండు మూడు రోజులుగా డబ్బుల పంపిణీ జరుగుతుందనే ప్రచారం సాగుతోంది. అయితే, ఇప్పుడు తమకు డబ్బులు ఇవ్వలేదంటూ ఓటర్లు ఏకంగా రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగడం హాట్‌టాపిక్‌గా మారిపోయింది.. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలంలోని రాంపూర్‌లో ఓ పార్టీకి చెందిన నేతలు.. కొంతమంది ఓటర్లకే డబ్బులు పంచారట.. మరికొంత మందికి మరిచారో […]
పెట్రో ధరల మంట మండుతోంది.. పెట్రోల్ బంక్‌కు వెళ్లాలంటేనే వెనుకడుగు వేయాల్సిన పరిస్థితి దాపురించింది.. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో రూ.110ను క్రాస్ చేసింది లీటర్ పెట్రోల్ ధర.. ఇక, డీజిల్ ధర కూడా తానే తక్కువ అనే స్థాయిలో పెరుగుతూనే ఉంది.. తాజాగా మధ్యప్రదేశ్‌లోని ఓ జిల్లాలో ఏకంగా లీటరు పెట్రోల్ ధర ఏకంగా రూ.120 మార్కును కూడా దాటేసింది.. డీజిల్ ధర రూ.110కిపైగానే ఉండడంతో.. ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. పూర్తి […]
టీ 20 వరల్డ్ కప్‌లో ప్రతీ మ్యాచ్ ఉత్కంఠగా సాగుతున్నాయి.. ఇక, భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ అంటేనే హై ఓల్టేజ్.. ఆ మ్యాచ్‌లో భారత్‌తో ఓటమిని సగటు భారతీయుడు ఇప్పటికీ జీర్ణించుకోలేక పోతున్నాడు.. మరోవైపు.. భారత్‌లో కొందరు సంబరాలు చేసుకున్న ఘటనలు కూడా వెలుగు చూస్తున్నాయి.. టీ 20 వరల్డ్ కప్ పోటీల్లో భారత్‌పై పాక్ మ్యాచ్ గెలిచాక బాణాసంచా కాల్చిన వారిపై సీరియస్ అయ్యింది ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యానాథ్ సర్కార్.. ఆగ్రా, బరేలీ, బదాయూ, సీతాపూర్‌లో […]
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ పలు కీలక అంశాలపై ఫోకస్ పెట్టింది.. రేపు ఉదయం 11 గంటలకు సచివాలయంలో సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది.. ఇక, ఈ సమావేశంలో చర్చించనున్న అంశాలను పరిశీలిస్తే.. ఆన్లైన్లో సినిమా టికెట్లు అమ్మకాలకు వీలు కల్పించేలా ఆర్డినెన్సుకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది.. సినిమాటోగ్రఫీ చట్ట సవరణ చేసే అర్డినెన్సుకు అమోదం తెలపనుంది.. ఇక, వచ్చే నెలలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్న ఏపీ ప్రభుత్వం.. అసెంబ్లీ సమావేశాల […]
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. పులివెందుల కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది సీబీఐ.. ఈ కేసులో గంగిరెడ్డి, సునీల్ యాదశ్, ఉమా శంకర్‌రెడ్డి, దస్తగిరిపై అభియోగాలు మోపింది.. వివేకానందరెడ్డి మృతికి ఆ నలుగురు కారణమని పేర్కొంది.. ఇక, ఈ కేసులో నిందితులైనవారిని ఆగస్టు, సెప్టెంబర్‌లో అరెస్టు చేశామని.. అరెస్ట్ చేసిన నిందితులను జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించామని తెలిపింది. మరోవైపు, ఇద్దరు నిందితులకు కోర్టు బెయిల్ […]