కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఆయా దేశాలు ఆంక్షలు సడలిస్తూ వస్తున్నాయి.. ఈ నేపథ్యంలో.. భారతీయులకు గుడ్‌న్యూస్ చెప్పింది కెనడా సర్కార్.. భారత్ నుంచి నేరుగానైనా లేదా గల్ఫ్/యూరప్/అమెరికా నుంచి వచ్చే ప్రయాణికులకు కోవిడ్ నిబంధనలను సడలిస్తూ నిర్ణయం తీసుకుంది కెనడా.. కాగా, ఒమిక్రాన్ వేరియంట్ వెలుగుచూసిన తర్వాత కట్టడి చర్యల్లో భాగంగా చాలా దేశాలు ఆంక్షల బాటపట్టాయి.. ముఖ్యంగా విదేశీ ప్రయాణికుల విషయంలో కఠినంగా వ్యవహరించాయి.. ఇదే సమయంలో.. కెనడా కూడా ఆంక్షలు విధించి.. ఆ దేశానికి బయల్దేరడానికి 18 గంటల ముందుగా ఆర్టీపీసీఆర్ నెగిటివ్ సర్టిఫికెట్‌తో రావాలని.. సింగిల్ స్టాప్‌లో వచ్చే ప్రయాణికులైతే మార్గమధ్యంలోని ఎయిర్‌పోర్టులో కూడా నెగటివ్ సర్టిఫికేట్ తీసుకోవాలంటూ నిబంధనలు విధించింది.. ఇక, అక్కడ అడుగుపెట్టిన తర్వాత క్వారంటైన్ నిబంధనలు కూడా విధించింది.. దీంతో.. అనేక మంది భారతీయులు గల్ఫ్ దేశాల్లో క్వారంటైన్ సెంటర్లకు వెళ్లి ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు కూడా తలెత్తాయి..
Read Also: ఇవి తినండి.. కోవిడ్ నుంచి త్వరగా కోలుకోండి..
అయితే, ఒమిక్రాన్ విజృంభణ కాస్త తగ్గుతుండడంతో.. మళ్లీ కొన్ని దేశాలు ఆంక్షలు సడలిస్తూ వస్తున్నాయి.. కెనడా ప్రభుత్వం తాజాగా సడలించిన నిబంధనల ప్రకారం ఇండియా నుంచి నేరుగా లేదా సింగిల్ స్టాప్‌లో వచ్చే ప్రయాణికులకు 18 గంటల కోవిడ్ సర్టిఫికేట్ నుంచి మినహాయింపు ఇచ్చింది.. అయితే, 72 గంటల ముందు టెస్ట్ చేయించిన కోవిడ్ నెగటివ్ సర్టిఫికేట్ ఒక్కటి ఉంటే చాలని స్పష్టం చేసింది.. భారత్‌తో పాటు మొరాకోకు కూడా ఈ మినహాయింపును వర్తింప చేస్తున్నట్టు ప్రకటించింది.